కోటీశ్వరుడు (1970 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
== కథ ==
శంకర్‌ (శివాజీ గణేశన్‌) అనే ఒక ధనికుడు పుట్టుకతోనే వికృత రూపం సంతరించుకుంటాడు. పార్వతి (పండరిబాయి) అనే మహిళను పెళ్లిచేసుకుంటాడు. వారికి కణ్ణన్‌ (శివాజీ గణేశన్‌), విజయ్‌ (శివాజీ గణేశన్‌) అనే ఇద్దరు కుమారులు కవల సంతానంగా జన్మిస్తారు. అయితే పెద్ద కుమారుడు కణ్ణన్‌ తండ్రిలాగే ముఖం మీద పెద్ద మచ్చతో పుడతాడు. అతని ముఖ వైకల్యం చూసి తట్టుకోలేని శంకర్‌ తన స్నేహితుడు, వైద్యుడు అయిన రాజు (సుందరరాజన్‌)కు అప్పగించి, పుట్టుకలోనే అతన్ని చంపేయమని కోరుతాడు. అయితే మానవతావాది అయిన ఆ వైద్యుడు, ఆ బాలుణ్ణి ఒక బాబా (చిత్తూరు నాగయ్య) నిర్వహిస్తున్న అనాధాశ్రమంలో వుంచి పెంచుతాడు. ఆ పిల్లవాడు కణ్ణన్‌ పెరిగి పెద్దవాడై చదువులో ప్రధముడుగా వుండడమే కాకుండా సితార్‌ వాద్యం వాయించడంలో నిష్ణాతుడౌతాడు. చిన్నవాడు విజయ్‌ కాలేజీలో తన సహవిద్యార్ధిని నిర్మల/నిమ్మి (జయలలిత)ను ప్రేమిస్తాడు. ఈలోగా కణ్ణన్‌కు బాబా ద్వారా తన జన్మ వృత్తాంతం తెలుస్తుంది. తన తల్లిని, సోదరుణ్ణి కలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. విషయం తెలిసిన తండ్రి అతణ్ణి వారిస్తాడు. అదే సమయంలో కరణ్‌ (నంబియార్‌) అనే శంకర్‌ మీద పగబట్టిన విరోధి, శంకర్‌ మీద ప్రతీకారం తీర్చుకోవాలని విజయ్‌ను అపహరించి బంధిస్తాడు. సినిమా అనేక మలుపులు తిరుగుతుంది. ఆఖరుకు వికలాంగుడైన కణ్ణన్‌ తెగించి కరణ్‌ తో పొరాడి అన్నను రక్షిస్తాడు. ఆ పోరులో కరణ్‌ చనిపోగా, కణ్ణన్‌కు తీవ్రగాయాలవుతాయి. చివరికి తల్లి ఒడిలో కణ్ణన్‌ మరణిస్తాడు.<ref name="శివాజీ మూడు పాత్రల ముచ్చట">{{cite web |last1=సితార |first1=ఆణిమత్యాలు |title=శివాజీ మూడు పాత్రల ముచ్చట |url=https://www.sitara.net/animuthyalu/deiva-magan/19713 |website=www.sitara.net |publisher=ఆచారం షణ్ముఖాచారి |accessdate=15 August 2020 |archiveurl=https://web.archive.org/web/20200815114723/https://www.sitara.net/animuthyalu/deiva-magan/19713 |archivedate=15 August 2020 |language=te}}</ref>
 
== నటవర్గం ==