చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి cp
ట్యాగు: 2017 source edit
పంక్తి 9:
::::[[user:Chaduvari]] గారు, ప్రోగ్రామింగ్ పరిభాషలో సాంకేతిక డేటాబేస్ అనేది ఏర్పడితే ఆ డేటాబేస్ ఎక్కడవున్న తెవికీలో వాడుకోవడానికి ఇబ్బందిలేదు ఎందుకంటే అటువంటి పనికి కావలసిన ఎక్స్టెన్షన్ లేదా ఇతర సాఫ్ట్వేర్ తయారు చేయాలి కాబట్టి. ఇక వికీపీడియా పేరుబరికి తరలించడం కన్నా వికీబుక్స్ కు తరలించడం మెరుగైనది ఎందుకంటే గూగుల్ లాంటి వెతుకుయంత్రాలు ప్రధానపేరుబరి విషయాలకు ఫలితాలలో ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చే అవకాశం వుంది. అంతే కాకుండా [[వాడుకరి:Vemurione|Vemurione]] గారు వికీపీడియాలో వుంచి ఇతరుల సహకారంతో నిఘంటువు వృద్ధిచేద్దామనుకున్న ఆలోచనకు వికీబుక్స్ స్థాపన ఆలోచనకు ఏమాత్రం తేడాలేదు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:34, 17 జూలై 2020 (UTC)
::::: [[user:Vemurione]] గారు, ముందుగా మీరు ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని ఎక్కడికీ పోదు. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. వికీలో ఉండవలసిన వ్యాసాల శైలి దృష్ట్యా ఈ వ్యాసాలను వికీ బుక్స్ కి తరలించాలనే ప్రతిపాదనకు నేను అనుకూలం. మీరు వికీ బుక్స్ లో కూడా ఇలాంటి ఇంటర్ ఫేస్ వాడుకునే మార్పులు చేస్తూ వెళ్ళవచ్చు. అందుకు మేము ఎలాంటి సహాయానికైనా సిద్ధం. మీరు డేటాబేస్ గా మార్చాలని చేస్తున్న ప్రయత్నాలకు కూడా నన్ను ఏమైనా సహాయం చేయమంటే చేస్తాను. మిగతా సభ్యులకు నా సూచన ఏమిటంటే తరలింపు నిర్ణయానికి ముందు వేమూరి గారికి తగినంత సమయమివ్వాలి.- [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 12:08, 17 జూలై 2020 (UTC)
::::::గతంలో విక్షనరీకి తరలించవలసిన 257 వ్యాసాలుపై చర్చలు జరిగినవి.అయితే అవి వికీలో ఉండదగినవి కావని తొలగించబడినవి.ఇక్కడ పరిస్థితిని బట్టి [[user:Vemurione|Vemurione]] గారు, ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని వ్యర్ధం కాకుండా, స్వంత అవసరాల కోసం వికీని ఉపయోగించుకుంటాన్నారనే అభిప్రాయం రాకుండా (ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నిఘంటువుని searchable dictionary గా తయారు చెయ్యడానికి నేను, నా స్నేహితులు ప్రయత్నం చేస్తున్నాం అనే అభిప్రాయం వ్యక్తమైనందున), [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు, "ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని ఎక్కడికీ పోదు. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు.వికీలో ఉండవలసిన వ్యాసాల శైలి దృష్ట్యా ఈ వ్యాసాలను వికీ బుక్స్ కి తరలించాలనే ప్రతిపాదనకు నేను అనుకూలం" అని వెలిబుచ్చిన అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 17:17, 17 జూలై 2020 (UTC)
:::::: [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[user:Chaduvari]], [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]], [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] మీరంతా చెబుతున్నారు కనుక, తరలించండి. వికీబుక్స్లోకా? విక్షనరీకా? ఎక్కడకి తరలించినా "ఎడిట్" చేసే హక్కు అందరికీ ఇవ్వవవద్దు. నేను రాబోయే రెండు నెలలలో ఈ సమాచారం అంతా Access database లోకి ఎక్కించే ప్రయత్నంలో ఉన్నాను. ఆ పని జరిగే వరకు master copy సురక్షితంగా ఉండాలి. ఆ database design విషయంలో నేను, నా స్నేహితురాలు తికమక పడుతున్నాం. ఆ పని జరిగిపోయిన తరువాత searchable interface తయారు చేస్తే నిఘంతువు ఎక్కువ ఉపయోగకారిగా ఉంటుందని ఆశ. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 20:41, 17 జూలై 2020 (UTC)
Return to "ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" page.