ఎమ్మెస్ రామారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి కొంతవరకు విస్తరించబడింది, విస్తరణ అంశాలు చర్చాపేజీలో లేవు ట్యాగు: 2017 source edit |
Arjunaraoc (చర్చ | రచనలు) చి →సినీరంగంలో: archive url లింకు తొలగించు హాసం అధికారిక స్కాన్ విడుదల కాదు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit |
||
పంక్తి 27:
==సినీరంగంలో==
ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో (1941 లో) అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. న్యాయనిర్ణేతల్లో ఒకరైన [[అడవి బాపిరాజు]] చలన చిత్ర రంగంలో ప్రవేశించమని ఆయనను చాలా ప్రోత్సహించారు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత [[వై.వి.రావు]] తన [[తహసీల్దార్]] చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ''ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా'' అనే ఎంకి పాట పాడించారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన [[సి.హెచ్. నారాయణరావు]]కు ఇది గాత్రదానం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. తరువాత ఈయన [[దీక్ష (1951 సినిమా)|దీక్ష]], [[ద్రోహి (1948 సినిమా)|ద్రోహి]], [[మొదటి రాత్రి (1950 సినిమా)|మొదటిరాత్రి]], [[పాండురంగ మహత్యం]], [[నా ఇల్లు|నా యిల్లు]], [[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కల్యాణము]], [[శ్రీరామాంజనేయ యుద్ధం (1958)|శ్రీరామాంజనేయ యుద్ధము]] మొదలైన సినిమాలలో పాడారు.<ref>{{cite journal|last1=ఎం.చిత్తరంజన్|title=ఈ విశాల ప్రశాంత...|journal=హాసం - హాస్య సంగీత పత్రిక|date=16 December 2001|volume=1|issue=6|pages=12-13|
1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల [[మద్రాసు]] వదిలి [[రాజమండ్రి]] చేరుకుని 1974వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేసారు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన [[ఇండియన్ ఏర్ ఫోర్స్(IAF)]]లో పైలట్ ఆఫీసరుగా నియమితుడైనారు. 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియ లేదు. తల్లి తండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు. తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఆయన [[హనుమాన్ చాలీసా]], సుందరకాండ వ్రాయడానికి అదే ప్రేరణ.{{fact}} 1972 నుండి 74 వరకు [[తులసీదాసు]] [[హనుమాన్ చాలీసా]]ను [[హిందీ]] నుంచి తెలుగులోనికి అనువదించారు, తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ [[సుందరకాండ]] గేయరచన చేశాడు. 1975 నుంచి [[హైదరాబాదు]]లోని [[చిక్కడపల్లి]]లో నివసించారు. రామారావుకు 1977 సంవత్సరంలో ''సుందరదాసు'' అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన [[ఏప్రిల్ 20]], [[1992]]న [[హైదరాబాదు]]లో సహజ కారణాల వల్ల మరణించాడు.
|