"నందమూరి తారక రామారావు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[1951]]లో కె.వి.రెడ్డి [[పాతాళభైరవి]], దాని తరువాత అదే సంవత్సరం [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్‌.రెడ్డి]] [[మల్లీశ్వరి]], [[1952]]లో ఎల్వీ ప్రసాదు [[పెళ్ళిచేసి చూడు]], ఆ తరువాత వచ్చిన [[కమలాకర కామేశ్వరరావు]] చిత్రం [[చంద్రహారం]] అతనుకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం, 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. [[పాతాళభైరవి]] 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.
 
[[1956]]లో విడుదలైన [[మాయాబజార్‌]]లో అతను తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. [[1959]]లో [[ఏ.వి.యం.ప్రొడక్షన్స్]] వారు నిర్మించి, విడుదల చేసిన [[భూకైలాస్]] చిత్రంలో [[రావణబ్రహ్మ]] పాత్రకు <!--నటించేందుకు అతను రావణుడి గూర్చి అధ్యయనం చేసి,--> రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. <!--మరెవ్వరూ ఆ పాత్రకు రామారావుగారిలా న్యాయం చేయలేరు. -->[[1960]]లో విడుదలయిన [[శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]] భారీ విజయం సాధించింది. <!--ఆ సినిమా చూసి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎన్.టీ.ఆర్. దర్శనం కోసం అతను ఇంటి ముందు వరుసలు కట్టారు.--> [[శ్రీమద్విరాటపర్వము]]లో అతను ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. [[1963]]లో విడుదలైన [[లవకుశ]] అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు అతను పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. [[1972]]నుంచి అతనుఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.
 
ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం [[1961]]లో విడుదలైన [[సీతారామ కళ్యాణం]]. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసాడు. [[1977]]లో విడుదలైన [[దాన వీర శూర కర్ణ]]లో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. [[1978]]లో విడుదలైన [[శ్రీరామ పట్టాభిషేకం]] సినిమాకు కూడా అతను దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు [[అడవిరాముడు]], [[యమగోల]] గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. [[1991]] ఎన్నికల ప్రచారం కోసం అతను నటించి, దర్శకత్వం వహించిన [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] [[1990]]లో విడుదలైంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2994027" నుండి వెలికితీశారు