"చాణక్యుడు" కూర్పుల మధ్య తేడాలు

6,761 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
(Y)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
'''
Chanakya rajaneethi
 
 
== చాణక్య అర్ధశాస్త్రము ==
ఇందులో రాజకీయ శాస్త్రాన్ని విస్తృతంగా పరిచయం చేస్తూ, దానిని ఏ విధంగా సజావుగా రాజ్యాన్ని ఏలేందుకు ఉపయోగించుకోవాలి, యుద్ధాల్లో, పరదేశీయులతో చేసే మంతనాల్లో ఎలాంటి విధానాన్ని చేపట్టాలి,వేగులు, గూఢచారుల వ్యవస్థను ఎలా నడపాలి, వివిధ అవసరాలకు నిఘా వ్యవస్థను ఎలా అమర్చుకోవాలి, రాజ్య ఆర్ధికస్థిరత్వానికి ఏం చేయాలి - మొదలగు అంశాలను విశదీకరించాడు. కౌటిల్యుడు తన ధర్మ-నీతి-అర్థ శాస్త్రాలకు ఆధారం బృహస్పతి, ఉషణసుడు, ప్రాచేతస మనువు, పరాశరుడు, అంబి మొదలగు వారు ప్రతిపాదించిన పాలనా తత్త్వశాస్త్రగ్రంథాలని చెప్పుకున్నాడు. తనను తాను పాలన తత్త్వ శాస్త్రవేత్తల వంశానికి చెందిన వాడిగా చెప్పుకుంటూ, తన తండ్రి చణకుడు కూడా గొప్ప పాలనాతత్త్వశాస్త్రవేత్త అని పేర్కొన్నాడు.
 
ఇందులో ఒక ముఖ్య సిద్ధాంతము '''మండలయోని'''. మండలయోనిలో సంక్లిష్టమైన రాజ మండలాన్ని కౌటిల్యుడు సృష్టించాడు. రాజ్యావతరణ మొదటి దశలో చిన్న చిన్న రాజ్యాలు పెద్ద పెద్ద రాజ్యాలుగా రూపొందడం కొరకు సంఘర్షణలు, యుద్దాలు తప్పనిసరి అయినాయి. చిన్న రాజ్యాలు పెద్ద రాజ్యాలుగా ఏర్పడవలెననే కాంక్షకు కారణం సాంఘికంగా, ఆర్ధికంగా, రాజ్కీయ సుస్థిరమైన, దృఢమైన రాజ్యంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను ప్రజలు గుర్తించటమే అంటాడు కౌటిల్యుడు. మండలయోనిలో రాజ్య విస్తరణను (Political Aggrandizement) సాధించడమే కాక వివిధ రాజ్యాలమధ్య రాజ్యాధికార సమతౌల్యతను ( Balance of Power) సాధించడం ఎట్లో ఈ సిద్ధాంతం వివరిస్తుంది. వివిధ రాజ్యాలతో కూడిన రాజమండలంలో బాహ్యంగా ఏకాంతరంగా వున్న రాజ్యాలను '''నేమి''' గా, తదనంతర రాజ్యాలను ఆకులుగా, '''విజుగీషు''' లైన నేత తనను నాభిగా చేసుకొని నలుదిక్కులకు వ్యాపించవలెను. ప్రకృతి మండల వృత్తములలో నాభిగా ఉన్న విజిగీషులైన రాజును లేక రాజ్యమును, వెంటనే చుట్టివున్న రాజ్యాలు విజిగీషుకు సహజ శత్రువులు. వీరియడల నాభిగా వున్న విజిగీషులైన రాజు అత్యంత జాగరూకుడై ఉండాలి. సహజ శత్రువులతో కూడిన వృత్తమునకు వెంటనే ఆవరించి వున్న బాహ్య వృత్తములోని రాజ్యములు విజిగీషుకు సహజ మిత్ర రాజ్యములు. అంతేకాక విజిగీషునకు ఆవరించిఉన్న రెండవవృత్తములోని (మిత్ర రాజ్యములు) వీరు సహజ శత్రువులు. ఈ విధంగా విజిగీషు నాభిగా, సహజ శత్రువులు ఆకులుగా, సహజ మిత్ర రాజ్యములు నేమిగా ప్రకృతి మండల చక్రం అతి సంక్లిష్టమైన అంతర్ రాజ్య సంబంధాలను విజిగీషు అతి జాగరూకతతో నిర్వహించవలసి వుంటుంది. మండల్ రాజ్యములు యుద్ధములతో సతమతమై వుండటం సహజం.రాజ మండలములో రాజకీయ యధాతస్తితికి ఏక్షణంలోనూ తావులేదు అంటాడు కౌటిల్యుడు. 18వ శాతాబ్దం ఐరోపా రాజకీయాలలో బ్రిటీష్ రాజనీతిని పరిశీలిస్తే ప్రకృతి మండలం సిద్ధాంతం ఎంత విశ్వజనీయమైనదో తెలుస్తుంది.ఫ్రెంచి దేశపు 14వ లూయీ తన మనుమడైన ఫిలిప్ కు స్పెయిన్ కు రాజుగా చేసినప్పుడు ఇంగ్లాండ్ ఐరోపా రాజకీయాధికార చిత్రాన్ని సమతౌల్యం చేయుటకొరకు నెదర్ల్యాండ్, జర్మనీ, పోర్చుగల్, డెన్మార్క్, హాబ్ర్బర్గ్ కుటుంబంతో చేతులు కలిపి ఫ్రెంచి సాంరాజ్య విస్తరణ కాంక్ష 1701-1714 మాధ్య కాలంలో స్పానిష్ యుద్ధాలతో దెబ్బతీసింది.
 
 
 
==తక్షశిల విశ్వవిద్యాలయం==
743

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2998921" నుండి వెలికితీశారు