కుంతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:368B:B428:1:2:1895:1A01 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
రెండుసార్లు ఉన్న సమాచారంలో ఒకటి తొలగించాను
పంక్తి 27:
ఇది దేవత వర ప్రసాద కథ, లోకానికి తెలియదు.
== '''ఆశ్రమ జీవనం''' ==
పాండురాజు పని అయిపోయింది. ఇక రాజ్యం వద్దు గీజ్యం వద్దు ముని వృత్తి అవలంభించి తపస్సు చేసుకొంటాను. కుంతీ! మాద్రీ! మీరు హస్తినాప్లురానికి వెళ్ళిపొండి. నేను సన్యసించానని పెద్దలందరికి చెప్పండి. అన్నాడు. కుంతీ మాద్రులు మిక్కిలి దుఃఖించారు. " మేం వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని విడదీస్తే ప్రాణాలు విడుస్తాం" అని ఖండితంగా చెప్పారు. విధిలేక వారి సహవాసం అంగీకరించాడు. విలాస వస్తువులన్నీ విసర్జించి, ఎన్నో దాన ధర్మాలు చేసి మహామునులు నివసించే శతశృంగ పర్వత ప్రాంతానికి వెళ్ళి, ఆశ్రమం కట్టుకున్నాడు. ముని వృత్తితో జీవయాత్ర సాగిస్తున్నాడు. ఒక అమావాస్య రోజున మహర్షులంతా బ్రహ్మ సందర్శనానికి సత్యలోకం వెళుతున్నారు. మార్గం సమర్ధంగా ఉంది. పాండురాజు తాను కూడా భార్య సహితంగా వెళ్ళాలని ప్రయత్నించాడు కానీ, సాధ్యపడలేదు. "అపుత్రశ్యాగతిర్నాస్తి" అనే వేధ వచనం జ్ఞప్తికి వచ్చి బాధ పడ్డాడు. నా కేది దారి? అని మునివర్యులను అడిగాడు. యోగ దృష్టిధనులైన మునులు అయ్యా! నీవు అపుత్రడవు కావు, దైవ ప్రసాదముతో నీకు పుత్రులు కలుగుతారు, ప్రయత్నించు అన్నారు.
 
కుంతీదేవి మహాభారతంలో పాండవుల తల్లి. పాండురాజు భార్య. కుంతీదేచి చిన్నతనంలో దుర్వాసుడు ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఈ వరం ప్రకారం, ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు. ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా [[భవిష్యత్తు]]లో అవసరమౌతుందని బదులిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒక సారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించాననీ, సూర్యుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగివెళ్ళలేనని బదులిస్తాడు. ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేయమని కోరతాడు. అలా సహజ కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో జన్మించినవాడే [[కర్ణుడు]][1].
 
విషయ సూచిక
 
1 కుంతి అంటే
2 బాల్యం
3 కుంతి ఓర్పుకిది గీటురాయి
4 దుర్వాసుని మంత్రోపదేశం
5 మొదటి కోరిక కోరిన వెంటనే
6 ఇప్పుడేం చెయ్యాలి
7 కుంతి ఆవేదన
8 విధి విలాసం
9 కుంతీ వివాహం
10 = పాండురాజు వనవిహారం
10.1 పాండురాజుకు ముని శాపం
10.2 నీకు పుత్రులుకలుగుతారు
10.3 నా దగ్గర ఒక మంత్రముంది
10.4 ధర్మజుడుదయించాడు
10.5 భీమ జననం
10.6 ఇంద్రానుగ్రహమే
10.7 మాద్రి మనో వ్యధ
10.8 పాండురాజు పరలోక గమనం
10.9 మాద్రి సహగమనం
10.10 కౌరవ - పాండవ విద్యాభ్యాసం
10.11 కుమార విద్యా ప్రదర్శనం
10.12 ఎవరో సభలో ప్రవేశించారు
10.13 జౌను, వీడు నీ కొడుకే
10.14 కర్ణుడు అంగరాజైనాడు
10.15 లక్క ఇంటిలో పాండవులు
10.16 సురక్షిత ప్రదేశానికి
10.17 ఘటోత్కచుడు పుట్టాడు
10.18 పాండవులకు పరలోక క్రియలు
10.19 నేను మాట యిచ్చాను
10.20 నేనంత బుద్ధిలేని దాన్ని కాను
10.21 పాంచాల దేశానికి ప్రయాణము
10.22 ద్రౌపతి స్వయంవరం
10.23 ఐదుగురు పంచుకోండి
10.24 ముందే వ్రాసిపెట్టాడు
10.25 పాండవులకు అర్ధరాజ్యం
10.26 కుంతీ సందర్శనం
10.27 సంకోచం లేని సందేశం
10.28 నీవూ నాపుత్రుడివే
 
