శూర్పణఖ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== శూర్పణఖ తల్లి దండ్రులు ==
ఈమె తండ్రి రామాయణంలో వివరించిన విధంగా విశ్రావుడు.ఇతను ఒక రుషి. అగస్త్య ముని సోదరుడు, సృష్టికర్త బ్రహ్మ మనవడు,శక్తివంతమైన రుషి కుమారుడు.పండితుడు,అతను తపస్సు ద్వారా గొప్ప శక్తులను సంపాదిస్తాడు.అది అతనికి గొప్ప పేరును సంపాదించింది.ఇతని భార్య కైకాసి అనే అసుర మహిళ.విశ్రావుడు,కైకాసి దంపతులకు రావణుడు, శూర్పణఖ కాక వీరికి విభీషణ, కుంభకర్ణ అనే మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు.విశ్రావుని మరొక భార్యకు జన్మించిన కుబేరుడు శూర్పణఖ అర్ధ సోదరుడు.<ref name=":0" />
 
== శూర్పణఖ జీవిత చరిత్ర, వివరణ ==
విశ్రావుడు, అతని రెండవ భార్యకు జన్మించిన శూర్పణఖ పుట్టినప్పుడు " మీనాక్షి " (చేప కన్నులుగలదని అర్థం) అనే పేరు పెట్టారు.అమె దుష్టబుద్ధిగల రాక్షసుడుని వివాహమాడింది.మొదట్లో శూర్పణఖ భర్త, తన సోదరుడు,లంకరాజైన రావణుడితో అధిక అభిమానాన్ని సంపాదించాడు.అతను ఆ కారణంతో రావణుడి ఆస్థానంలో విశేషమైన సభ్యుడుగా వ్యవహరించాడు. అయితే దుష్టబుద్ధి కలిగిన అసురుడు మరింత అధికారం కోసం కుట్రపన్నాడు.ఆసంగతి రావణుడు తెలుసుకుని దుష్టబుద్ధిని చంపాడు.అన్న తన భర్తను చంపినందుకు శూర్పణఖ చాలా అసంతృప్తి చెందింది.
 
వితంతువు శూర్పణఖ లంక, దక్షిణ భారతదేశంలోని అరణ్యాల మధ్య గడిపింది.అలా అరణ్యాల మధ్య తిరుగుతూ అసుర, అటవీ నివాస బంధువులను సందర్శిస్తూ కాలం గడుపుతుంది.వాల్మీకి రామాయణం ఆధారంగా అటువంటి ఒక సందర్శనలో, ఆమె [[పంచవటి]] అడవిలో రాముడిని చూస్తుంది.చూసిన వెంటనే వితంతువుగా ఉన్న ఆమె మనస్సులో రాముడిపై ప్రేమలో కలిగింది.ఆమె రాముడిని కావాలని కోరుకుంటుంది.ఆమెకు ఉన్న మాయ అనే శక్తిని ఉపయోగించుకునే అందమైన మహిళగా తనను తాను ముసుగు చేసుకుంటుంది. ఆమె రాముడు దగ్గరకు వచ్చి అతని పాదాలను తాకి నమస్కరించింది.
 
రాముడు ఆమెను ఎవరు నీవు అని మూలం గురించి ఆరా తీస్తాడు. ఆమె బ్రహ్మ మనవడి కుమార్తె అని, కుబేరుడు ఆమె సోదరుడని, శూర్పనఖ చెప్పింది. ఆ తరువాత ఆమె రాముడు సౌందర్యాన్ని గురించి పొగిడి,ఆమెను వివాహం చేసుకోమని కోరింది.దానికి రాముడు తాను ఇప్పటికే వివాహం చేసుకున్నానని, తాను "ఏకపత్నీవ్రతుడు " నని అంటే ‘ఒక భార్యకు మాత్రమే విధేయుడు’ అని రాముడు చెప్తాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శూర్పణఖ" నుండి వెలికితీశారు