గురుత్వాకర్షణ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''గురుత్వాకర్షణ''' అనగా ద్రవ్యరాశి, శక్తి కలిగిన వస్తువులు ఒకదానినొకటి ఆకర్షించుకునే శక్తి. ఇది విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న శక్తి. గ్రహాలు, నక్షత్రాలు, గాలక్సీలు అన్నిటికీ, కాంతికి కూడా గురుత్వ శక్తి ఉంది.
 
భూమి మీద జీవులు, నిర్జీవ వస్తువులూ నిలబడి ఉన్నాయంటే దానికి కారణం భూమి యొక్క గురుత్వాకర్షణే. భూమి గురుత్వాకర్షణ వలనే వస్తువులకు (ద్రవ్యరాశికి) "బరువు" అనే లక్షణం సంతరిస్తోంది. భూమి మీద ఉన్న ఒక వస్తువు యొక్క బరువు భూమి ఆకర్షణ పైన ఆధార పడి ఉంటుంది. అదే వస్తువు చంద్రుడి మీద ఉంటే దాని ద్రవ్యరాశిలో మార్పు ఉండదు కాని బరువు తక్కువ ఉంటుంది. కారణం చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే తక్కువ కాబట్టి.
 
గురుత్వాకర్షణ అనేది ఒక బలం (ఫోర్స్) గాను, అది కేవలం భూమికే పరిమితం కాదనీ, అది విశ్వవ్యాప్తమనీ మొట్టమొదటి సారిగా గుర్తించి, గణితపరంగా సూత్రీకరించినది [[ఐజాక్ న్యూటన్]]. న్యూటన్ సార్వత్రిక గురుత్వ సూత్రం ప్రకారం రెండు వస్తువుల మధ్య ఉండే గురుత్వ బలం వాటి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతం లోను, వాటి మధ్య దూరపు వర్గానికి విలోమానుపాతం లోనూ ఉంటుంది. అయితే అసలు ద్రవ్యానికి గురుత్వ శక్తి ఎందుకు కలుగుతుందో న్యూటన్ సూత్రం చెప్పదు. ఐన్‌స్టీన్ సామాన్య సాపేక్ష సిద్ధాంతం ఈ విషయాన్ని వివరిస్తుంది. ఐన్‌స్టీన్ సామాన్య సాపేక్ష సిద్ధాంతం గురుత్వ శక్తిని బలం (ఫోర్స్) గా కాక, ద్రవ్యరాశి కారణంగా స్పేస్‌టైమ్ వంగడమే గురుత్వం అని చెబుతుంది. స్పేస్‌టైమ్ వంపు తిరగడానికి ఒక ఉదాహరణ [[కృష్ణబిలం|బ్లాక్‌హోల్]]. అపారమైన ద్రవ్యరాశి అతి తక్కువ స్థలం వద్ద కేంద్రీకరించబడి ఉండే బ్లాక్‌హోల్‌ లోకి వెళ్ళిన ఏ వస్తువూ - కాంతితో సహా - తప్పించుకోజాలదు.<ref>{{Cite web|url=http://hubblesite.org/explore_astronomy/black_holes/home.html|title=HubbleSite: Black Holes: Gravity's Relentless Pull|website=hubblesite.org|access-date=2016-10-07}}</ref>
 
నాలుగు ప్రాథమిక బలాలైన స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, [[విద్యుదయస్కాంతత్వం|ఎలెక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్]], వీక్ న్యూక్లియర్ ఫోర్స్, గురుత్వం లలో గురుత్వం అత్యంత బలహీనమైనది. గురుత్వం స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సులో 10<sup>38</sup> వ వంతు, ఎలెక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్సులో 10<sup>36</sup> వ వంతు, వీక్ న్యూక్లియర్ ఫోర్సులో 10<sup>29</sup> వ వంతూ ఉంటుంది. ఈ కారణంగా పరమాణువు కంటే చిన్నవైన పదార్థాల స్థాయిలో దీని ప్రభావం గణనీయంగా ఉండదు.<ref>{{cite book|title=Scientific Development and Misconceptions Through the Ages: A Reference Guide|edition=illustrated|first1=Robert E.|last1=Krebs|publisher=Greenwood Publishing Group|year=1999|isbn=978-0-313-30226-8|page=133|url=https://books.google.com/books?id=4iApVikcj9UC}} [https://books.google.com/books?id=4iApVikcj9UC&pg=PA133 Extract of page 133]</ref> దీనికి విరుద్ధంగా, ఖగోళ వస్తువుల స్థాయిలో గురుత్వం అత్యంత ప్రభావశీలమైనది. దీని కారణంగానే ఖగోళ వస్తువులు ఏర్పడుతాయి, వాటి ఆకారాన్ని పొందుతాయి, వాటి కక్ష్యలు ఏర్పడుతాయి. గురుత్వ శక్తి కారణంగానే [[గేలక్సీ|గాలక్సీ]]లు, [[నక్షత్రము (ఖగోళశాస్త్రం)|నక్షత్రాలూ]] ఏర్పడ్డాయి, [[సౌర కుటుంబం|సౌర వ్యవస్థ]] ఏర్పడింది, [[భూమి]] తదితర గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. [[చంద్రుడు]] భూమి చుట్టూ పరిభ్రమిస్తోంది. సముద్రాల్లో కెరటాలు ఏర్పడుతున్నాయి.
 
== గురుత్వాకర్షణ సిద్ధాంతపు చరిత్ర ==
 
"https://te.wikipedia.org/wiki/గురుత్వాకర్షణ" నుండి వెలికితీశారు