తిలోత్తమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
replace superseded image
పంక్తి 15:
మహాభారతం యొక్క ఆది పర్వంలో దైవర్షి [[నారదుడు]], [[పాండవులు|పాండవుల]]కు అప్సరస తిలోత్తమ కారణంగా సుంద ఉపసుంద అనే రాక్షస సోదరులు మరణించిన కథను చెబుతాడు. పాండవుల మధ్య గొడవలకు [[ద్రౌపది]] కూడా ఒక కారణం కావచ్చని హెచ్చరించాడు. సుంద, ఉపసుంద ఇద్దరూ [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుని]] వంశ రాక్షసుడు నికుంభ కుమారులు. రాజ్యం, మంచం, ఆహారం, ఇల్లు, సింహాసనం మొదలైనవి అన్ని వారు ప్రతిదీ పంచుకుంటూ విడదీయరాని బంధంగా కలిసివున్నారు. ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న కోరికతో ఆ సోదరులు [[వింధ్య పర్వతాలు|వింధ్య పర్వతాల]]పై తపస్సు చేసి, బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నారు. 'తాము ఏ రూపం కోరుకుంటే ఆ రూపంలోకి మారిపోవడం, ఏ మాయ చేయాలన్నా ఆ మాయను చేయగలగడం, అన్యుల చేతుల్లో చావకుండా ఉండడం' వంటి వరాలు కోరారు. బ్రహ్మ వాటిని ప్రసాదించాడు.
 
[[File:TheSagar Churning of the Milky Oceanmathan.jpg|thumb|పాల సముద్ర మధనంలో సముద్రం నుండి ఉద్బవించిన అప్సరసలు.]]
 
బ్రహ్మవరాలు పొందిన సుందోపసుందులు స్వర్గంపై దాడి చేసి దేవతలను తరిమికొట్టడంతోపాటు మునులను, మనుషులను వేధిస్తూ విశ్వాన్ని వినాశనం చేయడం ప్రారంభించారు.<ref name = "adi">Buitenen, Johannes Adrianus Bernardus (1978). ''The Mahābhārata''. vol 1 University of Chicago Press Adi Parva (Book of Beginnings) Cantos 201-204. pp. 392-8</ref> దేవతలు, మునులు బ్రహ్రను ఆశ్రయించగా, బ్రహ్మ విశ్వకర్మను ఒక అందమైన స్త్రీని సృష్టించమని ఆదేశించాడు. మూడు లోకాలలో ఉన్న అందమైన రూపాల నుంచి నువ్వు గింజలంతటి పరిమాణాలతో తిలోత్తమ అనే అప్సరసను సృష్టించాడు.<ref>[https://books.google.com/books?id=HQvbJDacNDMC&pg=PA116&dq=tilottama+Brahma&hl=en&ei=Tp8ATM_0GZK4rAek8sGADw&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CCsQ6AEwAA#v=onepage&q=tilottama%20&f=falseEncyclopaedia Of The Saivism, Volume 1 By Swami P. Anand, Swami Parmeshwaranand] p. 116</ref><ref>[http://www.sacred-texts.com/hin/m13/m13b106.htm The Mahabharata Book 13: Anusasana Parva SECTION CXLI by Kisari Mohan Ganguli, tr.(1883-1896)]</ref>
"https://te.wikipedia.org/wiki/తిలోత్తమ" నుండి వెలికితీశారు