పెమ్మసాని నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 6:
[[Image:Gandikota part of the fort.JPG|thumb|గండికోట ప్రాకారములోని కొంత భాగము]]
 
1369వ<ref>రాబర్ట్ సెవెల్, విజయనగర ఎంపైర్</ref> సంవత్సరములో ఓరుగల్లు సామ్రాజ్య పాలకులైన ముసునూరి నాయకుల పతనం తరువాత వీరు [[విజయనగరము]]నకు తరలిపోయి ఆ తరువాత మూడు శతాబ్దములు దక్షిణ భారతదేశమును [[హిందూమతము]]<nowiki/>ను రక్షించుటకు పాటుపడిరి.
 
==మూలము==
 
చారిత్రకాధారములను బట్టి పెమ్మసాని నాయకుల వంశానికి మూలపురుషుడు వేంకటపతి నాయుడు. ఈతను [[బుక్కరాయలు (అయోమయ నివృత్తి)|బుక్కరాయ]]<nowiki/>ల కడ సేనాధిపతిగా పనిచేసెను. పిమ్మట కుమార తిమ్మా నాయుడు బుక్కరాయనికి పలుయుద్ధములలో తోడ్పడెను. కుమారతిమ్మ [[జమ్మలమడుగు]], [[వజ్రకరూరు]], [[కమలాపురం]], [[తాడిపత్రి]], [[పామిడి]]లలో కోటలు కట్టించెను. వీరు కమ్మ కులస్తులు.
 
==తిమ్మా నాయుడు==
పెమ్మసాని వంశమునకు యశః కీర్తులు సాధించినవాడు తిమ్మా నాయుడు. ప్రౌఢ దేవరాయలవద్ద (రెండవ దేవరాయ; 1420-1448) సేనాధిపతిగా [[గుల్బర్గా]] [[యుద్ధం|యుద్ధము]]<nowiki/>లో అహమ్మదు షాను వోడించి యాడకి పరగణాను 1422 లో బహుమతిగా పొందెను. క్రమముగా [[గుత్తి]], [[గండికోట]]<nowiki/>లను కూడా తన ఆధీనములోనికి తెచ్చుకొనెను. గండికోటను శత్రుదుర్భేద్యమగు కోటగా బలపరిచెను. తిమ్మానాయుని ప్రాభవము [[కృష్ణా నది]] నుండి [[అనంతపురము]]వరకు వ్యాపించెను. ఈతని సంవత్సర ఆదాయము ఇరువది ఇదు లక్షలు కాగా తొమ్మిది లక్షలు [[విజయనగరం|విజయనగర]] రాజునకు కప్పముగా చెల్లించుచుండెను. నాణెములు వీరభద్రుని బొమ్మతో ముద్రించెను. పెక్కు సంవత్సరములు పరిపాలించి పలు దేవాలయములు, చెరువులు, ఆరామములు కట్టించెను. ఈతని తరువాత [[కొడుకు]] వీరతిమ్మా నాయుడు రాజ్యము చెసెను.
 
