సీతారామ జననం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణవిస్తరణ
పంక్తి 23:
budget = |
imdb_id = }}
'''సీతారామ జననం''' 1944 లోవిడుదలైన తెలుగు హిందూ పౌరాణిక చిత్రం. ఈ చిత్రాన్ని [[ఘంటసాల బలరామయ్య]] స్వీయ దర్శకత్వంలో ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఇందులో [[అక్కినేని నాగేశ్వరరావు]], త్రిపురసుందరి, [[వేమూరి గగ్గయ్య]], [[ఋష్యేంద్రమణి|రుష్యేంద్రమణి]] ప్రధాన పాత్రలలో నటించారు. సంగీతం ప్రభల సత్యనారాయణ, [[ఓగిరాల రామచంద్రరావు]] సంయుక్తంగా స్వరపరిచారు <ref name="thehindu">{{వెబ్ మూలము|title=Blast From The Past: Sri Sita Rama Jananam (1944)|url=http://www.thehindu.com/features/cinema/blast-from-the-past-sri-sita-rama-jananam-1944/article2931847.ece|publisher=Kasturi and Sons|accessdate=23 July 2016}}</ref> హీరోగా ప్రముఖ నటుడు [[అక్కినేని నాగేశ్వరరావు]]<nowiki/>కూ కోరస్ గాయకుడిగా [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]]<nowiki/>కూ ఇది తొలి చిత్రం. <ref>{{వెబ్ మూలము|url=http://www.cinegoer.com/telugucinema10.htm|title=Archived copy|accessdate=2012-02-19}}</ref>
 
== కథ ==
రావణుడు (వేమూరి గగ్గయ్య) ముల్లోకాలనూ జయించడంతో ఈ సినిమా మొదలౌతుంది.. తన ప్రయాణంలో ఒకసారి, అతను రంభ (సౌదామిని) అందానికి ఆకర్షితుడై ఆమెను వేధిస్తాడు. అది తెలిసిన నలకూబరుడు, ఏ స్త్రీనైనా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అతడు కోరితే, అతడు దగ్ధమై పోతాడని శపిస్తాడు. ఇదేమీ పట్టించుకోని అతని క్రూరత్వం శిఖర స్థాయికి చేరినపుడు, దేవతలందరూ విష్ణువును ప్రార్థించగా, ఆ రాక్షసుడి బాధను తొలగిస్తానని వారికి అభయమిస్తాడు. ఇంతలో, లక్ష్మీదేవి భూమిపై వేదవతి (చంద్రకళ) గా జన్మించింది. ఒక దశలో, రావణుడు ఆమెను మోహించగా, అతడి వంశనాశనానికి కారణమయ్యే వ్యక్తిగా తిరిగి జన్మిస్తానని చెప్పి ఆమె ఆత్మ త్యాగం చేసుకుంటుంది. ఆ తరువాత, వేదవతి లంకలో జన్మిస్తుంది. మందోదరి (కామాక్షి) భయపడి, ఆ శిశువును ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేస్తుంది. చివరికి, దశరథుడు (T. వెంకటేశ్వర్లు), అయోధ్య రాజు సంతానం కోసం తన ముగ్గురు భార్యలతో పుత్రకామేష్ఠి చేస్తాడు. విష్ణువు, ఆదిశేషుడు, శంఖ, చక్రాల అంశలతో అతడికి నలుగురు కుమారులు జన్మిస్తారు, వాళ్ళే రాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు.
 
