దీనబాంధవ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
దీనబాంధవ, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో సంస్కృతంలో ఎం.ఏ., [[తెలుగు విశ్వవిద్యాలయం]]లో రంగస్థల కళలశాఖలో ఎంపిఏ పూర్తిచేసాడు.
 
భాస్కర్ అనే మిత్రుడి సహాయంతో సొంతంగా పాటలు రాసి, స్వరకల్పన చేసి, పాడుతూ దాదాపు 30 ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. దీనబాంధవ రూపొందించిన జంగిట్యూన్ అనే ఆల్బమ్ ను అప్పటి గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాల చేతుల మీదుగా విడుదల చేశాడు. సర్వశిక్షా అభియాన్ నిర్వహించిన నేషనల్ ఆడియో, వీడియో ఫెస్టివల్ లో పాల్గొని జాతీయ అవార్డును సాంతం అందుకున్నాడు.<ref>కళాబాంధవుడు, నమస్తే తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్, 25 జులై 2018.</ref>
 
== నాటకరంగం ==
నాటకరంగంలో పరిశోధన చేస్తున్న దీనబాంధవ, చిన్నపిల్లలతో నాటకాలు వేయిస్తూ సాంస్కృతి, సంప్రదాయాలను, పురాణాలను, స్ఫూర్తి ప్రదాతల జీవిత చరిత్రలను నాటకాలుగా మలిచి నేటి తరానికి చైతన్యం కలిగిస్తున్నాడు. 2015, ఫిబ్రవరి 23న 250మంది చిన్నారులతో 12 గంటలపాటు రవీంద్రభారతిలో 'శ్రీ ఆంజనేయం' నాటకాన్ని ప్రదర్శించాడు.<ref>ఔరా.. అనిపించిన 'దీనబాంధవ, నమస్తే తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్, 30 మార్చి 2015</ref><ref>Giving a Boost to Telugu Theatre, Daccan Chronicle, Hyderabad, 27 March 2015 </ref>
 
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో సూరజ్ ఖుండ్ లో 15రోజుల పాటు జరిగిన 'థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్' శిక్షణ శిబిరంలో పాల్గొని, నాటక కళ బడి పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందనే అంశంపై శిక్షణ పొందాడు.<ref>కళాబాంధవుడు, నమస్తే తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్, 25 జులై 2018.</ref>
 
'''దర్శకత్వం చేసినవి'''
"https://te.wikipedia.org/wiki/దీనబాంధవ" నుండి వెలికితీశారు