కుంతి అంటే
 
కుంతి యాదవుల ఆడబిడ్డ. వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణుని మేనత్త. ఆమె అసలు పేరు పృధ. కుంతిభోజుడనే రాజు సంతానము లేక, ఈమెను పెంచుకున్నాడు. అందుచేత ఈమె కుంతి అయింది.
బాల్యం
 
పువ్వుపుట్టగానే పరిమలిస్తుంది. కుంతి చిన్ననాడే చాలా బుద్ధిమంతురాలనిపించుకుంది. ఆమెనుచూస్తే పెద్దలకు ముద్దు వచ్చేది.ఆమె దైవభక్తి, గురుభక్తి, మెచుకోదగ్గవి. ఆ ఇంట్లో కుంతి అంటే ఎంతో అనురాగం వెల్లివిరిసేది. కుంతిభోజుడు క్రొత్తవాడు కాదు; తన తండ్రి మేనత్త కొడుకే. కనుక ఆమెకు చనువు కూడా కావలసినంత వుండేది. తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కుంతిభోజుడు కూతురుని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు, పరిచర్య చేయించేవాడు. ఆశీర్వదించమని అర్థించేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. చంద్రరేఖ వలె కుంతీకన్య వర్థిల్లుతూ ఉంది.
కుంతి ఓర్పుకిది గీటురాయి
 
ఒక నాడు కుంతిభోజుడు సభలో కొలువై ఉన్నాడు. ఆకస్మికంగా దుర్వాసుడనే ఋషి అచటికి వచ్చెను. ఆయన రుద్రాంశ సంభూతుడు. ఆయనను చూస్తే అందరికీ భయమే, ఆయనకు కోపం ముక్కుమీదే ఉంటుంది. ఆయన శపిస్తే తిరుగు లేదు. అటువంటి చండప్రచండుడైన ఋషికి ఆతిద్యమివ్వాలి. సపర్య చేయాలి. ఆ భారం కుంతిపై పడింది. తండ్రి బిడ్డ శిరస్సు నిమిరుతూ "తల్లీ! నీ ఓర్పుకిది గీటురాయి" అన్నాడు. కుంతి ఆనందంతో, అరమోడ్పు కన్నులతో " నాన్నా! మహర్షులకు సేవ చేసే భాగ్యం అందరికీ కలసి వస్తుందా? దుర్వాసుని సేవ నా జీవితానికి వెలుగు త్రోవ" అంటూ నమస్కరించి దీవెనలు పొందింది.
దుర్వాసుని మంత్రోపదేశం
 
దుర్వాసునడు కుంతిభోజుని ఇంట ఒక సంవత్సర కాలం పాటు ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళతాడో, ఏ వేళకు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క సారి ఫలానా ఆశ్రమానికి వెళుతున్నాను, రేపు సాయంత్రానికి తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి, ఆ రోజు అర్ధ రాత్రికి తిరిగి వస్తాడు. వచ్చాడంటే, రానీలే, అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, చాప ఉంది, త్రాగి పడుకుంటాడులే అనుకుంటానికి వీలు లేదు. ఫలహారమేమైనా ఉందా? అంటాడు. పండ్లు గట్టిగా ఉంటే పచ్చివంటాడు, మెత్తగా ఉంటే కుళ్ళినవంటాడు, విసిరి మొగాన కొడతాడు. అటువంటి మహానుభావుడికి కుంతి పరిచర్య చేసింది. ఓర్పులో భూదేవి వంటిదనిపించుకుంది. మునీశ్వరుని మరసు కరిగింది. " బిడ్డా! నీ పరిచర్య నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నీకు ఏమి కావాలయునో అడుగు యిస్తాను" అన్నాడు. కుంతికి ఏ కోరిక లేదు. అవ్యాజంగా సేవ చేసింది. " మహాత్మా! నాకు కావలసింది ఏముంది? మీరు ప్రసన్నులయ్యారు. అదే నాకు పదివేలు, నా తండ్రి సంతోషిస్తాడు" అని నమస్కరించింది. ముని ఇలా అన్నాడు" నీవు పసిదానవు. నీకు తెలియదు, అడగలేకున్నావు, నీకు ఒక మంత్రాన్ని యిస్తాను తీసుకో. నీవు ఏ దేవుడిని పిలిస్తే ఆ దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీకు వరాన్ని ప్రసాదిస్తాడు". కుంతి మారాడకుండా మహా ప్రసాదమని మంత్రమును స్వీకరించింది. కుంతికి మంత్రోపదేశము చేసి, కుంతీభోజుని ఆశీర్వదించి దుర్వాసుడు తన దానిన తాను వెళ్ళిపోయాడు.
మొదటి కోరిక కోరిన వెంటనే
 
