మెకానిక్ అల్లుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 17:
starring = [[అక్కినేని నాగేశ్వరరావు ]],<br>[[చిరంజీవి]],<br>[[ విజయశాంతి]]|
 
|producer=అల్లు అరవింద్|cinematography=లోక్ సింగ్|editing=వెళ్ళైస్వామి|dialogues=సత్యానంద్|story=సత్యానంద్|screenplay=బి. గోపాల్}}
}}
 
'''మెకానిక్ అల్లుడు''' 1993 లో విడుదలైన యాక్షన్ కామెడీ చిత్రం, [[బగ్గిడి గోపాల్|బి. గోపాల్]] దర్శకత్వంలో [[గీతా ఆర్ట్స్]] పతాకంపై [[అల్లు అరవింద్]] నిర్మించాడు.<ref>{{Cite web|url=https://telugu.filmibeat.com/movies/mechanic-alludu.html|title=మెకానిక్ అల్లుడు (1993) {{!}} మెకానిక్ అల్లుడు Movie {{!}} మెకానిక్ అల్లుడు Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat|last=|first=|date=|website=telugu.filmibeat.com|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20200821174618/https://telugu.filmibeat.com/movies/mechanic-alludu.html|archive-date=2020-08-21|access-date=2020-08-21}}</ref> ఇందులో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[చిరంజీవి]], [[విజయశాంతి]] ప్రధాన పాత్రల్లో నటించారు. [[ రాజ్-కోటి|రాజ్-కోటి]] సంగీతం అందించారు.
 
== కథ ==
జగన్నాథం (అక్కినేని నాగేశ్వరరావు) ఒక కోటీశ్వరుడు. తన సోదరి పార్వతి (శుభ) ని తన స్నేహితుడు నారాయణ (సత్యనారాయణ) కిచ్చి పెళ్ళి చేస్తాడు.నారాయణ దుష్టుడు. అతను తన సహచరుడు కోటప్ప (కోట శ్రీనివాస రావు) తో కలిసి, జగన్నాథంను హత్య కేసులో ఇరికిస్తాడు. తన సోదరుడిపై అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వమని భార్య పార్వతిపై వత్తిడి చేస్తాడు. దాంతో జగన్నాధానికి శిక్ష పడుతుంది. ఆ తరువాత, వారు గర్భవతి అయిన పార్వతిని కూడా చంపబోతారు. మహాలక్ష్మి (శారద) ఆమెను రక్షిస్తుంది. తరువాత, ఆమె రవి అనే అబ్బాయికి జన్మనిచ్చిన తరువాత నగరం వదిలి వెళ్లిపోతుంది.
 
సంవత్సరాలు గడిచిపోతాయి. రవి (చిరంజీవి) ఒక చలాకీ యువకుడు. ఉద్యోగం చేసిన ప్రతిచోటా ఏదో ఒక గొడవపడి ఉద్యోగాలు కోల్పోతూంటాడు. సమాంతరంగా, అతను తన ప్రాంతంలో ఒక హోటల్ నడుపుతున్న జగన్నాథం కుమార్తె, ఆడ రౌడీ లాంటి చిట్టి (విజయశాంతి) తో గొడవ పడతాడు. ఆమె కూడా అతడి లాంటిదే. ప్రస్తుతం, జగన్నాథం మెకానిక్‌గా జీవిస్తున్నాడు, ఒకసారి రవి అతన్ని ఒక నర్తకి నుండి రక్షించి అతని షెడ్‌లోనే ఉద్యోగంలో చేరతాడు. కొన్ని ఫన్నీ సంఘటనల తరువాత రవి చిట్టి ప్రేమలో పడతారు. జగన్నాథం కూడా వారి పెళ్ళికి అనుమతిస్తాడు. వారి నిశ్చితార్థం సమయంలో, జగన్నాథం రవిని తన మేనల్లుడిగా తెలుసుకొని కోపంతో ఆ సంబంధాన్ని తిరస్కరిస్తాడు. కానీ తరువాత, నిజం తెలిసాక, జగన్నాథం, రవి కలిసి నారాయణపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. వారు అతని ఇంట్లోకి ప్రవేశించి తమ సంబంధాలతో అతనిని గందరగోళానికి గురిచేస్తారు. ప్రస్తుతం, నారాయణ మహాలక్ష్మిని రెండవ పెళ్ళి చేసుకున్నాడు. నిజం తెలుసుకున్న తర్వాత ఆమె కూడా వారితో కలిసిపోతుంది. ఒక కామిక్ కథ తరువాత, వారు నారాయణకు ఒక పాఠం నేర్పుతారు. అందరూ ఏకమవుతారు. చివరగా, రవి, చిట్టి పెళ్ళితో సినిమా ముగుస్తుంది.
 
