పుష్పవల్లి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 5:
 
==విశేషాలు==
ఈమె [[తాడేపల్లిగూడెం]] దగ్గరలో ఉన్న [[పెంటపాడు]] గ్రామంలో [[1926]], [[జనవరి 3]]వ తేదీన కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఐదవ తరగతి వరకు చదివింది. ఈమె అసలు పేరు వెంకట పుష్పవల్లి తాయారు. ఈమెకు పిన్నవయసు నుండే సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఈమె తన పన్నెండవ యేట కుటుంబ సన్నిహితుడు అచ్యుతరామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటి సారి సంపూర్ణరామాయణం [[సినిమా]]లో [[సీత]] వేషం వేసింది. తరువాత [[దశావతారములు (1962 సినిమా)|దశావతారములు]] సినిమాలో [[మోహిని]], మాయ శశిరేఖ పాత్రలు ధరించింది<ref name="జమీన్ రైతు">{{cite journal |last1=మల్హర్ |title=75 రూపాయల నటి నుండి తారాపథాన్నందుకున్న శ్రీమతి పుష్పవల్లి |journal=జమీన్ రైతు |date=24 June 1955 |volume=27 |issue=25 |page=7 |url=http://www.zaminryot.com/pdf/1955/Jun/28-JUN-1955.pdf |accessdate=25 July 2020 |archive-url=https://web.archive.org/web/20160913094010/http://zaminryot.com/pdf/1955/Jun/28-JUN-1955.pdf |archive-date=13 సెప్టెంబర్ 2016 |url-status=dead }}</ref>. ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాలలో నటించే అవకాశం లభించింది. జెమిని సంస్థలో పర్మనెంటు ఆర్టిస్టుగా నెలకు 200 రూపాయల జీతంతో చేరి 18 ఏళ్ళపాటు ఆ సంస్థ నిర్మించిన [[తమిళ భాష|తమిళ]], [[తెలుగు]], [[హిందీ భాష|హిందీ]] సినిమాలలో విరివిగా నటించింది. ఈమె చెల్లెలు [[సూర్యప్రభ (నటి)|సూర్యప్రభ]] కూడా సినిమా నటిగా రాణించింది. ఆమె [[వేదాంతం రాఘవయ్య]]ను వివాహం చేసుకుంది. పుష్పవల్లి [[జెమినీ గణేశన్]]ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పటికే జెమినీ గణేశన్‌కు పెళ్ళి అయింది. ఈమె కూడా ఈ పెళ్ళికి ముందు రంగాచారిని [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. అయితే ఆ పెళ్ళి మూడునాళ్ల ముచ్చట అయ్యింది. జెమినీ గణేశన్‌కు ఈమెకు బాబ్జీ, భానురేఖ, రమ, రాధ, ధనలక్ష్మి అనే సంతానం కలిగారు. వీరిలో భానురేఖ [[రేఖ]] పేరుతో హిందీ సినిమా రంగంలో ఒక తారగా వెలుగునొందింది.
పుష్పవల్లి జెమినీ గణేశన్‌ల వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. ఈమె [[1992]] [[మే 11]]న మరణించింది.
 
"https://te.wikipedia.org/wiki/పుష్పవల్లి" నుండి వెలికితీశారు