భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం [[పోలవరం]] ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను. ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా [[ఖమ్మం జిల్లా]] పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గుంపహాడ్ మండలంలోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ - జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను 2014 మే 29న గెజిట్-లో ప్రచురించారు.<ref>{{Cite web|url=https://www.prsindia.org/uploads/media/Ordinances/Andhra%20Pradesh%20Reorganisation%20Amendment%20Ordinance%202014.pdf|title=THE ANDHRA PRADESH REORGANISATION (AMENDMENT) ORDINANCE, 2014 (NO. 4 OF 2014)}}</ref>
 
[[గోల్కొండ]] నవాబు [[అబుల్ హసన్ కుతుబ్ షా|అబుల్ హసన్ తానీషా]] పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా [[రామదాసు|కంచెర్ల గోపన్న]] ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను (6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా,1645 - 1680 మధ్య కాలంలో భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.
 
ఆ సొమ్ము విషయమై [[తానీషా]] గోపన్నను [[గోల్కొండ కోట]]లో బంధించగా, ఆ [[కారాగారము|చెరసాల]] నుండి తనను [[విముక్తి కోసం|విముక్తి]] చెయ్యమని రాముణ్ణి ప్రార్థించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై [[పాటలు]] రచించి తానే పాడాడు. ఇవే [[రామదాసు కీర్తనలు]]గా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు [[రామదాసు]] అనే పేరు వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు