తోటలో పిల్ల కోటలో రాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* నిర్మాత: [[వై.వి.రావు]]
==సంక్షిప్తకథ==
మణిపుర దేశాన్ని పాలించే కామపాలునికి జీవితాంతం యౌవనదశలో ఉండిపోవాలని కోరిక కలుగుతుంది. నవద్వీపంలో కామందకుడి రక్షణలో ఉన్న యౌవనఫలం ఆరగిస్తే ముసలితనం రాదని తెలుసుకుంటాడు. యౌవనఫలాన్ని తెచ్చినవారికి అర్థరాజ్యం ఇస్తానని ప్రకటిస్తాడు. మణిపుర సేనాని దుర్జయుడు యౌవనఫలం కోసం వెళ్ళి అక్కడ చంచల మోహంలో చిక్కుకుంటాడు. తరువాత మహారాజు తమ్ముడు విజయుడు అపురూపమైన వస్తువుల సహాయంతో నవద్వీపం నుంచి యౌవనఫలాన్ని తీసుకువస్తాడు. దుర్జయుణ్ణి విడిపిస్తాడు. మహారాజు యౌవనఫలాన్ని రాణి రాగవతికి ఇస్తాడు. రాగవతి భర్తను మోసం చేసి ఆ ఫలాన్ని తన రహస్య ప్రియునికి ఇస్తుంది. అది సహించలేక రాణిని, ఆమె ప్రియుణ్ణి వధించి మహారాజు అడవులకు వెళ్ళిపోతాడు. విజయుడు రాజ్యపాలన కొనసాగిస్తాడు. దుర్జయుడు ఇది సహించలేక మహారాజును అవమానపరచిన స్త్రీజాతిపై పగ తీర్చుకోవలసిందిగా విజయునికి బోధిస్తాడు. రోజుకొక స్త్రీని పెళ్ళిచేసుకుంటూ స్త్రీజాతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటాడు విజయుడు. తోటమాలి కూతురు గౌరి దుర్జయునికి ఎదురు తిరిగి కోటలోకి మహారాణిగా వెళుతుంది. స్త్రీలలో పతివ్రతలున్నారని, తన సౌశీల్యం ఋజువు చేసుకోవడానికి గడువు కావాలని రాజును కోరుతుంది. రాజు అందుకు అంగీకరించి ఏకశిలాభవనంలో బంధించి ఆరు నెలలు గడువు ఇస్తాడు. ఇచ్చిన గడువులోగా తన సౌశీల్యాన్ని ఋజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా గౌరికి భస్మం లభిస్తుంది. ఆ విభూతిని భర్తపై చల్లాలనుకున్న గౌరి తిరిగి మనసు మార్చుకుని విసిరివేస్తే ఆ మంత్రభస్మం నాగకన్య శిరస్సుపై పడుతుంది. నాగకన్య గౌరికి ఒక మాయాఉంగరాన్ని బహూకరిస్తుంది. గౌరిని, రాజ్యాన్ని వశపరుచుకునేందుకు, విజయుని చంపించేందుకు దుర్జయుడు అనేక విధాల ప్రయత్నించి విఫలుడౌతాడు. నాగకన్య సహాయంతో గౌరి మోహిని వేషంలో విజయుని కలుసుకుని అతని అనురాగాన్ని పొందుతుంది. విజయుడు తను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడతాడు. మణిబంధం మహిమతో దుర్జయుడు విజయుణ్ణి బంధిస్తాడు. మణిబంధాన్ని తిరిగి వశపరచుకోవడానికి చంచల, గౌరి, నాగకన్య ఎత్తుకుపైఎత్తు వేస్తారు. ఆ తర్వాత అనేక మంత్రాలు, తంత్రాలు, యుద్ధాలు పతాకసన్నివేశంలో జరుగుతాయి<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=రామ్‌చంద్ |title=చిత్రసమీక్ష - తోటలో పిల్ల కోటలో రాణి |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=45873 |accessdate=24 July 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=22 November 1964}}</ref>.
 
==పాటలు==