రుంజ వాయిద్యం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలం, typos fixed: ె → ే
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
ఆంధ్ర దేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు, ఈ రుంజ వాయిద్య కళా రూపం కూడా విశిష్టమైంది. అయితే ఈ కళారూపం ఆంధ్ర దేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నదని చెప్పలేం. కాని విశ్వబ్రాహ్మణులు ఏ మూల నున్నా ఈ కళా రూపం వారి దగ్గరకు చేరేది. విశ్వ బ్రాహ్మణులను ఆశ్రయిస్తూ వారిని అరాధిస్తూ వారిపై ఆధార పడిన వారు రుంజ వారు. రుంజ అనే వాయిద్య పరికరానికి రౌంజ అనే నామాంతరం కూడా ఉంది. దీనికి సం బంధించిన ఒక కథ ఈ విధంగా ప్రచారంలో ఉంది.
==రుంజలు==
తెలుగు కులాలలోని కొన్ని కులాలను ఆశ్రిత (కులాలు) జాతులు ఉన్నాయి. వీటినే పరిశోధకులు, జానపదవృత్తి గాయకులు అని వ్యవహరిస్తుంటారు. వీరు[[విప్రవినోదులు]], [[పుచ్చుకుంట్లు]], [[రుంజలు]], [[పొడాపోతలవారు]], మాలమాష్టివారు మొదలగు కులాలు వారున్నారు. వీరు ఆయా దాతృకులాల వారిని ఆశ్రయించి గోత్రాలు పొగడి వారి వంశ చరిత్రలు పాది జీవనోపాధి పొందేవారు. ఉదా: బ్రాహ్మణులకు విప్రవినోది, వైశ్య (కోమటి) లకు [[వీరముష్టి]], గొల్లలకు పొడపోతలు లేదా మందెచ్చులు వారు, మాల కులస్తులకు [[మాలమాష్టివారు]] మొదలగు వారున్నారు. అలాగే [[విశ్వబ్రాహ్మణులు|విశ్వ బ్రాహ్మణులకు]] (విశ్వకర్మ బ్రాహ్మణులు) గోత్రాలను, వంశానామాలను పొగడి [[విశ్వకర్మ]] పురాణం చెప్పేవారే '''రుంజలు'''. వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ దీని శబ్దం కూడా రెండు, మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు. రుంజ కారుడు మోయలేని [[బరువు]]<nowiki/>గానే దీనిని మోస్తుంటరు. "నా సంసార బరువును అది మోస్తున్నపుడు దీని బరువును మెము మోయలేమా" అని ఆ కళాకారులంటారు.
 
==రుంజ కథా గానం==
విశ్వ బ్రాహ్మణ కులాలను ఆశ్రయించేవారు రుంజలు, పనసలు, కోమటి పనసలు అయితే పనసలు వాయిద్యం లేకుండానే కేవలం కథాగానం చేస్తారు. రుంజ కథకులు గ్రామానిని వెళ్ళీనపుడు ఊరిలో పెద్ద ఆచారి అంటే మను బ్రహ్మ సంతతి వారు ఇంటికి వెళ్ళీ లేక ఆ ఊరిలో మొదటిగా వచ్చి స్థిరపడిన ఆచారి ఇంటికి కథ చెబుతాడు. కొన్ని సందర్భాలలో గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు అందరికీ కలిపి ఒక చోట కథ చెప్పడం, కొన్ని సందర్భాలలో పెద్ద ఆచారి ఇంట్లో కథ చెబితే మిగతావారు అక్కడకు చేరుకొని కథ విని పారితోషికాలు ఇస్తారు. ఉంజ కథకుడు [[కథ]]<nowiki/>ను ప్రారంభించే ముందు ఏ ఇంటి ముందు కథ చెబుతాడో ఆ గృహస్థుని గోత్రం చెప్పి అతని వంశం చెప్పి అతని [[కుటుంబం]] ఇంకా వృద్ధి కావాలని దీవించి తర్వాత విశ్వబ్రాహ్మణుల వంశ గమనాన్ని, పంచ బ్రహ్మల జన్మ ప్రకారాలను వివరిస్తాడు. ఆ తర్వాతే ఏ కథ అయినా. వీరికి ఇచ్చే పారితోషికం నికరం ఉండదు. అయితే ఏ దాత కూడా వీరిని తక్కువ చేసి పంపించడు. డబ్బులు, భోజనం, బట్టలు కూడా పెడతారు. ఈ విధంగా ఒక అలిఖితమైన, అవగాహన, [[ఆచారం]], సంబంధం ఆశ్రితులైన రుంజలకు, దాతలైన విశ్వబ్రాహ్మణులము మధ్య ఎన్నో తరాలుగా కొనసాగుతూ వస్తోంది.
 
==ఉత్తరాంధ్రలో రుంజ కళాకారులు==
పంక్తి 41:
</poem>
 
రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ విశ్వ కర్మ సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతి వారనీ ఇతి హాసం తెలియచేస్తూ ఉంది. రుంజ కథకులు అక్కడక్కడ మచ్చుకు మాత్రమే కనిపిస్తారు. సర్కారాంధ్ర దేశంలో [[తూర్పు గోదావరి జిల్లా]] [[ద్రాక్షారామం]]<nowiki/>లో శ్రీ పాశం పాలలోచనుడు, జీడి కంటి సత్యనారాయణ అనే వారు ఈ నాటికీ రుంజ వాయిద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నానాటికి శిథిలమై పోతున్న రుంజ వాయిద్య కళారూపం విశిష్టమైనది. దీనిని పరిరక్షించాల్చిన అవసరం ఎంతో ఉంది. రుంజ వాయిద్యకులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా అగమకాలనిస్తూ వాయించడంతో రుంజ వారు గ్రామంలోకి వచ్చారనేది అందరికీ అర్థమైపోతుంది.
 
==పల్లెల్లో ప్రదర్శన==
"https://te.wikipedia.org/wiki/రుంజ_వాయిద్యం" నుండి వెలికితీశారు