ఆకాశరామన్న (2010 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
}}
'''ఆకాశ రామన్న''' 2010 లో జి. ఆశోక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇది రివర్స్ స్క్రీన్ ప్లే తరహాలో రూపొందించబడిన వినూత్న ప్రయోగం.ఈ సినిమాకు సంగీతాన్ని చక్రి అందించాడు. సినిమాటోగ్రఫీని సాయి శ్రీరామ్ నిర్వహించాడు. ఈ చిత్రానికి సంభాషణలు చంద్రశేఖర్ గుండెమెడ రాయగా జి.అశోక్ స్క్రీన్ ప్లె చేసాడు. జి. అశోక్ దర్శకుడిగా ఇది రెండవ చిత్రం. ఎడిటర్ ప్రవీణ్ పూడికి తొలి చిత్రం. ఈ చిత్రం 12 మార్చి 2010 న విడుదలైంది.
 
== కథ ==
పనీపాట లేకుండా తేజ( రాజీవ్ కనకాల) పబ్‌లో తాగుతూ చిందులేస్తుంటాడు. అక్కడ పబ్‌లో ఓ స్వామీజీ( రఘు బాబు) తన శిష్యులతో వచ్చి చిందులేస్తుంటాడు. తనకొచ్చిన అనుమానాల స్వామీజీతో చెప్పి తేజ నివృత్తి చేసుకుంటాడు. తప్పు చేస్తే తగిన శిక్ష దేవుడు విధిస్తాడని చెపుతాడు స్వామీజీ. కానీ తాము అందుకు అతీతులమని స్వామీజి చెప్పిన మరుక్షణంలో కారు యాక్సిడెంట్లో చనిపోతాడు. దాంతో కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని చివరి మాట చెపుతాడు స్వామీజీ. కథాగమనం ఎలా సాగుతుందో ప్రారంభ సన్నివేశంలో తెలిసిపోతుంది. అంటే ఇంకా ఇటువంటి తప్పులు చేసేవారు కొందరున్నారు. వారు ఎన్ని తప్పులు చేశారు. వాటికి తగిన శిక్ష ఎలా పడింది అనేది సినిమా. కాకపోతే ఈ పాయింట్ చెప్పడానికి దర్శకుడు ఎన్నుకున్న కొత్త మార్గం రివర్స్ స్క్రీన్ ప్లే. <ref>{{Cite web|url=https://telugu.webdunia.com/telugu-movie-reviews/ఆకాశ-రామన్న-బుర్రకు-భలే-పదును-110031200071_1.htm|title=Akasa Ramanna Cinema Review, Rajeev Kanakala {{!}} Allari Naresh {{!}} Meera Jasmine {{!}} Gowri Pandit {{!}} ఆకాశ రామన్న.. బుర్రకు భలే పదును..!!|last=NIFT|first=వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC|website=telugu.webdunia.com|language=te|access-date=2020-08-13}}</ref>
 
== తారాగణం ==