చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
[[user:Vemurione]] గారు, ఈ నిఘంటు పేజీ, ఇలాంటి ఇతర పేజీలు వికీబుక్స్ కు తరలించాలి. వికీబుక్స్ లో కూడా మీ మార్పులు, చేర్పులు కొనసాగించవచ్చు. 1-2 గంటలలో ఈ పేజీలు తరలించగలను. మీకు అభ్యంతరాలు, సందేహాలుంటే అడగండి.-- [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:46, 12 జూలై 2020 (UTC)
:: తొందరపడి తరలించవద్దని ప్రార్ధన! (1) ఇప్పుడు ఉన్న చోట ఉంటే నష్టం ఏమిటి? (2) ససేమిరా తరలించి తీరాలి అంటే ప్రస్తుతం ఉన్న ప్రతికి కాపీ చేసి నేను మరొక చోట దాచుకునే వరకు ఏమీ చెయ్యకండి. ప్రస్తుతం ఉన్న నిఘంటువుని searchable dictionary గా తయారు చెయ్యడానికి నేను, నా స్నేహితులు ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న నిఘంటువుని కాపీ చేసి డేటాబేస్ లోకి మార్చాలి. ఆ తరువాత విక్స్నరీలోకి తరలించవచ్చు. ఇప్పుడు మార్చేరంటే నేను 40 ఏళ్లబట్టి పడుతున్న శ్రమ అంతా వ్యర్ధం అవుతుంది. ఇదొక్కటే నా దగ్గర ఉన్న Master Copy! ఇతర పెద్దలు కూడ సంప్రదించి చూద్దాం. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 04:18, 17 జూలై 2020 (UTC)
:: ఈ విషయంపై [[user:Chaduvari]], [[user:Venkataramana]] కూడా ఏమంటారో? [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 04:21, 17 జూలై 2020 (UTC)
:::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు అన్నట్టుగా ఈ పేజీలను వేరే వికీ ప్రాజెక్టుకు తరలించాలి. అయితే [[వాడుకరి:Vemurione|Vemurione]] గారి భవిష్యత్తు ప్రణాళికనూ (వికీ వంటి సైట్లలో ఉండే ఎడిట్ పెట్టెలకు ఆ డేటాబేసును చేర్చితే ఒనగూడగల ప్రయోజనాలనూ), ఇవి ఇక్కడే ఉంచి పనిచెయ్యడంలో వేమూరి గారికి ఉన్న వీలునూ పరిశీలించి చూస్తే.. ప్రస్తుతం వీటిని వికీ నుండి తరలించకూడదని నేను భావిస్తున్నాను. మధ్యే మార్గంగా ఒక పని చెయ్యవచ్చు: ఈ నిఘంటువు పేజీలను వికీపీడియాలోనే మరో పేరుబరికి తరలించవచ్చు - ఉదాహరణకు "వికీపీడియా:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" లేదా "వాడుకరి:Vemurione/ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)". ఆ విధంగానైతే ఈ పేజీలను ఇక్కడ ఉంచడంలో ఇబ్బందేమీ ఉండదు. వేమూరి గారు ఇబ్బందేమీ లేకుండా తన ప్రాజెక్టు పనిని కొనసాగించనూ వచ్చు. పరిశీలించగలరు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:50, 17 జూలై 2020 (UTC)
:::[[వాడుకరి:Vemurione|Vemurione]] గారు, ఇలానే వుంచితే వికీపీడియా పేజీ వీక్షణల గణాంకాలు ([https://pageviews.toolforge.org/topviews/?project=te.wikipedia.org&platform=all-access&date=last-month&excludes= నెలలో ఎక్కువ వీక్షణల ఉదాహరణ]) పరిశీలించడానికి, విశ్లేషించడానికి సౌలభ్యం కాదు. అలాగే వికీపీడియాలో బాట్ల ద్వారా మార్పులు చేసినపుడు ఈ పేజీలు అనుకోకుండా సవరణకు గురికావచ్చు. ఈ పేజీలకు వీక్షణలు ఎక్కువగా వున్న ఇతర వ్యాస పేజీలతో పోలిక సరిగా వుండదు, ఇక రెండవ కారణం, వికీపీడియా లో ఎటువంటి వ్యాసాలు వుండాలి అనేదానికి ఈ పేజీలు వ్యతిరేకం. తరలించితే సమస్యలు ఏవీ లేవు ఎందుకంటే వికీబుక్స్ లో తరలించినపుడు ఒక్క అక్షరం కూడా మారదు. వికీపీడియా లోగానే సవరణలు చేసుకోవచ్చు, ఈ పనులకు, భవిష్యత్ పనులకు ఏ మాత్రం అనుభవంలో తేడావుండదు. నేను ఇప్పటికే వికీబుక్స్ లో [[b:ఉబుంటు_వాడుకరి_మార్గదర్శని|ఒక పుస్తకం]] తయారు చేయటంలో ప్రముఖ పాత్ర పోషించిన అనుభవంతో చెపుతున్న మాటలివి.
 
:::డేటాబేస్ గా తయారు చేసి విక్షనరీ ఇతర సైట్లలో వాడుకునేందుకు చానా ఏళ్లక్రితం నేను మీతో సంప్రదించి రెండు ప్రయత్నాలు చేసినది మీకు తెలుసు. దురదృష్టవశాత్తు అవి ముందుకుపోలేదు.
:::[[user:Chaduvari]] గారు, ప్రోగ్రామింగ్ పరిభాషలో సాంకేతిక డేటాబేస్ అనేది ఏర్పడితే ఆ డేటాబేస్ ఎక్కడవున్న తెవికీలో వాడుకోవడానికి ఇబ్బందిలేదు ఎందుకంటే అటువంటి పనికి కావలసిన ఎక్స్టెన్షన్ లేదా ఇతర సాఫ్ట్వేర్ తయారు చేయాలి కాబట్టి. ఇక వికీపీడియా పేరుబరికి తరలించడం కన్నా వికీబుక్స్ కు తరలించడం మెరుగైనది ఎందుకంటే గూగుల్ లాంటి వెతుకుయంత్రాలు ప్రధానపేరుబరి విషయాలకు ఫలితాలలో ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చే అవకాశం వుంది. అంతే కాకుండా [[వాడుకరి:Vemurione|Vemurione]] గారు వికీపీడియాలో వుంచి ఇతరుల సహకారంతో నిఘంటువు వృద్ధిచేద్దామనుకున్న ఆలోచనకు వికీబుక్స్ స్థాపన ఆలోచనకు ఏమాత్రం తేడాలేదు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:34, 17 జూలై 2020 (UTC)
Return to "ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" page.