చర్చ:విశాఖపట్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
::* "కష్టపడి మూలం చేర్చాను ఉంచండి బాబూ" అని అడగాల్సిన దుస్థితి నాకు లేదు. అవినయంగా తోచినా ఫర్వాలేదు- నేను అభివృద్ధి పరచిన [[చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి]], [[ఘట్టమనేని కృష్ణ]], [[జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947]] - వంటి వివిధ అంశాలకు చెందిన వ్యాసాలు చూడండి. అప్పుడు వచ్చి మాట్లాడండి. అవన్నీ పక్కన పెట్టి ఈ వ్యాసం వరకూ చూసినా - మీరు వెళ్ళి ప్రామాణిక భాషావేత్తలతో మాట్లాడి చూడండి, "ఉత్తర పదానికి గ్రామ నామంలో విలువ ఉండదు" అన్నామూ, దానికి ఇచ్చిన మూలాన్ని తిరస్కరించబోయామూ కరెక్టేనా అని. ఆపైన వచ్చి నాకు చెప్పండి. మరోమాటు చెప్తున్నాను, నేను చేసిన ఏ కృషికీ "అయ్యో పాపం" అని ఉంచాల్సిన స్థితి కానీ, "భవిష్యత్తులో ఎవడో వచ్చి విస్తరిస్తాడు లే, పాపం ఉంచండి" అనుకోవాల్సిన స్థితి కానీ లేదు. ఒకవేళ ఉంటే - నేనే తొలగించమంటాను. అయ్యా ఉంచండి అని అర్థించాల్సిన అవసరం లేదు నాకు. మరొక్కసారి చెప్తున్నాను - ఏ గ్రామనామ అధ్యయనకారుడిని కానీ, ఏ భాషావేత్తని కానీ పిలిచి అడిగి చూడండి. మీరెలాగూ పుస్తకం చదవనే చదవరని అర్థమైపోయింది.
::'''క్లుప్తంగా చెప్పవచ్చేదేమంటే''' మీరు చెప్పిన నీతులన్నిటినీ ఇంతవరకూ మీరే ఉల్లంఘన చేశారు అర్జున రావుగారూ. ఉద్దేశపూర్వకంగా ఒకరికొకరు తోడై మేం చేసే ప్రతీ కృషినీ చిన్నబుచ్చాలని చూస్తున్నారు. మనకు ఏమైనా గట్టు తగువు గత జన్మలో ఉందో ఏమో నాకు తెలియట్లేదు. లేవనెత్తుతున్నారు. '''వీటన్నిటి తర్వాతా కూడా నాలో వికీ పట్ల ఉన్న నిబద్ధతని, అధ్యయనం చేసి రాయగల నా జీవశక్తినీ ఏమీ చేయలేరు.''' నేను రాసుకుంటూ వెళ్తాను. మీరూ, చంద్రకాంతుల వారూ లేని తప్పులెన్నే ప్రయత్నం, మేము (ఈ బహువచనంలోకి ఎవరం వస్తామో, మీ ఇద్దరికీ తెలుసు) ఎక్కడ ఎవరి పొరబాటు సరిజేయబోయినా వారిని ఉత్తి పుణ్యానికి సమర్థించే ప్రయత్నం చేస్తూ పోండి. వికీలో ప్రతీదీ రికార్డవుతుంది. భావి తరాలు మనందరి గురించి వారి వారి అంచనా వేయక మానరు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 09:12, 4 ఆగస్టు 2020 (UTC)

:::: అయ్యా పవన్ గారూ, చర్చను హుందాతనంతో చేయడానికి మీకు రాదా? లేదా మనసొప్పదా? తెవికీ అంటే పిల్లలాటగా ఎందుకు చేస్తున్నారు? ఇదేచర్చలో హుందాతనం గురించి పైన చదవలేరా? ఇలాగైతేనే ఎవరూ చర్చ చేయరనీ మీరనుకున్నది చేయవచ్చనే అభిప్రాయమా? చర్చను నీతులని ఎందుకు భావిస్తున్నారు? నన్ను గ్రూపిజంలో ఎందుకు పరిగణిస్తున్నారు? '''అహ, తుండు దులుపుకుని, తొలగించడెశె, గుడ్లప్పగించి, చీమ కుట్టినట్టయినా లేదు, తమలపాకుతో కూడా తట్టినట్టు లేరు, ఆయ్, ఆవటా, గల్లా పట్టుకుని''' ... ఇవన్నీ ఒక్క చర్చలోనే ... ఇవేమి మాటలు?? ప్రతీదీ రికార్డవుతుందనీ ఒక వైపు చెబుతూనే మరో వైపు ఎందుకీ వెక్కిరింపులు? చర్చ సీదాగా సభ్యతతో చేయడానికి రాదంటే దాన్ని నేర్చుకొని చర్చలు చేయండి, అంతవరకు చర్చలకు దూరంగా ఉండండి, అంతేకాని చర్చలలో మీ ఇష్టమైన విధంగా ఎదుటి వ్యక్తులను వాగ్బాణాలతో సంధించడం మాత్రం సరైన పద్దతికాదు. నేను వెనక్కి పోవడం లేదు. ఇప్పటి సంగతే చెబుతున్నాను. ఈ మధ్య చర్చలలో మీ ప్రవర్తన ఏ మాత్రం స్థాయికి తగ్గట్టుగా లేదు. నిర్వాహకులై ఉండి కూడా ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు తీసుకురావడం లేదు. చర్చలో నా పేరు కూడా తీసుకువచ్చారు కాబట్టి నేను సమాధానం ఇస్తున్నాను.
