మల్లమ్మ కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
}}
==కథా సంగ్రహం==
నాగలాపురంలో అతి సామాన్యమైన కుటుంబంలో మల్లమ్మ జన్మించింది. చిన్న తనంలోనే తల్లి చనిపోవడంతో అల్లారుముద్దుగా పెంచాడు తండ్రి లింగారెడ్డి. తండ్రి వలె ఆమె శివభక్తురాలు. శివరాత్రి ఉత్సవాలను చూస్తున్న మల్లమ్మను అక్కడున్న అమ్మలక్కలు ఆమె జాతకం మంచిది కాదని పుట్టగానే తల్లిని పోగొట్టుకుందని తిట్టారు. అంత వరకు అమ్మ దేవుని వద్దకు వెళ్ళిందని లింగారెడ్డి చెప్పినమాటలు అబద్ధం అనిపించాయి. అమ్మను చూపించమని శివుని విగ్రహం ముందు మోకరిలి ప్రార్థించాడు. భక్తవశంకరుడైన శివుడు ఆమె తల్లి రూపంలో వచ్చి మల్లమ్మను లాలించాడు. రాత్రంతా తమవద్దమే ఉండమని చిన్నారి మల్లమ్మ చేసిన ప్రార్థనను త్రోసిపుచ్చలేక పోతాడు శివుడు. ఆనంద తాండవం చేస్తూ ఉండగా మధ్యలో అదృశ్యుడైన పరమశివుడు లేకుండా కైలాసం వెలవెల బోతున్నది. అక్కడికి కలహప్రియుడైన నారదుడు వచ్చి భోళాశంకరుడు ఐన వారికి, కాని వారికి వరాలిచ్చి నవ్వులపాలవుతున్నాడనీ, అతడిని అదుపులో ఉంచుకోమని పార్వతిని పురిగొల్పి వెళ్ళిపోయాడు. పాత్రాపాత్రత తెలియకుండా వరాలివ్వకూడదని స్వామీ అని పిలువగానే ఏమీ అని ప్రత్యక్షం కారాదని శివుణ్ణి కట్టడి చేసింది పార్వతి. మల్లమ్మ కారణజన్మురాలని, మహాభక్తురాలని ఆమె పిలుపు విన వెళ్ళకుండా ఉండలేక పోయానని శివుడు ఎంతగా చెప్పినా పార్వతి వినలేదు. నా శక్తి కంటే నీ భక్తురాలి భక్తి ఎక్కువా అని ప్రశ్నించింది పార్వతి. అవును శక్తి కంటే భక్తి గొప్పది అంటాడు శివుడు. శక్తి కంటే భక్తి గొప్పదని నిరూపిస్తానని శివుడు పార్వతితో పందెం కడతాడు. మల్లమ్మకు పెళ్ళీడు వచ్చింది. పాత బంధుత్వాలు మరచిపోకుండా హేమారెడ్డి తన రెండవకొడుకు వెంగళరెడ్డికి మల్లమ్మను ఇచ్చి పెళ్ళి చేశాడు. ఈ సంబంధం పెద్ద కోడలు చండికి ఇష్టం లేదు. తన పెత్తల్లి కూతురును చేసుకోలేదని ఆమెకు కడుపు మంట. అవీ ఇవీ చెప్పి అత్త మనసు పాడుచేసింది. మేనకోడలు చెప్పినట్టుగా అత్త దుర్గ ఆడేది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మల్లమ్మ_కథ" నుండి వెలికితీశారు