చర్చ:విశాఖపట్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
:::: అయ్యా పవన్ గారూ, చర్చను హుందాతనంతో చేయడానికి మీకు రాదా? లేదా మనసొప్పదా? తెవికీ అంటే పిల్లలాటగా ఎందుకు చేస్తున్నారు? ఇదేచర్చలో హుందాతనం గురించి పైన చదవలేరా? ఇలాగైతేనే ఎవరూ చర్చ చేయరనీ మీరనుకున్నది చేయవచ్చనే అభిప్రాయమా? చర్చను నీతులని ఎందుకు భావిస్తున్నారు? నన్ను గ్రూపిజంలో ఎందుకు పరిగణిస్తున్నారు? '''అహ, తుండు దులుపుకుని, తొలగించడెశె, గుడ్లప్పగించి, చీమ కుట్టినట్టయినా లేదు, తమలపాకుతో కూడా తట్టినట్టు లేరు, ఆయ్, ఆవటా, గల్లా పట్టుకుని''' ... ఇవన్నీ ఒక్క చర్చలోనే ... ఇవేమి మాటలు?? ప్రతీదీ రికార్డవుతుందనీ ఒక వైపు చెబుతూనే మరో వైపు ఎందుకీ వెక్కిరింపులు? చర్చ సీదాగా సభ్యతతో చేయడానికి రాదంటే దాన్ని నేర్చుకొని చర్చలు చేయండి, అంతవరకు చర్చలకు దూరంగా ఉండండి, అంతేకాని చర్చలలో మీ ఇష్టమైన విధంగా ఎదుటి వ్యక్తులను వాగ్బాణాలతో సంధించడం మాత్రం సరైన పద్దతికాదు. నేను వెనక్కి పోవడం లేదు. ఇప్పటి సంగతే చెబుతున్నాను. ఈ మధ్య చర్చలలో మీ ప్రవర్తన ఏ మాత్రం స్థాయికి తగ్గట్టుగా లేదు. నిర్వాహకులై ఉండి కూడా ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు తీసుకురావడం లేదు. చర్చలో నా పేరు కూడా తీసుకువచ్చారు కాబట్టి నేను సమాధానం ఇస్తున్నాను.
1) వాసి (ప్రసిద్ధి) వ్యాసంలో మార్పులకు నాకు బలవంతం ఎందుకు చేస్తున్నారు? చర్చ చర్చే, చర్య చర్యే. చర్చించిన వాళ్ళే చర్యలు తీసుకోవాలని ఎందుకు మీ బలవంతం. కొన్ని పాలసీలు చేసి ఏళ్ళు గడుస్తున్నా ఆ పాలసీలను ప్రతిపాదించిన వారు పాలసీలకనుగుణంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? అలాంటివి మీరు అడగరు!! చెప్పాలంటే నాకూ చాలా ఉన్నాయి ఇక్కడ జరిగే పొరపాట్లు!! మీరంతా ఏకపక్షంగా ఆలోచిస్తున్నారు!
2) నా సకల జనుల సమ్మె గురించి చెప్పినా అర్థంచేసుకోక మళ్ళీ మళ్ళీ చర్చలలో ఎందుకు ప్రస్తావిస్తున్నారు? మీలా నేను తొలగింపుకు వ్యతిరేకంగా ఏ మాత్రం పట్టుపడలేను. ఎందుకు చేర్చాను, అసలు దాని ఉద్దేశ్యమేమిటి తెల్సుకోకుండా మాట్లాడటం సరైనది కాదు. అకస్మాత్తుగా సెలవులో ఉండిపోవుటచే చాలాకాలం తర్వాత ఆ సమాచారం అలాగే ఉండి సభ్యుల దృష్టికి వచ్చినప్పుడు నేనేమాత్రం అభ్యంతరపర్చకున్ననూ మళ్ళీమళ్ళీ చర్చలలో లేవనెత్తడం మీ హుందాలేనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏ మాత్రం తెవికీ పరిజ్ఞానం ఉన్న సభ్యుడైనా తొలగింపుకు పట్టుబడని సభ్యుడితో వాదించే అవసరం ఉండరాదు.
