"మల్లంపల్లి సోమశేఖర శర్మ" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
| occupation = చారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్రవేత్త
}}
'''[[మల్లంపల్లి సోమశేఖర శర్మ]]''' సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్రజ్ఞుడు. [[విజ్ఞాన సర్వస్వం]] ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పోడూరు]] మండలంలోని [[మినిమించిలిపాడు]]లో డిసెంబరు 9 వ తేదిన శ్రీమతి నాగమ్మ, భద్రరయ్య గార్లకు [[1891]] లో జన్మించాడు. ఈయన గృహ నామమైన మల్లంపల్లి అనే గ్రామం తెలంగాణలోని "పాలకూరు"కి "బమ్మెర"కు సమీపమున నున్న గ్రామం కాకతీయ పతనానంతరం శర్మ గారి పూర్వీకులు అక్కడ నుంచి గోదావరి మండలానికి తరలి వచ్చారని తెలుస్తుంది. సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి. సాహిత్యరంగంలోను, రాజకీయ రంగంలోను ప్రసిద్ధి గాంచాడు. [[బిపిన్ చంద్రపాల్]] ప్రసంగాల ప్రభావం ఈయన మీద ఉండటం వల్ల [[రాజమహేంద్రవరం]]<nowiki/>లో విద్యార్థులు వందేమాతర ఉద్యమం చేపట్టాడు.<ref name="BSL">డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు వ్యాఖ్య. ''బౌద్ధము-ఆంధ్రము'' అనే వ్యాస సంకలనం నుండి</ref>
 
== జీవిత విశేషాలు ==
లిపి శాస్త్రంలోనే గాక ఆంధ్ర వాస్తు శిల్ప స్వభావ నిరూపణలో, ప్రతిమా స్వరూప నిర్ణయంలో శర్మ నిష్ణాతుడు. '''అమరావతీ స్తూపము''' అన్న అతని రచన ఇందుకు తార్కాణము. మొగల్‌రాజపురంలోని దుర్గ గుహలో [[మూలవిరాట్]] స్థానంలో అస్పష్టంగా ఉన్న కుడ్య శిల్పాన్ని గుర్తించి అది అర్ధ నారీశ్వర మూర్తి అని సహేతుకంగా నిరూపించాడు.
 
సోమశేఖర శర్మ తన అధ్యయనాన్ని ఎక్కువగా మధ్య ఆంధ్ర యుగ చరిత్రపై సాగించాడు. సమస్యా భూయిష్టమైన [[వేంగి చాళుక్యులు|వేంగి చాళుక్యుల]] కాల నిర్ణయంపై కూలంకషంగా కృషిచేశాడు. [[కాకతీయులు]] అన్నా, [[తెలంగాణ]]మన్నా శర్మకు ప్రత్యేక అభిమానం. ఆ ప్రాంతం రాజవంశాలకు సంబంధించి 80కి పైగా శాసనాలను లఘు వ్యాఖ్యలతో ప్రచురించాడు. తన మిత్రుడు [[నేలటూరు వెంకటరమణయ్య]]తో కలిసి ఆచార్య యజ్దానీ సంపాదకత్వంలో వెలువడిన 'Early History of Deccan'లో సమగ్రమైన కాకతీయుల చరిత్రను వ్రాశాడు. [[కాకతీయులు|కాకతీయుల]] తరువాత సాగిన ''అంధకార యుగం'' అనుకొనే సమయం గురించి పరిశోధించాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో [[ముసునూరు కాపయ నాయకుడు]], [[ముసునూరు ప్రోలయ నాయకుడు]] తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు [[ఓరుగల్లు]]<nowiki/>ను ఆక్రమించడం గురించి శర్మ తన ''Forgotten Chapter of Andhra History''లో వివరించాడు. ఈ "ముసునూరు యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు.<ref name="BSL"/>
 
అయితే సోమశేఖర శర్మ పరిశోధనలలో అగ్రస్థానం వహించే రచన ''The History of Reddi Kingdom and Kondaveedu and Rajahmundry''. అసంఖ్యాకమైన శాసనాలనూ, కవుల కావ్యాలనూ, [[ముస్లిం]] చరిత్రకారుల రచనలనూ పరిశోధించి, నమ్మదగిన సమాచారాన్ని నిగ్గుదేల్చి తయారు చేసిన ఉత్తమ రచన ఇది. ఆంధ్ర దేశానికి చెందిన [[విజయనగరం|విజయనగర]], [[వెలమ]], [[బహమనీ సుల్తానులు|బహమనీ]], [[ముసునూరు]] రాజ్యాల చరిత్రనూ, ఆ రాజ్యాల మధ్య సంబంధాలనూ వివరించే ఆంధ్ర చరిత్ర ఇది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2990731" నుండి వెలికితీశారు