సత్యయుగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సత్య యుగం (సంస్కృత: सत्ययुग),''' హిందూధర్మ సమయం ప్రకారం నాలుగు యుగాలలో ఇది మొదటిది.దీనిని కృతయుగం అని కూడా అంటారు. "సత్య యుగం (యుగము లేదా యుగం)", మానవత్వం దేవతలచే మానవత్వంతో పరిపాలించబడినప్పుడు, ప్రతి వ్యక్తి ఆచరించే పని స్వచ్ఛమైన ఆదర్శానికి దగ్గరగా ఉంటుంది. మానవత్వం, అంతర్గత మంచితనం కలిగి పాలించటానికి సర్వశ్రేష్టమైన పరమాత్మ అనుమతిస్తుంది. దీనిని కొన్నిసార్లు "స్వర్ణయుగం" అని పిలుస్తారు.సత్య యుగం 1,728,000 సంవత్సరాలు లేదా 4800 దైవిక సంవత్సరాలు ఉంటుంది.నైతికతకు ప్రతీకగా ధర్మ దేవుడు (ఎద్దు రూపంలో చిత్రీకరించబడింది) సత్యయుగంలో నాలుగు కాళ్లపై నిలబడ్డాడు.తరువాత త్రేతా యుగంలో ఇది మూడు కాళ్లపై, తరువాత ద్వాపరా యుగంలో రెండు కాళ్లపై నిలబడ్డది. ప్రస్తుతం జరుగుచున్నఅనైతిక యుగంలో (కలియుగం) ఇది ఒక కాలు మీద నిలుచుని పరిపాలిస్తుంది.
 
== వివరణ ==
ప్రతి మతానికి దాని నియమాలు, భావాలు ఉన్నాయి. సమయం, విశ్వోద్భవ శాస్త్రం వివేక సిద్ధాంతాలు హిందూ మతాన్ని ప్రత్యేకమైనవిగా చేసాయి.సమయం సృష్టి, విధ్వంసం, చక్రంగా పరిగణించబడ్డాయి. హిందూ ధర్మ సమయం ప్రకారం అంతులేని నాలుగు యుగాలుగా విభజించబడింది. ఇవి ఒకదాని తరువాత ఒకటిగా అనుసరిస్తాయి.వేదాల ప్రకారం సమయం గతించిపోయే చక్రంలాగా నాలుగు యుగాలుగా విభజించబడింది.అందులో మొదటిది సత్య యుగం -- 4 * 432000 సంవత్సరాలు, [[త్రేతాయుగం|త్రేతా యుగం]] -- 3 * 432000 సంవత్సరాలు, [[ద్వాపరయుగం|ద్వాపర యుగం]] - 2 * 432000 సంవత్సరాలు, [[కలియుగం]] -- 432000 సంవత్సరాలుగా వేదాలు ప్రకారం నిర్వచించబడింది.సత్యయుగం నుండి యుగాలు గతించేకొద్దీ యుగాలు ధర్మం, జ్ఞానం,మేధో సామర్థ్యం, భావోద్వేగం, శారీరక బలం క్రమంగా క్షీణించడం జరుగుతుంది.<ref>{{Cite web|url=https://www.apnisanskriti.com/interesting-facts-about-satya-yug-7652|title=Interesting facts about Satya Yug|website=ApniSanskriti - Back to veda|language=en-US|access-date=2020-08-04}}</ref>
 
== సత్య యుగం పరిపాలన ==
అందు సత్య యుగం మొదటిది. సత్యయుగానికే [[కృతయుగము|కృతయుగమని]] పేరు. ఇందు భగవంతుడు [[నారాయణుడు]], [[లక్ష్మి|లక్ష్మీ]] సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు.
 
వైవశ్వత మన్వంతరములో సత్యయుగము [[కార్తీక శుద్ధ నవమి]] రోజు ప్రారంభమయినది.
"https://te.wikipedia.org/wiki/సత్యయుగం" నుండి వెలికితీశారు