చర్చ:విశాఖపట్నం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 46:
: గ్రామాల పేర్లలో చివరన వచ్చే పట్నం, నగరం వంటివి పెద్దగా ముఖ్యం కాదని బాగా సెలవిచ్చారు. ఆ లెక్కన విజయ-వాడకీ, విజయ-నగరానికీ పెద్దంత తేడా లేదు. (ఏడవ లేక నవ్వుకుందుకు జోకు) గ్రామనామాల అధ్యయనం అన్నది ప్రత్యేక శాస్త్రం. దానిలో సుస్పష్టంగా గ్రామం పేరులో పూర్వ భాగానికి, ఉత్తర భాగానికి (ప్రథమావయవానికి, ద్వితీయావయవానికి) కూడా విలువనిచ్చి ఎంతగానో కృషిచేశారు. మీరెవరైనా ఆయా పుస్తకాలు చదివి సశాస్త్రీయంగా గ్రామం పేరులో చివరన వచ్చే పదానికి విలువ లేదని ఉటంకించి చెప్తే బావుంటుంది తప్ప ఈ పాసింగ్ కామెంట్ల వల్ల లాభం లేదు. వాడ అన్న పదం ఆ పట్టణానికి వాణిజ్యపరమైన ప్రాధాన్యతను సూచిస్తోందని శాస్త్రం అధ్యయనం చేసినవాళ్ళు చెప్పారు. అర్జున గారి దృష్టిలో వాడ అన్నది కేవలం ఓ పదం, నిఘంటువు చాలు దాన్ని వివరించడానికి, ఆయన అన్నారు కదాని నేను వెళ్ళి నిఘంటువులు తిరగవేసి ఎదురు వాదం చెప్పాలి. అదే నేను ఏదైనా శాస్త్ర గ్రంథం ఉదహరించి చూసి చెప్పమంటే అది అజీర్తి చేస్తుంది. చదవకుండానే, అధ్యయనం చేయకుండానే ఉటంకింపులు లేకుండానే చర్చిస్తారు. సరేలెండి- చదివి చెప్పడం, అధ్యయనం చేసి మాట్లాడ్డం వంటివి నేను ఆశించకూడదు ఇకనుంచీ. అది నా బాధ్యత. అలా నేను పనిచేశాకా, ఏ మాత్రమూ మూలాలు ఉటంకించకుండా, ఒక ప్రాతిపదికా పాడూ లేకుండా, ఎవరికి తోచిన వ్యాఖ్య వారు చేయవచ్చు- చర్చంటే అలాగే సాగుతుందని నేనిక అర్థం చేసుకోవాలి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:45, 26 జూలై 2020 (UTC)
::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ, కువిమర్శల వల్ల మీరు చేస్తున్న కృషి ఎన్నటికీ పలుచన కాదు. నాకు-సమస్తం-తెలుసు-వాదులు చేసే కువిమర్శలను పట్టించుకోనక్కర్లేదు, అస్సలు పట్టించుకోకూడదు కూడా. వాటి గురించి మీరు బాధ పడాల్సిన పనే లేదు. వికీ విధానాల పట్ల మీకంటే ఎక్కువ అవగాహన కలవారు మన సముదాయంలో నాకు తెలిసి లేరు. మీరు వికీపీడియాకు చక్కటి విలువ చేకూరుస్తున్నారు. మీ కృషి కొనసాగిస్తూనే ఉండండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 12:22, 26 జూలై 2020 (UTC)
::: చర్చను పూర్తిగా అర్థం చేసుకోకుండా, చర్చలోని ఒక వాక్యంగాని, వాక్యంలోని కొంతభాగం కాని తీసుకొని చర్చను వక్రీకరించడం మరియు చర్చను పక్కదారి పట్టిస్తాడనే కారణంతో నేను సదరు సభ్యుడితో ఇటీవల ప్రత్యక్షంగా చర్చలు చేయడం లేదు. ఇదే విషయం గత చర్చలలో పేర్కొన్నాను కూడా. మళ్ళీ అదే పరిస్థితి పునరావృత్తం కావడం శోచనీయమైన విషయం. ఇక్కడ '''పట్నం'''పై చర్చ జర్గడం లేదు. '''విశాఖపట్నం''' వ్యాసంలో గ్రామనామం ఎలా వచ్చిందనే అంశంపై మూలానికి సంబంధించిన చర్చ మాత్రమే. ఇక్కడ మూలం పెట్టాలంటే విశాఖ పేరు ఎలా వచ్చిందనే ఆధారానికే కాని పట్నంకు కాదని స్పష్టంగానే చెప్పాను. పట్నంకు మూలం ఇవ్వాలంటే విశాఖపట్నంకు చివరన పట్నం ఎందుకు వచ్చిందనే మూలం లభ్యమైతే తప్ప మూలం ఇచ్చే అవసరం లేదు. అది విశాఖపట్నంకు సంబంధించి ఉండాలి, [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:31, 27 జూలై 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:విశాఖపట్నం" నుండి వెలికితీశారు
Return to "విశాఖపట్నం" page.