"నోము" కూర్పుల మధ్య తేడాలు

1,125 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''నోము''' అనగా దీర్ఘకాలాను పలనీయమైనపాలనీయమైన [[సంకల్పము]]. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.
 
ఆంధ్ర దేశమున [[స్త్రీలు]], [[పిల్లలు]] నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు.
 
మన దేశములో బాల్య వివాహములు ఆచరణలో ఉన్నందున వివాహానంతరము నోములు నోచుటయే ఆచరణలో నున్నది. ఈ వ్రతములందు త్రిమూర్తులు దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా కలవు. త్రిలోక సంచారియైన నారదు చెప్పినవి కొన్ని కలవు. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.
 
==కొన్ని నోములు==
*ఉదయ కుంకుమ నోము
*పదారు ఫలముల నోము
*పూర్ణాది వారముల నోము
*సంపద శుక్రవారం నోము
*వరలక్స్మీ వ్రతము
*నందికేశ్వర వ్రతము
*మూగ నోము
 
==మూలాలు==
 
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/299282" నుండి వెలికితీశారు