==రామలింగ నాయుడు==
వీరతిమ్మానాయునికి చెన్నప్పయను [[కొడుకు|కుమారుడు]] గలడు. చెన్నప్పకు రామలింగ, పెద్దతిమ్మ అను ఇద్దరు కొడుకులు గలరు. వీరిలో రామలింగ నాయుడు మహాయోధునిగా బహుళ పేరుప్రఖ్యాతులు సంపాదించెను. రామలింగ గండికోటను 1509 నుండి 1530 వరకు పాలించెను. ఈతనివద్ద మహాయోధులగు 80,000 [[సైనికులు]] గలరు. [[విజయనగరము]]<nowiki/>లో బస చేయుటకు 1430 కుంటల స్థలము గలదు. [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]]<nowiki/>కు సామంతునిగా, యుద్ధసమయములలో ముఖ్య సేనాధిపతిగా వ్యవహరించుచు గుల్బర్గా, [[గోల్కొండ]], అహమ్మదునగరు సేనలపై ఒకేమారి విజయము సాధించి కృష్ణదేవరాయనికి విశ్వాసపాత్రుడయ్యెను. [[రాయచూరి యుద్ధము]]లో అవిక్రపరాక్రముడై విజ్రింభించి అహమ్మదు షా గుడారపు త్రాళ్ళు కోసి సుల్తానును పారద్రోలెను. పెమ్మసాని నరసింహనాయుడు రాయచూరి యుద్ధములో తన అన్నకొడుకైన రామలింగ నాయుని పరాక్రమాలను కొనియాడుతూ ఒక చాటు పద్యములో "ముగ్గురు వజీరులను ముక్కపరిచె" అని చెప్పెనని [[రాయవాచకము]] ఉటంకిస్తున్నది.<ref>[http://books.google.com/books?id=nLYPejP-iE8C&pg=PA204&dq=gandikota+battle&lr=&client=firefox-a&sig=ACfU3U2bgZGCj0uDPl7vOWKSx1GffI6G_g Tidings of the king By Phillip B. Wagoner పేజీ.204]</ref> రామలింగ [[అనంతపూరు]] మండలములో పలు [[దేవాలయం|దేవాలయము]]<nowiki/>లు కట్టించెను.
 
రామలింగనాయుని తమ్ముడు పెద్దతిమ్మానాయుడు కూడా మహా యోధుడు. ఈతడు దస్తూరు ఖాను అను సేనాధిపతిని వధించి రాయలవారి అభిమానమునకు పాత్రుడయ్యెను.
 
==రెండవ తిమ్మా నాయుడు==
రెండవ తిమ్మానాయుడు కృష్ణదేవరాయని [[ఉత్కళ]]<nowiki/>దేశ దండయాత్రలో పాల్గొని [[ఉదయగిరి]], [[అద్దంకి]], [[కొండపల్లి]], [[రాజమహేంద్రవరము]], కటకము ([[కటక్]]) లను జయించెను. రాయలవారి [[ఉమ్మత్తూరు]] దండయాత్రలో ముఖ్యపాత్ర పోషించెను.
 
==బంగారుతిమ్మా నాయుడు==
1529వ సంవత్సరములో రాయలవారు మరణించిరి. అల్లుడగు రామ రాయలు [[సింహాసనం|సింహాసన]]<nowiki/>మెక్కెను. [[బహమనీ సుల్తానులు|బహమనీ సుల్తాను]] ప్రోద్బలముతో సలకము తిమ్మరాజు విజయనగరముపై దండెత్తెను. రామరాయలు గండికోటకు పారిపోయిరాగా బంగారుతిమ్మ ఆతనికి ఆశ్రయమిచ్చి తిమ్మరాజుపై [[యుద్ధము]]<nowiki/>నకు వెడలెను. కోమలి వద్ద జరిగిన పోరులో సలకము రాజుని సంహరించి బహమనీ సైన్యమును పారద్రోలి రామ రాయలను విజయనగర సింహాసనముపై అధిష్ఠించెను. ఈ ఉదంతము పెమ్మసానివారి స్వామిభక్తికి, విశ్వాసమునకు, విజయనగరసామ్రాజ్య రక్షణాతత్పరతకు తార్కాణము.
 
[[తళ్ళికోట యుద్ధము]] తరువాత విజయనగర రాజ్యము [[పెనుగొండ]]కు తరలిపోయెను. ఈ సమయమున [[శ్రీరంగరాయలు]], వేంకటపతిరాయలకు అండగా పెదవీరానాయుడు అటుపిమ్మట బొజ్జతిమ్మానాయుడు, వేంకటగిరినాయుడు బీజాపూరు [[గోల్కొండ]] సైన్యములతో తలపడుచూ రాజ్యావశేషములను కాపాడుతూ వచ్చిరి.
"https://te.wikipedia.org/wiki/పెమ్మసాని_నాయకులు" నుండి వెలికితీశారు