తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు: కూర్పుల మధ్య తేడాలు

తిరుమలకు సంభందించిన వ్యాసాలలో కేవలం ప్రయోగాత్మకంగానే ఉన్న విలీనం మూస తొలగింపు
తిరుమల సహస్ర దీపాలంకరణ పేజీ ఇక్కడ విలీనం
పంక్తి 1:
{{విస్తరణ}}
 
 
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[తిరుమల]] శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో అనేక విధాలైన [[పూజలు]] జరుగుతూ ఉంటాయి. ఈ పూజల వివరాలు ఇవి:
Line 6 ⟶ 4:
[[బొమ్మ:Tirumala Sri venkateswara swami sevas.JPG|right|350px|thumb|స్వామి వారి సేవల బోర్డు]]
 
===రోజువారీ సేవలు===
వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. అవి: ''ప్రత్యూష'', ''ప్రభాత'', ''మధ్యాహ్న'', ''అపరాహ్ణ'', ''సాయంకాల'', ''రాత్రి'' పూజలు.
 
Line 19 ⟶ 17:
*'''అష్టోత్తర శతనామార్చన:''' ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.
*'''రెండో గంట, నైవేద్యం:''' అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.
*సహస్ర దీపాలంకరణ: ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామివారు, సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేస్తారు. అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్రదీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా ఆసీనులై, భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయంలో వేదపండితులు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తిస్తారు. నాదస్వరవిద్వాంసులు సుస్వరంగా నాదస్వరాన్ని వినిపిస్తారు. అనంతరం గాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలతోను, పురందర కీర్తనలతోనూ శ్రీవారికి స్వరార్చన చేస్తారు. వేద, నాద, గానాలను ఆలకిస్తూ, మలయప్పస్వామి మెల్లమెల్లగా ఉయ్యాలలూగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
*'''రాత్రి కైంకర్యాలు:''' ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.
*'''ఏకాంతసేవ:''' రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. ''ముఖమంటపం''లో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు. ఏడుకొండలవాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని '''తాళ్లపాక వారి లాలి''' అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలల పాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది.) దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.
Line 25 ⟶ 24:
===ప్రత్యేక సేవలు ===
రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అవి సోమవారం ''విశేషపూజ'', మంగళవారం ''అష్టదళ పాద పద్మారాధన'', గురువారం ''సడలింపు'', ''పూలంగిసేవ'', ''తిరుప్పావడ'', శుక్రవారం ''అభిషేకం''. స్వామికి రోజూ ''కల్యాణోత్సవం'' జరిపిస్తారు. [[డోలోత్సవం]], [[సహస్రదీపాలంకరణ]], ఆర్జిత [[బ్రహ్మోత్సవాలు]] ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి.
*'''సడలింపు:''' గురువారం ప్రాతఃకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు. దీంతో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరం శ్రీవారికి 24మూరల పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్నే సడలింపు అంటారు.
*'''పూలంగిసేవ:''' ఆపాదమస్తకం స్వామివారిని పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ. తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్యమనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.
*'''తిరుప్పావడ:''' భారీసంభారాలతో స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబి తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.