కపిలగిరి యోగానంద నరసింహస్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==బాల్యం విద్యాభ్యాసం==
ఇతని తల్లి దండ్రులు కుమారుడికి బడిఈడు రాగానే వీధిబడిలో వేసారు కానీ అతనికి బడి చదువులు ఏమాత్రం నచ్చలేదు. మిత్రులతో పాటు పశువులను కాయడం కోసం వెళ్లి, అక్కడి కొండకోనలు, చెట్లూ పుట్టలూ పకృతి పరిశీలిస్తూ పులకించి పోయేవాడు. అక్కడ పశువులు కాసే సహచరులను శిష్యులుగా కూర్చోబెట్టుకునే అనేక పౌరాణిక దైవిక ఆధ్యాత్మిక కథలను చెపుతూ వుండేవాడు. ఇతనికి చక్కగా పాటలు పాడటం కూడా వచ్చు. ఇతని పాటలను మిత్రులు మంత్రముగ్ధలై వింటూ వుండే వారు. భక్తి పాటలు పాడుతూ పరవశుడై నాట్యం చేసేవాడు. వీధి నాటికలు వేయడం కూడా బాగా ఇష్టం. యక్షగానం కొన్నాళ్ళు సాధన చేసాడు.
సుబ్బారాయుడు రంగస్థలంపై చేస్తున్న చక్కటి నటనను చూసి ముచ్చట పడిన ఒక వైష్ణవ పండితుడు అతడిని తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చి విద్యాబుద్దులు చెప్పసాగాడు. వేదాంతం, ఉపనిషత్తులు శ్రద్ధగా వినేవాడు. మంత్రాలను బాగా వల్లెవేసి మనసుకు పట్టించుకునేవాడు.
 
==ఇల్లు వదలుట ==