3) '''ప్రస్తుత తెవికీలో సాంకేతిక అంశాలపై అర్జున గారికి...''' అనడం నేనవర్ని ప్రస్తుతించడం కాదు తూలనాడడం అసలే కాదు. వెనక్కి పోవాల్సిన అవసరం లేదు కాని ఇటీవలి సభ్యుల దిద్దుబాట్లు చూస్తే ఏ సభ్యుడైనా/నిర్వాకుడైనా ఏ సాంకేతిక సమస్య వచ్చినా [[వాడుకరి:Arjunaraoc|అర్జున]]గారికే ఎందుకు అడుగుతున్నారో ఆలోచించండి. సాంకేతిక విషయాలలో అర్జునగారితో సమానంగా కాదుకదా ఆయన దరిదాపుల్లో ప్రస్తుత తెవికీలో ఎవరైనా ఉంటే ఆ పేరైనా చెప్పండి మరి. వాస్తవం చెబితే సహించక ప్రస్తుతించడం, తూలనాడడం మాటలు వాడితే ఎలా?
4) ఎక్కడో దొరికిన ఒక పట్నం మూలాన్ని ఇక్కడ చేర్చడాన్ని అర్జునగారు తప్పుపడితే దాన్ని అప్పుడే తొలగించమని చెప్పడం కాకుండా చర్చను అర్థం చేసుకోకుండా చర్చను రచ్చరచ్చ చేసి, చర్చలను వక్రీకరించి, మళ్ళీ ఎదుటివారిపై వాగ్బాణాలు విసరడం ఘోరమైన చర్యగానే భావించవలసి ఉంటుంది. ఉత్తర పదానికి గ్రామ నామంలో విలువ ఉండదని ఇక్కడ ఎవరూ చెప్పలేరు కాని చర్చను పూర్తిగా అర్థం చేసుకోకపోతే అలాగే అర్థమౌతుంది. '''అందుకే చెప్పాను చర్చలను అర్థం చేసుకొనే స్థోమత వెంకటరమణ గారికి తప్ప ఎవరికీ లేదని''', అది మరోసారి రుజువైంది.
5) చివరగా "లేని తప్పులెన్నే ప్రయత్నం" అని మళ్ళీ నా పేరు ఉటంకించారు. లేని తప్పులు కాదు నేను చెప్పేది ఉన్న తప్పులే. తప్పులు చెబితే సవరించుకోండి అంతే కాని ఎదురుదాడికి దిగడం కాదు.
6) అవర్ తెలుగునాడు డాట్ కామ్‌ చర్చలో "రామారావు గారు ఇన్నిటిని వింగడించి, వెతికి, అర్థం చేసుకుని, రాసి, తెచ్చి తన వెబ్‌సైట్‌లో స్వంత డబ్బు పెట్టి పెట్టుకుని, ఇంతా చేయగలిగినప్పుడు ... లింకులు తీసేయడం సరికాదు, వద్దు" అన్నారు. అక్కడ మీకు పొరపాటు కనిపించలేదా? సదరు సభ్యుడే ప్రారంభంలో తెలియక చేసిన తప్పును ఇప్పుడు తొలగించమని చెబితే మీరు అడ్డుపడడమేమిటి? ఒక సభ్యుడు స్వయంగా తన వెబ్‌సైటు లింకులు వందలాది వ్యాసాలలో చేర్చడాన్ని మీరెలా సమర్థిస్తారు? అది కాపీ సమాచారమే కాని స్వయంగా రూపొందించినది కూడా కాదు. ఇక్కడ నియమాలు చూసే అక్కర్లేదా? నేను ఎవరు పొరపాటు చేసినా చెబుతాను, సరైన పనికే సమర్థిస్తాను కాని మీలా పొరపాట్లను సమర్థంచే అవసరం మాత్రం నాకు లేదు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao| సి. చంద్ర కాంత రావు]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|- చర్చ ]] 20:35, 4 ఆగస్టు 2020 (UTC)
:: //ఎందుకు చేర్చాను, అసలు దాని ఉద్దేశ్యమేమిటి తెల్సుకోకుండా మాట్లాడటం సరైనది కాదు.// సకల జనుల సమ్మె వివరాలు ఎందుకు చేర్చారు? దాని ఉద్దేశమేమిటి? అది తప్పా, ఒప్పా? సూటిగా, సవివరంగా చెప్పండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:56, 5 ఆగస్టు 2020 (UTC)