== తారాగణం ==
{{Div col}}
* జగన్నాధంగా [[అక్కినేని నాగేశ్వరరావు]]
* రవుగా [[చిరంజీవి]]
* చిట్టిగా [[విజయశాంతి]]
* నారాయణగా [[కైకాల సత్యనారాయణ]]
* కోటప్పగా [[కోట శ్రీనివాసరావు]]
* బాబ్జీగా [[బ్రహ్మానందం]]
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* [[ప్రసాద్ బాబు]]
* మహాలక్ష్మిగా [[శారద]]
* పార్వతిగా [[శుభ]]
* [[జయలలిత]]
* [[హేమ (నటి)|హేమ]]
* [[డిస్కో శాంతి]]
{{Div col end}}
 
== సాంకేతిక సిబ్బంది ==
 
* '''కళ''' : పెకేటి రంగా
* '''కొరియోగ్రఫీ''' : తారా, [[ప్రభుదేవా]]
* '''పోరాటాలు''' : రాజు
* '''కథ - సంభాషణలు''' : సత్యానంద్
* '''సాహిత్యం''' : [[వేటూరి సుందరరామ్మూర్తి|వెటూరి సుందరరామ మూర్తి]], [[భువనచంద్ర|భువన చంద్ర]]
* '''ప్లేబ్యాక్''' : [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలు]], [[కె. ఎస్. చిత్ర|చిత్ర]] ,
* '''సంగీతం''' : [[ రాజ్-కోటి|రాజ్-కోటి]]
* '''ఎడిటింగ్''' : వల్లై స్వామి
* '''సినిమాటోగ్రఫీ''' : లోక్ సింగ్
* '''నిర్మాత''' : [[అల్లు అరవింద్]]
* '''స్క్రీన్ ప్లే - దర్శకుడు''' : [[బగ్గిడి గోపాల్|బి. గోపాల్]]
* '''బ్యానర్''' : [[గీతా ఆర్ట్స్]]
* '''విడుదల తేదీ''' : 27 మే 1993
 
== పాటలు ==
{{Track listing|collapsed=|lyrics3=భువన చంద్ర|extra6=ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర|lyrics6=భువన చంద్ర|title6=జుమ్మనే తుమ్మెద వేట|length5=6:28|extra5=ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర|lyrics5=[[వేటూరి సుందరరామమూర్తి]]|title5=అంబ పలికింది|length4=5:20|extra4=ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర|lyrics4=భువన చంద్ర|title4=గుంతలక్కడి గుండమ్మా|length3=6:25|extra3=ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ|title3=గురువా గురువా|headline=|length2=4:44|extra2=ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర|lyrics2=భువన చంద్ర|title2=చెక్కా చెక్కా చెమ్మ చెక్కా|length1=4:19|extra1=ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|lyrics1=[[భువన చంద్ర]]|title1=ప్రేమిస్తే ప్రాణమిస్తా|all_music=|all_lyrics=|all_writing=|total_length=33:08|extra_column=గాయనీ గాయకులు|length6=5:52}}
 
== మూలాలు ==
<references />
[[వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/మెకానిక్_అల్లుడు" నుండి వెలికితీశారు