వేంగి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 156:
 
== వేంగి ప్రాభవం క్షీణత ==
తిరిగి 1042 నుండి రాజరాజ నరేంద్రుని అధికారానికి ప్రమాదం వాటిల్లింది. ఈ కాళంలో చాళుక్య చోళ [[సంఘర్షణ]]లు తారస్థాయికి చేరడంతో వేంగి రాజ్యం అల్లకల్లోలమయ్యింది. సోమేశ్వరుడనే రాజు 1045 ప్రాంతంలో వేంగి, కళింగ రాజ్యాలను జయించి "వేంగి పురవరేశ్వర" అనే [[బిరుదు]] ధరించాడు. చోళ రాజులు ధరణికోట వద్ద జరిగిన పెద్ద యుద్ధంలో చాళుక్యులను జయించారు గాని వేంగిపై మాత్రం పశ్చిమ చాళుక్యుల పెత్తనం కొనసాగింది. [[రాజరాజ నరేంద్రుడు]] ఆహవమల్ల సోమేశ్వరునితో సమాధానపడి అతని సార్వభౌమత్వాన్ని అంగీకరించి వేంగి<nowiki/>నివేంగిని పాలించాడు. తరువాత 1061 వరకు రాజరాజనరేంద్రుని పాళన ప్రశాంతంగా సాగింది. అతడు పండిత గోష్ఠిలో ఆసక్తి కలిగిన పరమ ధార్మికుడు. ఈ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉండవచ్చును. అది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం.
 
రాజరాజ నరేంద్రుని మరణానంతరం జరిగిన సంఘటనలలో చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు. కాని అప్పటికి వేంగి రాజ్యానికి పూర్తిగా వ్యక్తిత్వం నశించి చోళ, చాళుక్య సార్వభౌములలో విజేతలైనవారి పక్షమో, లేక వేంగిపై దండెత్తి వచ్చినవారి పక్షమో వహించవలసిన దయనీయ స్థితికి దిగజారిపోయింది <ref name="BSL"/>. అనేక యుద్ధాలు, రాజుల మధ్యలో పంపకాలలో వేంగి నలిగిపోయింది. అవకాశం చిక్కినపుడల్లా ఇతరులు వేంగిని కొల్లగొట్టసాగారు. 1073లో దాహళ ప్రభువు చేది యశఃకర్ణదేవుడు, తరువాత కొద్దికాలానికి గంగరాజ దేవేంద్రవర్మ పెద్ద దండ్లను పంపి వేంగిని దోచుకొన్నారు. 1075లో సప్తమ విజయాదిత్యుడు మరణించడంతో తూర్పుచాళుక్య వంశం అంతరించింది.
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు