ఖైదీ నెం. 786: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ ప్రారంభించాను
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
imdb_id =0245998
}}
'''ఖైదీ నెం. 786''' [[విజయ బాపినీడు]] దర్శకత్వంలో 1988లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, స్మిత, భానుప్రియ ముఖ్యపాత్రలు పోషించారు. [[రాజ్ - కోటి]] సంగీతం అందించారు. ఈ సినిమాను మాగంటి రవీంద్రనాథ్ చౌదరి శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించగా గీతా ఆర్ట్స్ సంస్థ పంపిణీ చేసింది.
 
== కథ ==
గోపి గ్రామంలో సంగీతం నేర్చుకుంటూ పెరుగుతాడు. పోలీస్ కానిస్టేబుల్ కావాలనుకుంటాడు. అదే ఊర్లో ధనవంతుడైన సూర్యచంద్రరావు కి రాధ అనే ఒక కూతురు ఉంటుంది. ఆమెకు ధనగర్వం, అహంకారం. ఆమె ఒకసారి గోపీతో గొడవపడి అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. గోపీ దగ్గర శిష్యురాలిగా చేరి సంగీతం నేర్చుకున్నట్లు నటించి చివరికి అతను తన మీద అత్యాచారం చేయబోయాడని నిందలు వేస్తుంది. దీనికి అసిరయ్య అనే పోలీసు ఎస్. ఐ సహాయపడతాడు. కానీ తర్వాత గోపీ మంచి మనసు తెలుసుకుని అతనితో ప్రేమలో పడుతుంది. గోపీ మొదట్లో ఆమెను క్షమించలేకపోయినా ఆమె ప్రేమలో నిజాయితీని చూసి ఒప్పుకుని పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఆమె తండ్రి సూర్యచంద్రరావు మాత్రం గోపి మీద కోపం పెంచుకుని అతన్ని చంపడానికి రౌడీని పంపుతాడు. అతన్ని చితక్కొట్టి సూర్యచంద్రరావు ఇంట్లో పడేయిస్తాడు గోపి. సూర్యచంద్రరావు రౌడీని హత్యచేసి ఆ నేరం గోపీ మీద వేసి జైలుకి పంపిస్తాడు. గోపీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని నేరస్థులను చట్టానికి పట్టించడం మిగతా కథ.
 
== తారాగణం ==
* గోపీచంద్ గా [[చిరంజీవి]]
* [[స్మిత]]
* రాధగా [[భానుప్రియ]]
* అసిరయ్యగా [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]]
* [[సుత్తివేలు]]
* సూర్యచంద్రరావుగా [[కోట శ్రీనివాసరావు]]
* [[నూతన్ ప్రసాద్]]
* [[కైకాల సత్యనారాయణ]]
Line 25 ⟶ 29:
* గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
* గుండమ్మో, బండి దిగి రావమ్మో
* అటు అమలాపురం
 
==ఇవి కూడా చూడండి==
Line 33 ⟶ 38:
 
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/ఖైదీ_నెం._786" నుండి వెలికితీశారు