ఆలయశిఖరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
'''ఆలయ శిఖరం''' 1983, మే 7న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రీ లలితా మూవీస్ పతాకంలో [[కోడి రామకృష్ణ]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[చిరంజీవి]], [[సుమలత]] ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా, [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది.
 
== కథా నేపథ్యం ==
గొల్లపుడికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు (రంగనాథ్) ఆ కుటుంబంలో చదువుకున్న ఏకైక వ్యక్తి, నిరుద్యోగి, జూదగాడు. చిన్నవాడు (చిరంజీవి) జట్కా బండి నడుపుతుంటాడు. తన చదువును మధ్యలోనే ఆపేసి అన్న చదువుకోసం కష్టపడతాడు. రంగనాథ్, సత్యనారాయణకు చెందిన ఫ్యాక్టరీలో చేరి ఆ ఇంటికి అల్లుడిని అవ్వాలి అనుకుంటాడు. పువ్వులు అమ్మే సుమలత చిరంజీవిని ప్రేమిస్తుంది. చిరంజీవి తన అన్న, తండ్రి నుండి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు సుమతల, చిరంజీవికి అండగా నిలుస్తుంది. రంగనాథ్ కుటుంబంను విడిచిపెట్టిన తరువాత, చిరంజీవి తన కుటుంబ బాధ్యతను స్వీకరించి, తన చెల్లెలు పెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ రంగనాథ్ తన కుటుంబ పరువు తీసి, బహిరంగంగా వారిని అవమానిస్తాడు. సత్యనారాయణ తన వ్యాపార సమస్యలను పరిష్కరించుకోవడానికి రంగనాథ్‌ను ఉపయోగించుకొని, ఆపై అతన్ని హత్య కేసులో ఇరికిస్తాడు. రంగనాథ్ కు తన కుటుంబం పట్ల ద్వేషం ఉన్నప్పటికీ, చిరంజీవి ఈ కేసు నుండి బయటపడటానికి రంగనాథ్ కు సహాయం చేసి, సత్యనారాయణ మోసాలను బయటపెడుతాడు. తరువాత రంగనాథ్, గొల్లపుడి తమ బాధ్యతలను గ్రహించుకొని, కుటుంబంతో కలుస్తారు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ఆలయశిఖరం" నుండి వెలికితీశారు