కోఫీ అన్నన్: కూర్పుల మధ్య తేడాలు

కుటుంబం
పంక్తి 1:
[[బొమ్మ:Kofi Annan.jpg|thumb|right|300px200px|కోఫీ అన్నన్]]
[[1938]], [[ఏప్రిల్ 8]] న [[ఘనా]] లోని కుమాసిలో జన్మించిన '''కోఫి అన్నన్''' (Kofi Atta Annan) [[ఐక్యరాజ్య సమితి]] యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి. ఇతను ఐక్య రాజ్య సమితికి 7 వ ప్రధాన కార్యదర్శి. [[ఆఫ్రికా]] ఖండం నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. రెండు సార్లు ఎనికై [[1997]], [[జనవరి 1]] నుంచి పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగినాడు. [[2001]]లో ఇతడికి నోబెల్ శాంతి బహమతి లభించింది.
 
ఘనా లోని కుమాసిలో జన్మించిన ఇతడు ఉన్నత విద్య [[అమెరికా]]లో అభ్యసించాడు. [[1961]]లో డిగ్రీ , [[1972]]లో మేనేజిమెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. [[1962]]లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించాడు. [[1987]]-[[1992|92]] కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. [[1997]]లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా [[బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ]] నుంచి బాధ్యతలు చేపట్టినాడు. 5 సంవత్సరాల పదవీ కాలం అనంతరం రెండో పర్యాయం మళ్ళీ ఎన్నికై [[2002]] నుంచి మరో ఐదేళ్ళు పనిచేసి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి[[బాన్ కి మూన్]] కు అధికారం అప్పగించాడు.
==కుటుంబం==
అన్నన్ కవల పిల్లల్లో ఒకడు. ఇది ఘనా దేశపు సంస్కృతిలో చాలా విశేషంగా చెప్పుకుంటారు. ఆయన కవల సహోదరియైన ఎఫువా అట్టా 1991 లో మరణించింది. అట్టా అంటే ఘనా భాషలో కవలలు అని అర్థం. ఘనా సంస్కృతి ప్రకారం మొదటి పేరైన కోఫీ వారు పుట్టిన రోజును సూచిస్తుంది. కోఫీ అనే మెదటిపేరు కలవారంతా శుక్రవారం పుట్టినట్లు లెక్క. ఆయన పేరును చాలామంది '''అన్నన్''' అని వ్యవహరిస్తారు కానీ ఆయన మాత్రం '''యానన్''' అని పలుకుతారు.
==బిరుదులు==
* [[2001]]లో ఐక్యరాజ్యసమితితో కల్సి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది.
"https://te.wikipedia.org/wiki/కోఫీ_అన్నన్" నుండి వెలికితీశారు