వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==సినీ ప్రస్థానం==
అసెంబ్లీలో లైబ్రరీ అసిస్టెంటుగా పనిచేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న [[రవీంద్ర భారతి]]కి వెళ్ళడం అలవాటైంది. ఒకసారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటల రచయిత [[దివాకర్ బాబు]]కు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళి, అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. రవీంద్రభారతిలో వేణుమాధవ్ చేసిన కామెడీ స్కిట్ అతడి జీవితాన్నే మార్చేసింది. వేణుమాధవ్ ఆ కార్యక్రమంలో ''గుల గుల గులాబ్ జామ్'' అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చి, సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి సినిమా [[ఎస్వీ కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన [[సంప్రదాయం (సినిమా)|సంప్రదాయం]] అనే సినిమా. అప్పటివరకు మిమిక్రీ ప్రోగ్రాంకు రూ. 1000 మాత్రమే తీసుకునే వేణుమాధవ్‌కు ఆ సినిమా కోసం రూ. 70వేలు పారితోషికంగా ఇచ్చారు. నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ అదే. ఆ సినిమా పూర్తయిన మూడు రోజులకే [[శ్రీకారం]] చిత్రంలో అవకాశం వచ్చింది. అలా వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు.<ref>మే 17, 2009 ఈనాడు ఆదివారం సంచిక</ref> [[తొలిప్రేమ]] సినిమాలో అమ్మాయిలపైన వేణుమాధవ్ చెప్పిన డైలాగు ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది. [[దిల్]] సినిమాలో వేణుమాధవ్ పోషించిన నితిన్ మావయ్య పాత్ర మంచి పేరు వచ్చింది. 2006లో విడుదలైన [[లక్ష్మి (2006 సినిమా)|లక్ష్మి]] సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా [[నంది అవార్డు]]ను అందుకున్నాడు. [[హంగామా (సినిమా)|హంగామా]] సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్, [[ప్రేమాభిషేకం (2008 సినిమా)|ప్రేమాభిషేకం]] సినిమాను నిర్మించాడు.<ref name="‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’ |url=https://www.sakshi.com/news/movies/comedian-venu-madhav-interview-170843 |accessdate=25 September 2019 |work=Sakshi |date=25 September 2019 |language=te}}</ref> ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు [[సై]], [[ఛత్రపతి]], మొదలైనవి. చివరిసారిగా [[రుద్రమదేవి (సినిమా)|రుద్రమదేవి]], డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్ (2016) సినిమాలలో నటించాడు. [[హంగామా (సినిమా)|హంగామా]], [[భూకైలాస్-ఎకరం 50 కోట్లు|భూకైలాష్]], [[ప్రేమాభిషేకం (2008 సినిమా)|ప్రేమాభిషేకం]] చిత్రాల్లో వేణు హీరోగా నటించాడు.<ref name="నేను మౌలాలి మెగాస్టార్‌ని!">{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=నేను మౌలాలి మెగాస్టార్‌ని! |url=https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |accessdate=25 September 2019 |work=Sakshi |date=25 September 2019 |archiveurl=https://web.archive.org/web/20190925083904/https://www.sakshi.com/news/family/exclusive-interview-with-venu-madhav-72764 |archivedate=25 25 September 2019 |language=te |url-status=live }}</ref>
 
ఇండస్ట్రీలో వేణుమాధవ్ కి [[చిరంజీవి]], [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] అంటే ఎంతో గౌరవం. చిరు 150వ సినిమా, బాలయ్య 100వ సినిమా సక్సెస్ అందుకోవాలని వేణుమాధవ్ గుండు కూడా కొట్టించుకున్నాడు. వేణుమాధవ్ తన పుట్టినరోజుకి కేక్ కట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ ని పాటించడు. పరిశ్రమకొచ్చినప్పట్నుంచీ తన పుట్టిన రోజును అనాథ శరణాలయంలోనే జరుపుకున్నాడు. వారికి ఉపయోగపడే ఏదొక పని చేయడం తనకు చెప్పలేని సంతృప్తి అని వేణుమాధవ్ చెప్పేవాడు. చిరంజీవితో కలిసి [[జై చిరంజీవ]] సినిమాలో నటిస్తున్న సమయంలో వేణుమాధవ్ పుట్టినరోజు రావడంతో ఆ ఒక్కసారి మాత్రం చిరంజీవి కోసం రూల్ బ్రేక్ చేసి కేక్ కట్ చేశాడు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్న వేణుమాధవ్ తన ఇళ్ళకు ''అచ్చొచ్చిన కృష్ణ నిలయం'' అని పేరు పెట్టుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/వేణుమాధవ్" నుండి వెలికితీశారు