:::: తెలంగాణ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. అది తొలిదశ ఉద్యమమైనా లేదా మలిదశ ఉద్యమమైనా సరే. అలాగే తెలంగాణకు సంబంధించిన మండలాలకు కూడా తెలంగాణ ఉద్యమం చరిత్ర అవసరం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రముఖమైనది సకలజనుల సమ్మె. 42 రోజులపాటు ఊరుఊరునా, వాడవాడన ఉద్యమం హోరెత్తింది. పాఠశాల విద్యార్థులు నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఆ 42 రోజులపాటు సమ్మె పూర్తిగా సఫలమవడం ప్రతిమండలానికి గర్వకారణమైన చరిత్ర. కవులు, కళాకారులు, న్యాయవాదులు, ఉద్యమ సంస్థలు, రాజకీయ నాయకులు కూడా సమ్మెకు తోడైనారు. తెలంగాణ అంతటా అన్ని మండలాలలో 42 రోజులు సమ్మె జరిగింది కాని సమ్మె జరిగిన విధానంలో ఒక మండలానికి మరో మండలానికి తేడా ఉంది. ఏ మండలంలో ఎలా జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, ఏయే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి, ఏయే సంఘటనలు జరిగాయి తదితరాలన్నీ పూర్తిగా ప్రతీ మండలానికి ప్రత్యేకమే. అప్పట్లో అన్ని వార్తాపత్రికల జిల్లా ఎడిషన్ల పేజీలన్నీ సకలజనుల సమ్మెతో కూడిన వార్తలే. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాదు జిల్లాకు చెందిన జిల్లా ఎడిషన్ల పేపర్ క్లిప్పింపులు అప్పట్లో నా వద్ద ఉన్నాయి. మిగితా 6 జిల్లాల సమ్మె వివరాలు అంతర్జాలం ద్వారా సేకరించాను. వీటి ఆధారంగా ఆయా మండలాలలో సమ్మె వివరాలు చేర్చాలనీ, ఒక్కో మండలంలో జరిగిన సమ్మె ప్రత్యేకతలు, సంఘటనలు మండల వ్యాసాలలో చేర్చి మూలాలతో పరిపుర్ణం చేయాలనీ తలంచి ముందుగా AWB ద్వారా విభాగాన్ని మరియు 2 వాక్యాల సమాచారాన్ని చేర్చాను. ఒక్కో మండల వ్యాసంలో మానవీయంగా ఆయా మండలాలకు సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని చేర్చేటప్పుడు ఈ వాక్యాలను మండలాలకనుగుణంగా మార్చుతూ మండల పరిధిలోని గ్రామాలలో జరిగిన సమ్మె వివరాలు, సంఘటనలు, అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, పాల్గొన్న ప్రముఖులు తదితరాలు ఆయా మండలాలకు సంబంధించి జిల్లా ఎడిషన్ల మూలాలతో సహా సమాచారాన్ని పొడగించడం ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యం ప్రారంభంలోనే ఆగిపోవడం జరిగింది. ఒకవేళ అనుకున్నది జరిగితే ప్రతి మండల వ్యాసానికి ఆ విభాగం మకుటాయమానంగా నిలిచేది. అంతేకాదు తెవికీకి కూడా మంచిపేరు వచ్చేది, పాఠకులకు ప్రయోజనకరంగానూ ఉండేది. కాని ఆ తర్వాత తెవికీ సెలవులోకి వెళ్ళిపోవడం, సంవత్సరం తర్వాత వచ్చిననూ తెవికీ చురుకుదనం తగ్గిపోవడంతో అది అలాగే ఉండిపోయింది. ఇటీవల నా దృష్టికి వచ్చిన తర్వాత తొలగింపుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేను. ప్రారంభంలో చేర్చింది ఆ రెండు వాక్యాలను కూడా అలాగే ఉంచకుండా మండలాలకనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం ప్రణాళికలో భాగం. జరగని పని గురించి నేను బాధపడాలి కాని ప్రతి సందర్బంలో ఈ విషయాన్ని ఉటంకించడం బాగుండదు. తొలగించడాన్ని వ్యతిరేకిస్తే అది నా తప్పు కాని నేనెప్పుడు వ్యతిరేకించలేను. మీ సందేహానికి నేను పూర్తి వివరణ ఇచ్చాను. ఇకముందు నేను అడిగిన వాటికి కూడా మీరు ఇలాగే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao| సి. చంద్ర కాంత రావు]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|- చర్చ ]] 21:03, 5 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:విశాఖపట్నం" నుండి వెలికితీశారు
Return to "విశాఖపట్నం" page.