సమాంతరంగా, మిథిల రాజు జనకుడు (పారుపల్లి సుబ్బారావు) నేలను దున్నుతూండగా నేలలో ఆడశిశువుతో ఉన్న పెట్టె కనిపిస్తుంది. అ బిడ్డకు సీత అని పేరుపెట్టి పెంచుకుంటాడు. సమయం గడిచిపోతుంది. విశ్వామిత్ర మహర్షి (బలిజేపల్లి లక్ష్మీకాంతం) వచ్చి తన యాగ రక్షణ కోసం రాముడిని (అక్కినేని నాగేశ్వరరావు), లక్ష్మణునీ (బిఎన్ రాజు) పంపమని కోరుతాడు. ఈ క్రతువులో విశ్వామిత్రుడూ వారికి శక్తివంతమైన శస్త్రాస్త్రాలను అందిస్తాడు. దీని ద్వారా తాటకి & మారీచా సుబాహులనూ నాశనం చేస్తారు. యాగం ముగుస్తుంది. జనకుడు సీతకు ''స్వయంవరం'' ప్రకటించిన సంగతి తెలిసి, విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో పాటు మిథిలకు వెళ్తాడు. దారిలో, రాముడు అహల్యకు శాపవిమోచనం కలిగిస్తాడు. స్వయంవరంలో, శివుని విల్లును ఎక్కుపెట్టడం సవాలు. రావణుడు కూడా ఆహ్వానం లేకుండా వస్తాడు కాని విల్లును ఎక్కుపట్టలేకపోతాడు. అప్పుడు, రాముడు విల్లును ఎక్కుపెట్టగా అది విరిగిపోతుంది అది తెలుసుకుని, కోపంతో పరశురాముడు (మళ్ళీ వేమూరి గగ్గయ్య) మిథిల వద్ద దిగి రాముడిని ఎదుర్కుంటాడు. తరువాత, రాముడు తన సొంత పునర్జన్మగా గుర్తించి, వెనక్కి వెళ్ళిపోతాడు. చివరగా, సీతా రాముల అద్భుతమైన కళ్యాణంతో ఈ చిత్రం ముగుస్తుంది.
 
== తారాగణం ==
{{Div col}}
*రాముడుగా [[అక్కినేని నాగేశ్వరరావు]]
*సీతగా త్రిపురసుందరి
*రావణుడు, పరశురాముడిగా [[వేమూరి గగ్గయ్య]]
*విశ్వామిత్రుడిగా [[బలిజేపల్లి లక్ష్మీకాంతం]]
*లక్ష్మణుడిగా బి.ఎన్.రాజు
*దశరథుడిగా టి వెంకటేశ్వర్లు
*వశిష్ఠుడిగా పారుపల్లి సత్యనారాయణ
*జనకుడిగా పారుపల్లి సుబ్బారావు
*కుంపట్ల సుబ్బారావు
*శుక్రాచార్యుడిగా కోటేశ్వరరావు
*కౌసల్య గా ఋష్యేంద్రమణి
*కైకేయిగా కమలాకోట్నిస్
*సుమిత్రగా అన్నపూర్ణ
*మండోదరిగా కామాక్షి
*వేదవతిగా చంద్రకళ
*ఊర్మిళగా విజయ
*రంభగా సౌదామిని
*అహల్య గా టి.జి.కమలాదేవి
*మాయా రాక్షసి గా రత్న కుమారి
{{Div col end}}
 
== పాటలు ==
{| class="wikitable"
!S.No
!పాట పేరు
|-
|1
|వందే వందే ముకుంద
|-
|2
|నున్ను జన్మకి
|-
|3
|రణభేరి
|-
|4
|మాకియానా కాదు
|-
|5
|జనకుండు
|-
|6
|బాబా బహుపెదాలము అనాధాలము
|-
|7
|మంథనకు
|-
|8
|నేను నిజముగా
|-
|9
|రారా నా ముద్దుల
|-
|10
|దిక్కు దిక్కుల
|-
|11
|యెన్నీ వర్తములు
|-
|12
|విధి నిభదములై
|-
|13
|సైరను సైరను
|-
|14
|కర్షకా వినవోయ్
|-
|15
|రారే రారే చూతము రారే
|-
|16
|జై జై రఘురామ
|-
|17
|రామ లాలి
|-
|18
|చిరుతిండి
|-
|19
|ఆడుదమా చెలులారా
|-
|20
|ఆహా నే ధన్య నైతిని
|-
|21
|గురుబ్రహ్మా
|}
 
==బయటి లింకులు==
* [http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/55b49e651b70074665256f0300263500/$FILE/Te240075.pdf రూపవాణిలో ఈ సినిమా గురించి]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
 
== మూలాలు ==
<references />
[[వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/సీతారామ_జననం" నుండి వెలికితీశారు