లేపాక్షి: కూర్పుల మధ్య తేడాలు

#WPWP
పంక్తి 16:
 
==మందిర వర్ణన==
[[File:Südindischer Meister um 1540 001.jpg|thumb|right|లేపాక్షి దేవాలయంలోని 16వ శతాబ్దముశతాబ్దపు వర్ణచిత్రం]]
లేపాక్షి దేవాలయమున చక్కని ఎరుపు, నీలిమ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు లను ఉపయోగించి అబ్ధుతమగు చిత్రములు గీయించిరి. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనము యొక్క గొప్పదనము- అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పదనమును కూడా చూడవచ్చును. సమకాలికుడగు [[పింగళి సూరన్న]] ప్రభావతీ ప్రద్యుమ్నమున కొంత సూచించాడు. అందు ప్రభావతీ వర్ణన " కన్నుల గట్టినట్లు తెలికన్నుల నిక్కను జూచినట్ల, తోబలుక కడంగినట్ల, భావ గంభీరత లుట్టి పడన్ శివ వ్రాసినట్టి ఈ చిత్తరవు" అని శుచిముఖిచేత వర్ణించాడు.శివ, [[వీరభద్ర]], వైష్ణవాలాయములకు సమానమైన ముఖమండపము పైకప్పు లోభాగమున [[మహాభారత]], రామాయణ పౌరాణిక గాథల పెక్కుగా వ్రాసినను, వీరభద్ర దేవాలయపు గోడలమీదను, శివాలయపు అర్ధపంటపమున శివకథలు అచ్చెరెవు గొల్పునట్లు అలంకరించారు. పార్వతీ పరిణయము, పార్వతీ పరమేశ్వరుల పరస్పరానురాగ క్రీడలు, త్రిపుర సంహారము, శివ తాండవము లోనిఆఖ్యాయికలు గాథా విషయములుగ చేర్చబడినవి. గౌరీ ప్రసాద శివుడను చిత్తరువున పద్మములు మీసములతో జటాజూటము నుండి ప్రవహించు గంగను మరుగుపరుపజూచుచు [[శివుడు]] [[పార్వతి]] చిబుకములపై చేయుడి బుజ్జగించుట, పార్వతి ప్రణయ కోపము, పరిణయమునకు ముందు పార్వతీ అలంకారము, పార్వతీ పరమేశ్వరులు చదరంగమాడుట, శివుడు అంధకాసుర సంహారమొనర్చుట ముఖమున శాంతి, కరమున శూలము పెట్టి [[రుద్రుడు]] మొఖము, శివుని భిక్షాటనము, నటేశుని ఆనందతాండవము, [[దక్షిణామూర్తి]] మొదలగు చిత్రములు చూచువారిని ముగ్ధులు గావించెను. విష్ణువాలయమున మధ్య విష్ణువును, చుట్టు దశావతారములను చిత్రించిరి. లేపాక్షి శిల్పములు అనల్పములు. 60 కాళ్ళ ముఖ మంటపములోని స్తంభముల మీద పూర్ణకృతులగు సంగీతకారులయ, నటులయ మూర్తులను విజయనగర కీర్తిని తీర్చారు. [[బ్రహ్మ]] మద్దెలను, [[తుంబురుడు]] వీణెను, నందికేశ్వరుడు హుడుక్కను మరియొక నాట్యచార్యుడు తాళమును వాయింప [[రంభ]] నాట్య మాడుట ఒకచోట చిత్రించెను.
 
"https://te.wikipedia.org/wiki/లేపాక్షి" నుండి వెలికితీశారు