శేఖర్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 9:
 
== వ్యక్తిగత జీవితం ==
శేఖర్ చంద్ర తండ్రి [[హరి అనుమోలు]] ప్రముఖ సినిమాటోగ్రాఫర్. [[మయూరి (సినిమా)|మయూరి]], [[లేడీస్ టైలర్]], [[నువ్వే కావాలి]], [[గమ్యం (2008 సినిమా)|గమ్యం]] లాంటి విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. శేఖర్ చిన్నప్పుడే [[పియానో]] అంటే ఇష్టంగా ఉండేది. పట్టుబట్టి మరీ తండ్రి దగ్గర చిన్న పియానో కొనిపించుకున్నాడు. అప్పుడు అదే అతని [[ప్రపంచము|ప్రపంచం]] లా అనిపించేది. ఖాళీ సమయాల్లో అందులో ఏదో ఒకటి వాయిస్తూ కాలక్షేపం చేసేవాడు. [[గిటారు|గిటార్]] కూడా నేర్చుకున్నాడు. [[పాఠశాల]]<nowiki/>లో కార్యక్రమాల్లో కూడా వాయించేవాడు.
 
తల్లిదండ్రులు మొదట సందేహించినా అతను [[సంగీతము|సంగీతం]] మీద ఆసక్తిని గమనించి సంగీత దర్శకుడు [[ఎం. ఎం. కీరవాణి|కీరవాణి]] దగ్గరకు తీసుకెళ్ళారు. ఆయన అతనిలో ప్రతిభను గుర్తించి [[హైదరాబాదు]]<nowiki/>లో కాకుండా [[చెన్నై]]<nowiki/>లో ఏదైనా సంగీత కళాశాలలో చేర్చమన్నాడు. దాంతో శేఖర్ తల్లిదండ్రులు అతన్ని చెన్నైలో ట్రినిటీ సంగీత కళాశాలలో చేర్చారు. అక్కడ సంగీతం నేర్చుకుంటూనే కీరవాణి పాటలు రికార్డింగుకు వెళ్ళి అక్కడ కోరస్ లో పాటలు పాడేవాడు. కొద్ది రోజులు సీరియల్స్ కీ, జింగిల్స్ కీ సంగీతం సమకూర్చాడు. కొన్నాళ్ళు [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]] దగ్గర కీబోర్డు ప్లేయర్ గా పనిచేశాడు.
 
శేఖర్ భార్య మాధురి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లో ఎమ్మెస్ చేసి [[ఎల్.వి.ప్రసాద్|ఎల్. వి. ప్రసాద్]] కంటి ఆసుపత్రిలో క్లినికల్ రీసెర్చి విభాగంలో కొద్దిరోజులు పనిచేసింది. తరువాత వారికి నయనిక అనే పాప జన్మించింది.
 
== సంగీతదర్శకత్వం వహించిన సినిమాలు ==
రికార్డింగ్ స్టూడియోలకు వచ్చి పోతున్నప్పుడే దర్శకుడు [[ఉప్పలపాటి నారాయణరావు]] తో పరిచయం అయింది. మొదటగా ఆయనకు తెలిసిన వాళ్ళ సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం ఇప్పించాడు. కానీ ఏదో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తరువాత జ్ఞాపకం అనే సినిమాకు సంగీతం రూపకల్పన చేశాడు. అదే అతని మొదటి సినిమా. ఆ సినిమాకు పనిచేస్తున్నపుడే దర్శకుడు [[రవిబాబు]]<nowiki/>తో పరిచయం ఏర్పడింది. అలా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన [[అనసూయ (2007 సినిమా)|అనసూయ]] సినిమాకు సంగీతాన్నందించాడు. తర్వాత వచ్చిన [[నచ్చావులే]] సినిమా కూడా శేఖర్ చంద్రకు సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమాలో పాట పాడిన [[గీతా మాధురి]]<nowiki/>కి ఉత్తమ గాయనిగా [[నంది పురస్కారాలు|నంది పురస్కారం]] లభించింది. తర్వాత [[నువ్విలా]], [[బెట్టింగ్ బంగార్రాజు]], అమరావతి, [[అవును (సినిమా)|అవును]], [[మాయ]], బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, [[మనసారా]] లాంటి సినిమాలు చేశాడు.
 
=== సినీ జాబితా ===
"https://te.wikipedia.org/wiki/శేఖర్_చంద్ర" నుండి వెలికితీశారు