గోల్‌మాల్ గోవిందం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
== కథా నేపథ్యం ==
గోల్‌మాల్ గోవిందం (రాజేంద్ర ప్రసాద్) చిన్నచిన్న మోసాలు చేస్తూ బతుకుతుంటాడు. ఒక రోజు, అతను ఉచిత వసతి, భోజనం కోసం ఆసుపత్రిగా వెలుతాడు. అక్కడ కుమారి (శ్రీ భాను) అనే అమ్మాయి గుండెపోటుతో మరణిస్తుంది. గోవిందం ఆమె వస్తువులను తీసుకొని వాటినుండి కొంత డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఆ వస్తువులలో కుమారి డైరీని దొరుకుతుంది. తన జీవితాన్ని మార్చిన ముగ్గురు వ్యక్తుల గురించి కుమారి అందులో రాసింది. మొదటి వ్యక్తి ఆమె మాజీ బాస్ మన్మధరావు (గిరి బాబు), ఆమెను తనతో ఒకరోజు గడుపమన్నాడు. రెండవ వ్యక్తి రాజశేఖర్ (దిలీప్), తన తల్లిదండ్రులకు చూపించడానికి తన భార్యగా నటించాలని అందుకు బదులుగా ఆమెకు గుండె చికిత్స కోసం డబ్బులు ఇస్తానంటాడు. మూడవవ్యక్తి సుధాకర్ (సుధాకర్) రాజశేఖర్ స్నేహితుడు. తాగిన మైకంలో కుమారిని అనుభవించానని అనుకుంటాడు. నిజం ఏమిటంటే ఈ ముగ్గురిలో ఎవరికీ ఆమెతో శారీరక సంబంధం లేదు. ఈ ముగ్గురి నుండి డబ్బును తీపుకునేందుకు గోవిందం ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. కుమారి ఒక కొడుకుకు జన్మనిచ్చిందని, అతనికి గోపాల్ అని పేరు పెట్టారని గోవిందం వారికి ఉత్తరాలు రాస్తాడు. ఆ ముగ్గురూ ఒకే రోజు గోవిందంను కలవడానికి వస్తారు. దాంతో అనాథాశ్రమం నుండి గణపతి (మాస్టర్ ఆనంద్) అనే పిల్లవాడిని తీసుకువచ్చి గోల్‌మాల్ డ్రామా ఆడటం ప్రారంభిస్తాడు.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/గోల్‌మాల్_గోవిందం" నుండి వెలికితీశారు