కునాల్ గంజావాలా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1972 జననాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
'''కునాల్ గంజావాలా''' (జననం 1972 ఏప్రిల్ 14) ఒక భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. అతని పాటలు ఎక్కువగా [[హిందీ]], [[కన్నడ భాష|కన్నడ]] చిత్రాలలో ఉంటాయి. అతను మరాఠీ, బెంగాలీ లతో పాటు భారతదేశంలోని ఇతర అధికారిక భాషలలో కూడా పాడాడు. కునాల్ జింగిల్స్ పాడటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. అతను 2004 లో [[మర్డర్]] చిత్రం నుండి "భీగే హోంత్ తేరే" పాటతో హిందీ చిత్రసీమలో వెలుగులోకి వచ్చాడు. ఇది అతని మొదటి అతిపెద్ద హిట్ చిత్రం. ఈ పాట అతనికి 2005 లో ఉత్తమ నేపధ్య గాయకునిగా జీ సినీ అవార్డును సంపాదించింది<ref>{{cite web|url=http://www.iifa.com/archives/2005/2005winners.html|title=IIFA awards 2005|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20130921053759/http://www.iifa.com/archives/2005/2005winners.html|archivedate=21 September 2013|accessdate=21 July 2012|df=dmy-all}}</ref>. 2005 లో ఆకాష్ చిత్రం నుండి "నీన్ నీన్" పాటతో కన్నడలో అతను వెలుగులోకి వచ్చాడు.
 
== జీవిత విశేషాలు ==
చిన్నతనంలో కునాల్ గంజవాలా గాయకుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అతను పాడగలడని కాలేజీ స్థాయి వరకు అతనికి తెలియదు. అప్పటి నుండి అతను ప్రతి కళాశాల ఉత్సవాల్లో పాడటం మొదలుపెట్టాడు. అనేక ఇంటర్-కాలేజీ పాటల పోటీలలో గెలిచాడు.
 
గంజవాలా మజాగావ్ లోని సెయింట్ పీటర్స్ స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. అతను చార్టర్డ్ అకౌంటెంట్ లేదా నటుడిగా కావాలని కోరుకున్నాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకు గాయకుడిగా మారడానికి అవకాశం ఏర్పడిందని అతను తెలిపాడు. అతని సోదరి భారత్ నాట్యం కళాకారిణి. అతని తండ్రి హార్మోనికా వాద్యకారుడు. తన తల్లిదండ్రుల సహకారంతో అతను పాడటంపై యిష్టం ఏర్పరుచుకొని మంచి గాయకునిగా మారగననే నమ్మకం కలిగి ఉండేవాడు.
 
తరువాత, సుంధీంద్ర భౌమిక్ మార్గదర్శకత్వంలో భారతీయ విద్యా భవన్ నుండి గంజావాలా సంగీతం నేర్చుకున్నాడు. అతని మొదటి గానం ఆపరేషన్ ఫ్లడ్ ప్రకటన కోసం రంజిత్ బారోట్ స్వరపరిచిన జింగిల్ లో పాడాడు. తరువాత అనేక భాషా చిత్రాలలో పాటలు పాడాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కునాల్_గంజావాలా" నుండి వెలికితీశారు