వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 491:
::::నాపై చూపిన అభిమానానికి [[వాడుకరి:Arjunaraoc|అర్జున]], [[User:K.Venkataramana|వెంకటరమణ]], [[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|ప్రభాకర్ గౌడ్ నోముల]] గార్లకు కృతజ్ఞతలు. అలాగే ప్రారంభంలో నా నిర్వాహక హోదాను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రోత్సహించిన వైజాసత్య, కాసుబాబు, దేవా గార్లకు కూడా వందనాలు. గత ఏడాది చేసిన ఒక పాలసీకి నిరసనగా అప్పుడే నేను నిర్వాహకుల నోటీసు బోర్డులో రాజీనామా సమర్పించాను. మారిన పరిస్థితుల దృష్ట్యా ఆ అధికారం అధికారులకు లేదని మెటాలో అభ్యర్థన చేయమని ఒక సభ్యుడు సెలవియ్యగా, ఎలాగూ ఆ పాలసీకి అనుగుణంగా దిద్దుబాట్లు చేయననీ, తొలగింపు తప్పనిసరి అని వేచిచూశాను. కాని నెలలు గడిచినా, సంవత్సరం పైగా గడిచినా ఆ పాలసీ అటకెక్కింది కాని పట్టించుకొనే వారే లేరు. అమలు చేయనప్పుడు సభ్యుల సమయం వెచ్చించి పాలసీలెందుకు చేస్తున్నారో అర్థం కాదు కాని చివరికి విసిగిపోయి మాట ప్రకారం నేనే మెటాలో అభ్యర్థన చేసి నిర్వాహక హోదాను ఉపసంహరించుకున్నాను. నిర్వాహక హోదాను ఉపసంహరించుకున్నా నేను తెవికీ నుంచి వెళ్ళిపోయే ప్రశక్తి ఏ మాత్రం లేదు కాబట్టి సభ్యులు బాధపడే/సంతోషపడే అవసరం లేదని తెలియజేస్తున్నాను. ఇదివరకటి కంటే మరింత చురుకుగా తెవికీలో సమీక్ష పనులు నిర్వహించి లోటుపాట్లను, నిర్వాహక తప్పిదాలను ఖచ్చితంగా బహిర్గతం చేసి తెవికీ అభివృద్ధికి తోడ్పడగలను. ప్రస్తుత తెవికీ ఘోరదశలో ఉంది. ఊబిలో దిగజారిన తెవికీని పట్టాలపైకెక్కించడానికి తెవికీ ప్రక్షాళన జరగడం కూడా తప్పనిసరి. తెవికీని చక్కదిద్దడానికి అర్జునరావు మరియు వెంకటరమణ గార్లు ముందుండి నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:25, 29 జూలై 2020 (UTC)
::::: చంద్రకాంతరావు గారు తెవికీకి చేసిన సేవలు నిస్సందేహంగా ప్రశంసనీయమైనవే. కానీ తెవికీ ఘోరదశలో ఉందనడం నేను అంగీకరించను. ఇది కేవలం ఆయన పేర్కొన్న సభ్యులు తప్ప మిగతా వారిని అవమానించడమే. ఆయనకు ఇది కొత్తకాదు. మొదటి నుంచి సూటిగా మాట్లాడటమనే పేరుతో సభ్యులను నొప్పించడమే అలవాటు. చర్చలు సామరస్య పూర్వక ధోరణిలో జరగడం లేదు. అదీ కాక ఆయన ఎప్పుడూ తప్పులు వేలెత్తి చూపడమే తప్ప జరిగిన మంచిపనులు గురించి ఏదీ ప్రస్తావించింది లేదు. దీని వల్ల తెవికీకి మేలు జరగక పోగా కీడు జరుగుతుంది. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:57, 30 జూలై 2020 (UTC)
 
== తెలుగు భాషాశాస్త్రవేత్తల వేదిక వారి అంతర్జాల శిక్షణా శిబిర ప్రతిపాదన ==
 
నమస్కారం,
 
తెలుగు భాషాశాస్త్రజ్ఞుల వేదిక వారు కొరోనా లాక్‌డౌన్ సమయంలో అంతర్జాలం-జూమ్ వేదికగా పలు శిక్షణా శిబిరాలు, చర్చా కార్యక్రమాలు చేపట్టారు, అందులో భాగంగా వికీ శిక్షణా శిబిరం నిర్వహించమని నన్ను సంప్రదించారు.
నేను వారికి ప్రతిపాదించాలనుకుంటున్న ప్రణాళిక :
# మొదటి మూడు రోజులు తెలుగు వికీపీడియా ప్రవేశ స్థాయి శిక్షణ
# తరువాతి రెండు రోజులూ వికీసోర్స్ పై అవగాహన
# ఆరవ రోజు నకలు హక్కులపై, క్రియేటివ్ కామన్స్, మొదలగు లైసెన్సులపై అవగాహన
# ఏడవ రోజు వికీకామన్స్ పై శిక్షణ, ఇప్పటికే చేరిన వివిధ ఫోటోలు, వీడియోల పేర్లు, వివరణలు తెలుగులో చేర్చే విషయమై చర్చ.
# ఎనిమిది-తొమ్మిది-పదవ రోజుల్లో వికీడేటా, లెగ్జీంలకు సంబంధించిన అవగాహన, కార్యశాల.
 
ఇంకా తేదీలు ఖరారు కాలేదు కానీ, ఆగస్టు-సెప్టెంబర్ నెలలలో ఈ శిక్షణ జరగవచ్చు. సభ్యులు సూచనలు అందించి, కుదిరితే శిక్షణా శిబిరంలో శిక్షకులుగా పాల్గొనవలసినదిగా మనవి. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 08:07, 30 జూలై 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు