కపిలగిరి యోగానంద నరసింహస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మారుపేరు కలిగిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
కపిలగిరి యోగానంద నరసింహ స్వామి జన్మనామం కొండెబోయిన సుబ్బారాయుడు. ఈయన కొండెబోయిన గురుమూర్తి, లక్ష్మమ్మ దంపతులకు [[1886]] వ సంవత్సరంలో [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం [[ప్రకాశం జిల్లా]] [[మార్కాపురం]] పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోని [[తోకపల్లి]] గ్రామంలో జన్మించాడు. భగవంతుని ఆదేశంపై భువిపై జన్మించిన యోగులలో ఒకరుగా ఈయనను భక్తులు భావిస్తారు.<ref>{{Cite web|url=https://www.freegurukul.org/author/%E0%B0%AE%E0%B0%B3%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B3-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF#home|title=ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ (విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య) {{!}} Free Gurukul Education Foundation (Values,Skills Based Education)|website=www.freegurukul.org|access-date=2020-04-07}}</ref>
 
==బాల్యం విద్యాభ్యాసం==
ఇతని తల్లి దండ్రులు కుమారుడికి బడిఈడు రాగానే వీధిబడిలో వేసారు కానీ అతనికి బడి చదువులు ఏమాత్రం నచ్చలేదు. మిత్రులతో పాటు పశువులను కాయడం కోసం వెళ్లి, అక్కడి కొండకోనలు, చెట్లూ పుట్టలూ పకృతి పరిశీలిస్తూ పులకించి పోయేవాడు. అక్కడ పశువులు కాసే సహచరులను శిష్యులుగా కూర్చోబెట్టుకునే అనేక పౌరాణిక దైవిక ఆధ్యాత్మిక కథలను చెపుతూ వుండేవాడు. ఇతనికి చక్కగా పాటలు పాడటం కూడా వచ్చు. ఇతని పాటలను మిత్రులు మంత్రముగ్ధలై వింటూ వుండే వారు. భక్తి పాటలు పాడుతూ పరవశుడై నాట్యం చేసేవాడు. వీధి నాటికలు వేయడం కూడా బాగా ఇష్టం. యక్షగానం కొన్నాళ్ళు సాధన చేసాడు.