"మాధవి" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
== తొలిదశ ==
 
మాధవి [[హైదరాబాదు]]లో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు జన్మించింది. ఈమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. చిన్నతనంలోనే ఉమా మహేశ్వరి వద్ద [[భరతనాట్యం]], భట్ వద్ద [[జానపద నృత్యం]] నేర్చుకొని వేలాది [[నృత్యం|నృత్య]] ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె విద్యాభ్యాసం హైదరాబాదు అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో సాగింది.<ref>{{cite web |url=http://maadhavi.com/about_childhood.html |title=Maadhavi |publisher=Maadhavi |date= |accessdate=2012-06-09 |website= |archive-url=https://web.archive.org/web/20130114005440/http://maadhavi.com/about_childhood.html |archive-date=2013-01-14 |url-status=dead }}</ref> ఎనిమిదో తరగతి చదువుతుండగా [[రవీంద్రభారతి]]లో నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని [[దాసరి నారాయణరావు]] చూసి, తను తీయబోయే కొత్త సినిమాకో నూతన నటి కావాలని ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకుని సినిమా రంగంలో ప్రవేశపెట్టాడు. అప్పటికే సినిమా రంగంలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలామంది ఉండటంతో కనక విజయలక్ష్మిని ఆయన 'మాధవి' అని సినీనామకరణం చేశాడు.<ref>[http://telugukichidi.blogspot.com/2012/09/blog-post.html ఐదో పడిలో అందాల భరిణ .... 'మాధవి' - కనకదుర్గ ఇంటర్వ్యూ]{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి [[న్యూజెర్సీ]]లో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత, [[జర్మనీ|జర్మన్]] సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.<ref>{{Cite web |url=http://www.behindwoods.com/tamil-movie-news/aug-06-02/07-08-06-madhavi.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-05-25 |archive-url=https://web.archive.org/web/20070702182050/http://www.behindwoods.com/tamil-movie-news/aug-06-02/07-08-06-madhavi.html |archive-date=2007-07-02 |url-status=dead }}</ref>
 
==మాధవి నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2993117" నుండి వెలికితీశారు