సకలనీతిసమ్మతము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
ఇందులో మూడు ఆశ్వాసాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి. ఇది ఒక ప్రాచీన నీతి మంజరి. భవ్యకవితా పారిజాతం, ఇది 6 మంది అజ్ఞాత కవుల రచనల సంకలనం. “అల్లకల్లోలమైన పాల సముద్రాన్ని చిలికి దేవామృతాన్ని వెలికి తీసిన విధంగా, గంధకారుడు ముందు గల వస్తువులను అందంగా కూర్చి సుగంధం జత చేసినట్లు, అడివి పువ్వుల తేనె తుమ్మెద జున్ను పట్టు విధముగా; ముత్యాలను పరిమాణం వారీగా గుచ్చి హారం చేసినట్లుగా ఈ గ్రంథం చేసాను “ అని సింగన సంకలనానికి ముందుమాటలో రాసుకున్నాడు. అతను ఏఏ గ్రంథాల నుండి తీసుకున్నాడో వరుసగా- అ) అజ్ఞాతము, ఆ) కామందకము, ఇ) కుమార సంభవము ([[నన్నె చోడుడు]]), ఈ) కేయూరబాహు చరిత్ర ([[మంచెన]]), ఉ) చాటువు, ఊ) చారుచర్య ([[అప్పనమంత్రి]]), ఎ) ధృతరాష్ట్ర నీతి ([[తిక్కన]]), ఏ) ధౌమ్యనీతి ([[తిక్కన]]), ఐ) నీతి తారావళి ([[కందనామాత్యుడు]]) ఒ) నీతిభూషణం ([[ఆంధ్ర భోజుడు]]), ఓ) నీతిసారం ([[రుద్రదేవుడు]]), ఔ) పంచ తంత్రి, అం) పద్మ పురాణము (మడికి సింగన), అః) పురుశార్థ సారము ([[శివదేవయ్య]]), క) బద్దన నీతి ([[బద్దెన]]), ఖ) భీష్మ పర్వం ([[తిక్కన]]), గ) మదీయము (మడికి సింగన), ఘ) మార్కండేయము ([[మారన]]), జ్ఞ) మిత్రనీతులు, చ) ముద్రమాత్యము ([[క్షేమేంద్ర లక్కా భట్టు]]), ఛ) విదురనీతి ([[తిక్కన]]), జ) శాంతి పర్వము ([[తిక్కన]]), ఝ) శాలి హోత్రము, ఇ) శ్రీగిరి శతకము ([[శ్రీగిరి]]), ట) శ్రీ రామాయణము, ట) సభాపర్వం, ([[నన్నయ]]), డ) సౌప్తిక పర్వము ([[తిక్కన]]).
 
{{శ్రీనాథ యుగం}}
 
{{authority control}}
 
[[వర్గం:నీతి వాక్యాలు]]
"https://te.wikipedia.org/wiki/సకలనీతిసమ్మతము" నుండి వెలికితీశారు