నవయవ్వనశ్రీతో నాలుగంచుల విరిసిన పద్మంలా కుంతి కాంతి వెదజల్లుతూ కూర్చుని ఉంది, ఒక నాడు ప్రొద్దుపొడుపు శోభ చూస్తూ ఉంది, ఆమె హృదయములో రాఘమధువు తొణికింది! ఓహో! సూర్యభగవానుని మూర్తి ఎంత సుందరంగా ఉంది, స్వామీ! సహజ కుండలాలతో, వజ్రకవచంతో మిరుమిట్లు గొలిపే తేజస్సుతో నీలాగే చూడముచ్చటగా ఉండే కుమారుని నాకు ప్రసాదిస్తావా? అంటూ అప్రయత్నంగా దుర్వాసుడిచ్చిన మంత్రం జపించింది. సంకల్ప మాత్రానా సరసిజ మిత్రుడు సమీపుడయ్యాడు. ఎంతోసౌమ్యంగా, ప్రసన్నంగా ఉన్నాడు. ఆ దివ్య పురుషుని చూసి కుంతి భయపడింది, పారిపోవాలని చూసింది. "బాలా! భయపడకు, నేను నీవు కోరిన వరమీయడానికి వచ్చాను, అంటూ బుజ్జగిస్తూ, రవి సమీపించాడు.
 
కుంతీ భయపడుతూ, చేతులు జోడించి, స్వామీ! ఒక బ్రహ్మ విభుడు నాకు ఈ మంత్రమును ఉపదేశించాడు, మంత్రశక్తి నాకు తెలియదు, చూద్దామని ఊరికే ఉచ్చరించాను. ఇంత పని జరుగుతుందని అనుకోలేదు, అజ్ఞానంతో ఈ పని చేసితిని, నన్ను మన్నింపుము అని ప్రణామము చేసింది. పద్మబంధుడు వినలేదు. నా దర్శనము వృదా కాదు, నీ అభిమానం నెరవేరుస్తాను అన్నాడు. " అయ్యో! నేను కన్యను, నేను గర్భవతినైతే, తల్లిదండ్రులు, చుట్టుపక్కలనున్న వారు నన్ను చూసి నవ్వుతారు, నేను బ్రతకలేను, నన్ను రక్షించు" అంటుంది కుంతి. అప్పుడు అ కర్మ సాక్షి, కమలాక్షీ! నీ కన్యత్వం చెడదు, నీకు లోకోపవాదం రాదు, నేను వరమిస్తున్నాను. ఇక మాట్లాడవద్దు అని రవి ముందుకు వచ్చాడు. కుంతి సత్యం, ధర్మం పాలించే ప్రభువు నీవు, నీకు ధర్మమని తోస్తే చేయి, నేనింక మాట్లాడను అని పారవశ్యం పొందింది. అంశుమంతుడు కుంతి అభిలషితం తీర్చి అంతర్హితుడయ్యాడు.
ఇప్పుడేం చెయ్యాలి
 
కుంతీభాస్వంతుల సమాగమ ఫలము కర్ణుడు. శిశువు కలిగాడు, వాని చెవులకు పుట్టుకతోనే రత్న కుండలాలున్నాయి, శరీరమంతా వజ్ర కవచమయము, రెండవ సూర్యుని లాగా ఉన్నాడు. కుంతికి కళ్ళు తిరిగాయి. మతి పోయింది. ఇటువంటి బిడ్డ లోకంలో ఎవరికైన జన్మిస్తాడా? నాకు జన్మించాడు. ఇది భాగ్యమనుకోవలెనా? పెళ్ళి కాని కన్యను నేను, వీడు నా కొడుకని చెప్పుకోలేను. ఏమి చేయాలి? అని లోలోపల కుమిలిపోయింది. లోకోపవాదం భయం ఆమెను దావాగ్నిలా చుట్టు ముట్టింది. ఆమె మనసులోఒక ఊహ మెరిసింది. వెంటనే ఒక పెట్టెలో బాలుని భద్రపరచి, అందులో కొంత ధనము కూడా ఉంచింది. తీసుకుపోయి, ఆ పెట్టెను అశ్వనది ప్రవాహములో వదిలింది. తానేమీ చేస్తున్నదో తనకే తెలియలేదు, పెట్టె వంక చూస్తూ నిలబడింది.
కుంతి ఆవేదన
 
