రావి కొండలరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27:
 
== ఇతర వివరాలు ==
ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం [[కళాప్రపూర్ణ]] ఇచ్చి గౌరవించింది. 1958లో ‘[[శోభ]]’ చిత్రంతో ఆయన సినీ నటన మొదలైంది. పాఠశాల చదువు [[కాకినాడ]]లో జరిగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు. కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు [[పొన్నలూరి బ్రదర్స్‌]]వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు. ఆయనకు [[రాధాకుమారి]]తో వివాహం అయింది. ఇద్దరూ [[తమిళ భాష|తమిళ]] సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని [[ముళ్ళపూడి వెంకటరమణ]] అనేవారట. [[ఆదుర్తి సుబ్బారావు]] తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది. [[విజయచిత్ర]] సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. [[రాధాకుమారి]] గారు జన్మించినది [[విజయనగరం]]లో. ముందు ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకునిప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం [[తేనె మనసులు (1965 సినిమా)|తేనె మనసులు]].
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/రావి_కొండలరావు" నుండి వెలికితీశారు