వర్షం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 81:
పడుతున్న వర్షపు బిందువులను కార్టూన్లలలో, చిత్రాలలో "కన్నీటి చుక్క"లాగా క్రిందవైపు గుండ్రముగా, పై భాగమున కురుచగా చిత్రీకరిస్తారు కానీ ఈ చిత్రీకరణ సరైనది కాదు. కేవలము కొన్ని మూలాల నుండి పడే నీటి బిందువులు మాత్రమే ఉద్భవించే సమయంలో కన్నీటి ఆకారంలో ఉంటాయి. చిన్న వర్షపు చుక్కలు [[వృత్తం|వృత్తాకారం]]గా ఉంటాయి. పెద్ద చుక్కలు క్రింది భాగములో చదునుగా, ఆఉంటాయి. అత్యంత పెద్ద బిందువులు [[పారాచూట్]] ఆకారంలో ఉంటాయి.<ref>http://www.ems.psu.edu/~fraser/Bad/BadRain.html</ref> వర్షపు బిందువుల యొక్క ఆకారాన్ని 1898లో [[ఫిలిప్ లెనార్డ్]] అధ్యయనం చేశాడు. ఈయన చిన్న వర్షపు బిందువులు (2 మి.మీ కంటే తక్కువ వ్యాసం ఉన్నవి) దాదాపు వృత్తాకారంలో ఉన్నవని కనుగొన్నాడు. పరిమాణము పెరిగే కొద్ది (5 మి.మీ వ్యాసం వరకు) మరింత డోనట్ ఆకారంలో తయారవుతాయి. 5 మి.మీ కంటే పెద్ద బిందువులు అస్థిరమై ముక్కలవుతాయి. సగటు వర్షపు చుక్క 1 నుండి 2 మి.మీల వ్యాసం కలిగి ఉంటుంది. ప్రపంచములో అత్యంత పెద్ద వర్షపు చుక్కలను 2004 లో [[బ్రెజిల్]], [[మార్షల్ దీవులు|మార్షల్ దీవుల]]లో నమోదు చేశారు. అందులో కొన్ని 10 మి.మీల దాకా ఉన్నాయి. ఈ పెద్ద బిందువులు ఒక పొగ కణంపై ద్రవీభవనం జరగటం వలననో లేక చిన్న ప్రదేశాలలో అతి ఎక్కువ [[నీరు]] ఉండటం వలన బిందువులు ఒకదానికొకటి ఢీకొనటం మూలంగానో సంభవిస్తాయి.
 
వర్షపు బిందువులు తమ [[అంత్య వేగము]]తో [[అభిఘాతము]] చెందుతాయి. పెద్ద బిందువులకు ఈ అభిఘాతమెక్కువ. సముద్రతలములో [[గాలి]]లేకుండా 0.5 మిమీల వర్షపు బిందువు [[జల్లు]] 2 మీ/సెతో అభిఘాతం చెందుతుంది, కానీ 5 మిమీల బిందువు 9 మీ/సెతో అభిఘాతం చెందుతుంది.<ref>{{Cite web |url=http://www.wonderquest.com/falling-raindrops.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-06-29 |archive-url=https://web.archive.org/web/20070701191048/http://www.wonderquest.com/falling-raindrops.htm |archive-date=2007-07-01 |url-status=dead }}</ref> నీటి బిందువులు నీళ్లను తాకే శబ్దం గాలి బుడగలు నీటిలో చేసే కంపనాల వల్ల వస్తుంది. చూడండి [[బిందువు#ధ్వని|బిందువు యొక్క శబ్దం]]
 
సాధారణంగా వర్షం యొక్క [[pH]] 6 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. వాతావరణంలోని [[కార్బన్ డయాక్సైడ్]] వర్షపు బిందువులలో కరిగి స్వల్ప మొత్తాలలో [[కార్బోనిక్ ఆమ్లం]] ఉత్పత్తి చేయటమే దీనికి కారణం. కార్బోనికామ్లం పీ.హెచ్ ను కొద్దిగా తగ్గిస్తుంది. కొన్ని ఎడారి ప్రాంతాలలో, వాతావరణంలోని గాలిలో అవపాతం యొక్క సహజసిద్ధమైన ఆమ్ల స్వభావాన్ని తటస్థీకరించటానికి సరిపడా [[కాల్షియం కార్బోనేట్]] ఉండటంతో వర్షపాతం తటస్థంగాను లేక [[క్షారము]]గా కూడా ఉండే అవకాశముంది. 5.6 కంటే తక్కువ పీ.హెచ్ ఉన్న వర్షాన్ని [[ఆమ్ల వర్షం]]గా పరిగణిస్తారు.
"https://te.wikipedia.org/wiki/వర్షం" నుండి వెలికితీశారు