జల తరంగాల మీద తేలుతూ, పెట్టె కనుచూపు మేర దాటి పయనిస్తుంది. మబ్బు కొంత విచ్చిపోయింది. కుంతి దిక్కులు చూసింది. ఎవరూ లేరు. బావరమని ఏడ్చింది. కడుపులోని దుఃఖమంతా వెళ్ళబోసుకుంది. నా చిన్ని తండ్రీ! మునీశ్వరుడు నాకెందుకు మంత్రమిచ్చాడు? నేనెందుకు తెలివిమాలి అరవిందసఖుని ఆహ్వానించాను. అతడు వచ్చి వద్దంటే సుతునెందుకు ప్రసాదించాడు? అబ్బా! సుతుడంటే సామాన్య సుతుడా? సహజ కర్ణ కుండలాల భూషితుడు. వజ్ర కవచ శోభితుడు. అలాంటి నా కన్నకొడుకు నాకు దక్కలేదు. అయ్యో! చేతులారా నదిలో త్రోశాను. నా బంగారు కొండ ఏ ఊరికి వెళుతున్నావు. ఏ తల్లి ఒడిలో చేరుతావు. నిన్ని ముద్దాడి పోషించే అదృష్టం ఏ సతికి సమకూరుతింది. ఎక్కడున్నా నీవు కనిపిస్తావులే. తళతళలాడే చెవిపోగులు, మిలమిల లాడే మైమరపు అందాలు చిందే ఆకారము నీవెక్కడున్నా చేయెత్తి చూపిస్తాయి. నీ అభ్యుదయం చూసి తల్లిగా సంతోషిస్తాను. నా నోము ఫలమింతే, అని వెను తిరిగి అంతఃపురికి వెళ్ళింది.
విధి విలాసం
 
ఆ పెట్టె అశ్వనదిలోనించి చర్మణ్వరిలోకి, చర్మణ్వతిలోనుండి యమునలోకి, యమునలోనుండి గంగలోకి అంచెలంచెలుగా ప్రయాణించింది. అలల్లో ఊయల ఊగుతూ, సూత దేశములోని చంపా పుర ప్రాంతములో పోతూ ఉంది. దృతరాష్ట్రుని సఖుడైన అతిరధుడనే సూతుడు భార్య సమేతంగ జల క్రీడలాడుచూ, పెట్టెను చూశాడు. అతని భార్య రాధ పెట్టెను తెరిచింది. మణికనక కాంతులతో ప్రకాశించే శిశువును ఇద్దరూ చూశారు, మనకు బిడ్డలు లేరు కనుక భగవంతుడు ఈ బిడ్డను యిచ్చాడు అని యదకు హత్తుకున్నారు. విధి విలాసమేమో! కుంతి కన్న కొడుకు రాధేయుడయ్యాడు.
ఇది దేవత వర ప్రసాద కథ, లోకానికి తెలియదు.
కుంతీ వివాహం
కుంతీ వివాహం
 
గజరాజు తన పెంపుడు కుతురైన కుంతికి స్వయంవరం ప్రకతించాడు. కుంతి గున శీల సౌందర్యవిశేషాలను లోకం శ్లాఘిస్తూ ఉంది. కురుకుల వ్రుద్దులకు కుంతిని కోడలను చేసుకోవలనే కోరిక కలిగింది. పాండురాజు మహావీరుడు, తేజశ్శాలి, స్వయంవరోత్సవానికి వెల్లాడు. రాజకుమరులెందరో వచ్చారు.అందరూ కుంతిని మెచ్చిన వారే. తన్ను మెచ్చి వచ్చినవారిలో తనకు నచ్చినవాణ్ణి కుంతి యన్నుకుంతుంది. ఒక్కసారి సభ వంక తేర చుసింది.రాజలోకంలో పాండురాజు చుక్కల్లో చంద్రుడి వలె ఉన్నాడు.కుంతి మనస్సు అక్కడ లగన్మమఐంది. పాండురాజు మెదలో పూల దండ వేసింది.ఘనంగా వివాహ శుభం జరిగింది.
= పాండురాజు వనవిహారం
 
