గురుత్వాకర్షణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
===శాస్త్రీయ విప్లవం ===
గురుత్వాకర్షణపై ఆధునిక కాలంలో పరిశోధన 16, 17 శతాబ్దాల్లో [[గెలీలియో గెలీలి|గెలీలియో గెలీలీ]] తో మొదలైంది. పీసా టవరుపైనుండి బంతులను జారవిడిచి చేసిన ప్రసిద్ధ పరిశోధన ద్వారా వస్తువులన్నింటికీ గురుత్వ త్వరణం సమానంగా ఉంటుందని అతడు చూపించాడు. బరువైన వస్తువులకు గురుత్వ త్వరణం ఎక్కువ ఉంటుందనే అరిస్టాటిల్ భావనకు ఇది విరుద్ధం.<ref>[[Galileo]] (1638), ''[[Two New Sciences]]'', First Day Salviati speaks: "If this were what Aristotle meant you would burden him with another error which would amount to a falsehood; because, since there is no such sheer height available on earth, it is clear that Aristotle could not have made the experiment; yet he wishes to give us the impression of his having performed it when he speaks of such an effect as one which we see."</ref> తేలికైన వస్తువులు నిదానంగా కింద పడేందుకు కారణం గాలి నిరోధమని గెలీలియో సిద్ధాంతీకరించాడు. న్యూటన్ గురుత్వ సిద్ధాంతానికి గెలీలియో పరిశోధన రంగం సిద్ధం చేసింది.<ref>{{cite book|title=Quantum Theory: A Mathematical Approach|edition=illustrated|first1=Peter|last1=Bongaarts|publisher=Springer|year=2014|isbn=978-3-319-09561-5|page=11|url=https://books.google.com/books?id=Cc6lBQAAQBAJ}} [https://books.google.com/books?id=Cc6lBQAAQBAJ&pg=PA11 Extract of page 11]</ref>
 
=== న్యూటన్ గురుత్వ సిద్ధాంతం ===
[[File:Sir_Isaac_Newton_(1643-1727).jpg|link=https://en.wikipedia.org/wiki/File:Sir_Isaac_Newton_(1643-1727).jpg|ఎడమ|thumb|సర్ ఐసాక్ న్యూటన్ (1642-1727)]]
1687 లో సర్ ఐసాక్ న్యూటన్ తన ప్రిన్సిపియా అనే గ్రంథంలో సార్వత్రిక గురుత్వ నియమాన్ని ప్రవచించాడు. అతని మాటల్లోనే, "గ్రహాలను తమతమ కక్ష్యల్లో నిలిపి ఉంచే బలాలు, వాటి కేంద్రాల మధ్య దూరానికి విలోమంలో ఉండాలని భావించాను. దాన్ని బట్టి చంద్రుడిని దాని కక్ష్యలో నిలిపి ఉంచేందుకు అవసరమైన బలాన్ని, భూతలంపై ఉన్న గురుత్వాకర్షణ బలాన్నీ పోల్చి చూసాను. అవి దాదాపుగా సరిపోయాయి."<ref>* {{cite book|first=Subrahmanyan|last=Chandrasekhar|authorlink=Subrahmanyan Chandrasekhar|title=Newton's Principia for the common reader|date=2003|publisher=Oxford University Press|location=Oxford}} (pp. 1–2). The quotation comes from a memorandum thought to have been written about 1714. As early as 1645 [[Ismaël Bullialdus]] had argued that any force exerted by the Sun on distant objects would have to follow an inverse-square law. However, he also dismissed the idea that any such force did exist. See, for example,
{{cite book|title=From Eudoxus to Einstein – A History of Mathematical Astronomy|author=Linton, Christopher M.|publisher=Cambridge University Press|date=2004|location=Cambridge|page=225|isbn=978-0-521-82750-8|ref=Linton-2004}}</ref> అతడి సమీకరణం ఇది:
 
<math>F = G \frac{m_1 m_2}{r^2}\ </math>
 
''F'' అనేది బలం, ''m<sub>1</sub>'', ''m<sub>2</sub>'' లు వస్తువుల ద్రవ్యరాశులు, ''r'' ఆ రెండు వస్తువుల కేంద్రాల మధ్య దూరం, ''G'' [[సార్వత్రిక గురుత్వాకర్షణ స్దిరాంకం|గురుత్వాకర్షణ స్థిరాంకం]].
 
ఈ సిద్ధాంతం ఆధారంగా, యురేనస్ కదలికలను బట్టి నెప్ట్యూన్ ఉనికిని కనుక్కోవడం ఈ సిద్ధాంతపు అత్యంత గొప్ప విజయం.
 
[[బుధుడు|బుధ గ్రహపు]] కక్ష్యలో గోచరించిన వైరుద్ధ్యం న్యూటన్ సిద్ధాంతం లోని లోపాలను ఎత్తి చూపింది. 19 వ శతాబ్దపు అంతంలో గమనించిన బుధుడి కక్ష్యలోని వైకల్యాన్ని న్యూటన్ సిద్ధాంతం వివరించలేకపోయింది. ఈ వైకల్యాన్ని కలిగించగలిగే మరేదైనా ఖగోళ వస్తువు కోసం పరిశోధించినా అది కనబడలేదు.1915 లో ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సామాన్య సాపేక్షతా సిద్ధాంతం ఈ స్సమస్యను పరిష్కరించింది. ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం బుధుడి కక్ష్యలో పెరిహీలియన్ శతాబ్దానికి 42.98 ఆర్క్‌సెకండ్ల పాటు ముందుకు జరుగుతుంది. ఈ వైకల్యానికి అదే కారణం.<ref>{{Cite journal|last=Nobil|first=Anna M.|date=March 1986|title=The real value of Mercury's perihelion advance|url=https://www.nature.com/articles/320039a0|journal=Nature|volume=320|issue=6057|pages=39–41|via=|bibcode=1986Natur.320...39N|doi=10.1038/320039a0}}</ref>
 
న్యూటన్ సిద్ధాంతాన్ని ఐన్‌స్టీన్ సిద్ధాంతం అధిగమించినప్పటికీ, సాధారణ గురుత్వాకర్షణ మదింపులన్నిటికీ దాన్నే వాడుతున్నారు.
<br />
"https://te.wikipedia.org/wiki/గురుత్వాకర్షణ" నుండి వెలికితీశారు