అంతం కాదిది ఆరంభం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
}}
అంతం కాదిది ఆరంభం 1981లో విడుదలైన తెలుగు సినిమా. [[ఎస్.రామానంద్]] నిర్మాణ సారథ్యంలో నిర్మించబడిన ఈ చిత్రానికి [[విజయనిర్మల]] దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[విజయనిర్మల|విజయ నిర్మల]] తదితరులు నటించారు.
 
== కథంశం ==
"ముందుస్థాన్" నే దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి "మామూళ్ళయ్య" (నాగభూషణం). అతని వత్తాసు రామదాసు (కాంతారావు) అనే ఓ పోలీసు కమీషనర్. నూకాలరావు (గిరిబాబు) హోం సెక్రటరీ. వీళ్ళ హత్యతో దేశానికి పట్టిన పీడను వదిలించడంతోనే "అంతం కాదు", ఇది "ఆరంభం" అంటూ ఒక విప్లవాత్మక కార్య, రూపక ప్రవృత్తిని విజయకృష్ణా మూవీస్ వారు, చిత్ర దర్శకురాలు విజయనిర్మల ప్రేక్షకుల ముందుంచారు .
 
దీని మాతృక "అంత" (కన్నడ) రాసినది హెచ్.కె. అనంతరావు. దీన్ని కన్నడంలో "అంతం" అన్నా తెలుగులోకి వచ్చేసరికి "అంతం కాదిది ఆరంభం" అనేది ఆలోచనా పూర్వకమైన మంచి శీర్షిక.
 
ప్రజలు నాయకులను ఎన్నుకుంటారు. వారు అధికారంలోకి వచ్చాక తమను ఎన్నుకున్న ప్రజలనే కబళిస్తారు. న్యాయం కోసం, ధర్మం కోసం నడుం కట్టిన పోలీసు అధికారులు సాక్ష్యాధారాలతో సహా కనబడ్డ దొంగలను పట్టుకొచ్చి జైల్లో పెడతారు. కానీ ఆ దొంగ వెనుక ఉన్న అధికారం లో ఉన్న పెద్ద దొంగలు ఒక చిన్న టెలిఫోన్ ఉత్తరువు వదిలి పెడతారు. ఈ చిన్న రాబందుల ఉనికి, వీ వెనుక వత్తాసు ఇచ్చేపెద్ద రాబందుల ఉనికి తెలుసుకున్న ఓ దేశభక్తుడు ఏం చేయాలి. ఈ ప్రశ్నకి సమాధానంగా "ధర్మ సంరక్షణ" తన కర్తవ్యం అనుకున్న పోలీసు ఇనస్పెక్టరు విజయ్ ముఖ్యమంత్రిని, హోం సెక్రటరీ, పోలీసు కమీషనరు.. వారి వెనక ఉన్న నల్ల బజారు వర్తకులు, స్మగ్లర్లు, గూండాలు వాళ్ళందరినీ తనస్వహస్తాలతో ఒకరి తరువాత ఒకరిని హతమర్చి తనకి దొరికిన సాక్ష్యాధారాలతొ కోర్టులోకి వెళ్ళి లొంగిపోతాడు. ఒక ప్రక్క జడ్జీ ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటాడు. మరో ప్రక్క ధర్మానికీ, న్యాయానికీ గుర్తుగా నిలిచే త్రాసు కూడాఅ ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అన్నట్లు కనిపిస్తుంది. దీన్ని ఒక సమస్యగానే చిత్ర దర్శకురాలు "అంతం" చేసింది. అంటే న్యాయ నిర్ణయాన్ని ప్రేక్షకులకు విడిచిపెట్టింది.
 
ఈ చిత్రం ప్రారంభం నుంచీ అంతం దాకా కనబడేది విజయ్. కాసేపు విజయ్ గా, కాసేపు కన్వర్ లాల్ గా రెండు విభిన్న పాత్రలలో కృష్ణ రాణించాడు. వైవిధ్యం చూపించగలిగాడు.
 
జగ్గయ్య ప్రభుత్వోద్యోగపు ఇరకాటంలో పడ్డ దేశ భక్తుడిగా బాగానే నటించాడు. సత్యనారాయణ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు.
 
ఈ చిత్రంలో రమేష్ నాయుడు బాణీలు వినసొంపుగా ఉంటాయి. <ref>{{Cite web|url=https://indiancine.ma/|title=Indiancine.ma|website=Indiancine.ma|access-date=2020-08-01}}</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అంతం_కాదిది_ఆరంభం" నుండి వెలికితీశారు