వివాహం అనంతరం పాండురాజు కొన్ని రోజులకు మద్రరజ్య కన్య మంచి అంద్దగత్తె అని విని అమెను వివాహం చేసుకోవలని తలచి మాద్రిని వివాహం చేసుకున్నాడు. పాండురాజు మంచి రాజు కాని దందయాత్రలు, రాజకీయ సమస్యలతో విసుగు చెంది ఉన్నడు. నిరంతరం వీటితోన సరిపొతుందని భావించి ముద్దూ ముచ్చట తీరేదెపుదని తలచి, ఏ తంటా లేకుండా కొన్నాళ్ళు సుఖంగా కాలక్షేపన చేద్దామని సంకల్పించుకున్నాడు ఊరుకంటే అడవి మేలని తలచి భార్యలిద్దరితో కలసి వనానికి పయనమయ్యాడు. మహారణ్యమ్లో మకాం వేసాడు హస్తినాపురం నుంచి అరణ్య మద్యానికి రోజు తినుబండారాలు, పరిమల ద్రవ్యాలు, అలంకార సామాగ్రి సరఫరా అవుతున్నాయి. పాండురాజు సరోవరాల్లో జలక్రీడలాడుతూ, ఇంద్ర భోగము అనుభవిస్తూ కుంతి, మద్రుల తోడిదే లోకంగా కాలక్షేపం చేస్తున్నాడు పాండురాజు .
పాండురాజుకు ముని శాపం
 
ఒక నాడు వేటకు వెళ్ళి వనమంతా గాలిస్తున్నాడు, ఒక్క మృగమైన దొరకలేదు. కోపంతో ఆయన తల వేడెక్కింది. అలాగ ఒక చోట ఒక ఇర్రి, ఒక లేడి రెండూ పెనుగుతూ ఉండటం చూశాడు, అమ్ము వదిలాడు. రెండు తృళ్ళి నేలకూలాయి. రెంటిలో ఒక మృగం కొన ప్రాణంతో ఉండి ఇలా మాట్లాడింది. రాజా! నేనొక మునిని, నా పేరు కిందముడు, వినోదార్ధం నేను, నా భార్య మృగాకారం ధరించి క్రీడిస్తున్నాము, మృగాలమై తిరిగే మమ్ము చంపటంలో తప్పు లేదు. వేట, మృగ వధ రాజులకు ధర్మమే, కాదనను కానీ, భరత వంశంలో జన్మించిన నీవు మాంసమునే తిని జీవించే కిరాతకులు పాటించే ధర్మము కూడా పాటించలేదు. కిరాతకులుమృగాలను చంపుతారు కానీ పారిపోలేని వాటిని, మైమరచి పెంటితో పెనిగే వాటిని చంపరు, నీవు సుఖపరవశములై ఉండే మా ప్రాణాలకు తెగించావు. కాబట్టి నీవు నీ ప్రియురాలిని కూడితే చస్తావు పొమ్మని శపించి, ప్రాణాలను వదిలింది. పాండురాజు నిలువునా కృంగి కూలబడ్డాడు.
 
== ఆశ్రమ జీవనం ==
 
పాండురాజు పని అయిపోయింది. ఇక రాజ్యం వద్దు గీజ్యం వద్దు ముని వృత్తి అవలంభించి తపస్సు చేసుకొంటాను. కుంతీ! మాద్రీ! మీరు హస్తినాప్లురానికి వెళ్ళిపొండి. నేను సన్యసించానని పెద్దలందరికి చెప్పండి. అన్నాడు. కుంతీ మాద్రులు మిక్కిలి దుఃఖించారు. " మేం వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని విడదీస్తే ప్రాణాలు విడుస్తాం" అని ఖండితంగా చెప్పారు. విధిలేక వారి సహవాసం అంగీకరించాడు. విలాస వస్తువులన్నీ విసర్జించి, ఎన్నో దాన ధర్మాలు చేసి మహామునులు నివసించే శతశృంగ పర్వత ప్రాంతానికి వెళ్ళి, ఆశ్రమం కట్టుకున్నాడు. ముని వృత్తితో జీవయాత్ర సాగిస్తున్నాడు.
నీకు పుత్రులుకలుగుతారు
 
ఒక అమావాస్య రోజున మహర్షులంతా బ్రహ్మ సందర్శనానికి సత్యలోకం వెళుతున్నారు. మార్గం సమర్ధంగా ఉంది. పాండురాజు తాను కూడా భార్య సహితంగా వెళ్ళాలని ప్రయత్నించాడు కానీ, సాధ్యపడలేదు. "అపుత్రశ్యాగతిర్నాస్తి" అనే వేధ వచనం జ్ఞప్తికి వచ్చి బాధ పడ్డాడు. నా కేది దారి? అని మునివర్యులను అడిగాడు. యోగ దృష్టిధనులైన మునులు అయ్యా! నీవు అపుత్రడవు కావు, దైవ ప్రసాదముతో నీకు పుత్రులు కలుగుతారు, ప్రయత్నించు అన్నారు.
 
నా దగ్గర ఒక మంత్రముంది
"https://te.wikipedia.org/wiki/కుంతీదేవి" నుండి వెలికితీశారు