1) వాసి (ప్రసిద్ధి) వ్యాసంలో మార్పులకు నాకు బలవంతం ఎందుకు చేస్తున్నారు? చర్చ చర్చే, చర్య చర్యే. చర్చించిన వాళ్ళే చర్యలు తీసుకోవాలని ఎందుకు మీ బలవంతం. కొన్ని పాలసీలు చేసి ఏళ్ళు గడుస్తున్నా ఆ పాలసీలను ప్రతిపాదించిన వారు పాలసీలకనుగుణంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? అలాంటివి మీరు అడగరు!! చెప్పాలంటే నాకూ చాలా ఉన్నాయి ఇక్కడ జరిగే పొరపాట్లు!! మీరంతా ఏకపక్షంగా ఆలోచిస్తున్నారు!
2) నా సకల జనుల సమ్మె గురించి చెప్పినా అర్థంచేసుకోక మళ్ళీ మళ్ళీ చర్చలలో ఎందుకు ప్రస్తావిస్తున్నారు? మీలా నేను తొలగింపుకు వ్యతిరేకంగా ఏ మాత్రం పట్టుపడలేను. ఎందుకు చేర్చాను, అసలు దాని ఉద్దేశ్యమేమిటి తెల్సుకోకుండా మాట్లాడటం సరైనది కాదు. అకస్మాత్తుగా సెలవులో ఉండిపోవుటచే చాలాకాలం తర్వాత ఆ సమాచారం అలాగే ఉండి సభ్యుల దృష్టికి వచ్చినప్పుడు నేనేమాత్రం అభ్యంతరపర్చకున్ననూ మళ్ళీమళ్ళీ చర్చలలో లేవనెత్తడం మీ హుందాలేనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏ మాత్రం తెవికీ పరిజ్ఞానం ఉన్న సభ్యుడైనా తొలగింపుకు పట్టుబడని సభ్యుడితో వాదించే అవసరం ఉండరాదు.
3) '''ప్రస్తుత తెవికీలో సాంకేతిక అంశాలపై అర్జున గారికి...''' అనడం నేనవర్ని ప్రస్తుతించడం కాదు తూలనాడడం అసలే కాదు. వెనక్కి పోవాల్సిన అవసరం లేదు కాని ఇటీవలి సభ్యుల దిద్దుబాట్లు చూస్తే ఏ సభ్యుడైనా/నిర్వాకుడైనా ఏ సాంకేతిక సమస్య వచ్చినా [[వాడుకరి:Arjunaraoc|అర్జున]]గారికే ఎందుకు అడుగుతున్నారో ఆలోచించండి. సాంకేతిక విషయాలలో అర్జునగారితో సమానంగా కాదుకదా ఆయన దరిదాపుల్లో ప్రస్తుత తెవికీలో ఎవరైనా ఉంటే ఆ పేరైనా చెప్పండి మరి. వాస్తవం చెబితే సహించక ప్రస్తుతించడం, తూలనాడడం మాటలు వాడితే ఎలా?
4) ఎక్కడో దొరికిన ఒక పట్నం మూలాన్ని ఇక్కడ చేర్చడాన్ని అర్జునగారు తప్పుపడితే దాన్ని అప్పుడే తొలగించమని చెప్పడం కాకుండా చర్చను అర్థం చేసుకోకుండా చర్చను రచ్చరచ్చ చేసి, చర్చలను వక్రీకరించి, మళ్ళీ ఎదుటివారిపై వాగ్బాణాలు విసరడం ఘోరమైన చర్యగానే భావించవలసి ఉంటుంది. ఉత్తర పదానికి గ్రామ నామంలో విలువ ఉండదని ఇక్కడ ఎవరూ చెప్పలేరు కాని చర్చను పూర్తిగా అర్థం చేసుకోకపోతే అలాగే అర్థమౌతుంది. '''అందుకే చెప్పాను చర్చలను అర్థం చేసుకొనే స్థోమత వెంకటరమణ గారికి తప్ప ఎవరికీ లేదని''', అది మరోసారి రుజువైంది.
5) చివరగా "లేని తప్పులెన్నే ప్రయత్నం" అని మళ్ళీ నా పేరు ఉటంకించారు. లేని తప్పులు కాదు నేను చెప్పేది ఉన్న తప్పులే. తప్పులు చెబితే సవరించుకోండి అంతే కాని ఎదురుదాడికి దిగడం కాదు.
6) అవర్ తెలుగునాడు డాట్ కామ్‌ చర్చలో "రామారావు గారు ఇన్నిటిని వింగడించి, వెతికి, అర్థం చేసుకుని, రాసి, తెచ్చి తన వెబ్‌సైట్‌లో స్వంత డబ్బు పెట్టి పెట్టుకుని, ఇంతా చేయగలిగినప్పుడు ... లింకులు తీసేయడం సరికాదు, వద్దు" అన్నారు. అక్కడ మీకు పొరపాటు కనిపించలేదా? సదరు సభ్యుడే ప్రారంభంలో తెలియక చేసిన తప్పును ఇప్పుడు తొలగించమని చెబితే మీరు అడ్డుపడడమేమిటి? ఒక సభ్యుడు స్వయంగా తన వెబ్‌సైటు లింకులు వందలాది వ్యాసాలలో చేర్చడాన్ని మీరెలా సమర్థిస్తారు? అది కాపీ సమాచారమే కాని స్వయంగా రూపొందించినది కూడా కాదు. ఇక్కడ నియమాలు చూసే అక్కర్లేదా? నేను ఎవరు పొరపాటు చేసినా చెబుతాను, సరైన పనికే సమర్థిస్తాను కాని మీలా పొరపాట్లను సమర్థంచే అవసరం మాత్రం నాకు లేదు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao| సి. చంద్ర కాంత రావు]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|- చర్చ ]] 20:35, 4 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:విశాఖపట్నం" నుండి వెలికితీశారు
Return to "విశాఖపట్నం" page.