భారతంలో అర్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
పంక్తి 7:
music = [[చక్రవర్తి]]|
starring = [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]],<br>[[కుష్బూ]],<br>[[అరుణ]]|
|producer=కె.ఎస్. ప్రకాశరావు|screenplay=కె రఘవేంద్రరావు|dialogues=పరుచూరి సోదరులు|editing=కోటగిరి వెంకటేశ్వరరావు|cinematography=కె.ఎస్. ప్రకాష్|story=జావేద్ అఖ్తర్}}
}}
 
'''భారతంలో అర్జునుడు''' 1987 లో వచ్చిన సినిమా. [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో, ప్రకాష్ స్టూడియోస్ బ్యానర్లో [[కోవెలమూడి సూర్యప్రకాశరావు|కెఎస్ ప్రకాశరావు]] నిర్మించాడు. [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం అందించాడు. [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[కుష్బూ]] ముఖ్యపాత్రల్లో నటించారు. <ref>{{వెబ్ మూలము|url=http://chithr.com/movie/cast/414/bharatamlo-arjunudu-cast.html|title=Bharatamlo Arjunudu ( 1987 )}}</ref> <ref>{{వెబ్ మూలము|url=http://popcorn.oneindia.in/movie-cast/10906/bharathamlo-arjunudu.html|title=Bharathamlo Arjunudu Cast and Crew &#124; Star Cast &#124; Telugu Movie &#124; Bharathamlo Arjunudu Actor &#124; Actress &#124; Director &#124; Music &#124; Oneindia.in}}</ref> <ref>{{వెబ్ మూలము|url=http://www.filmlinks4u.net/2010/06/bharatamlo-arjunudu-1987-telugu-movie-watch-online.html|title=Bharatamlo Arjunudu (1987) – Telugu Movie Watch Online &#124; Watch Latest Movies Online Free}}</ref> ఇది హిందీ చిత్రం ''[[అర్జున్]]'' కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది. <ref>{{వెబ్ మూలము|url=http://www.idlebrain.com/news/2000march20/venkatesh-centers.html|title=Success and centers list - Venkatesh}}</ref>
{{మొలక-తెలుగు సినిమా}}
 
== కథ ==
అర్జున్ (వెంకటేష్) నిరుద్యోగి, సహనం, దయగలవాడు. అతని తండ్రి దశరథరామయ్య ( [[పి.ఎల్. నారాయణ|పిఎల్ నారాయణ]] ), సవతి తల్లి (తాతినేని రాజేశ్వరి), సవతి సోదరి కల్యాణి (సంయుక్త) లతో కలిసి జీవిస్తున్నాడు. ఒక రోజు అర్జున్, మామూలు చెల్లించనందుకు పేదవాడిని కొడుతున్న రౌడీలను కొడతాడు. ఉంగరాల రామప్ప, ఉంగరాల కిష్టప్ప (పరుచూరి సోదరులు ) ల మనుషులు వాళ్ళు. వీళ్ళిద్దరికీ ఎమ్మెల్యే బెనర్జీ ( [[రావు గోపాలరావు]] ) అండ ఉంది. ఈ సంఘటనతో, అర్జున్ జీవితం మారుతుంది; అతను స్థానిక గూండా కోపానికి గురౌతాడు. ఉగరాల కిష్టప్ప అతడి తల్లిదండ్రులను బెదిరించి, చెల్లెలును అవమానిస్తాడు. దాంతో కోపించిన అర్జున్ అతన్ని కొడతాడు. అతని కార్యకలాపాలన్నింటినీ నాశనం చేస్తాడు. అర్జున్ అరెస్టు అవుతాడు. సిఐ కేశవ రావు ( [[నూతన్ ప్రసాద్]] ), బెనర్జీ ఆజ్ఞ మేరకు అతనికి ఒక హెచ్చరిక చేసి వదిలేస్తాడు. కాని ఒక ఇన్స్పెక్టర్ శేఖర్ ( [[బేతా సుధాకర్|సుధాకర్]] ) అర్జున్ చేస్తున్నది సరైన పని అని భావిస్తాడు. అతను అర్జున్ సోదరితో ప్రేమలో పడతాడు. అర్జున్, అనే సెన్సేషనల్ జర్నలిస్టూ, తన కాలేజీ మేటూ అయిన సుభద్ర ( [[కుష్బూ]] ) తో ప్రేమలో పడ్డాడు.
 
త్వరలోనే, అర్జున్ ప్రజల దృష్టిని ఆకర్షించడం ప్రారంభిస్తాడు. ఎమ్మెల్యే బెనర్జీ కూడా అర్జున్ గురించి తెలుసుకుంటాడు. అతను సామాజిక సంస్కర్త అయిన తన ప్రత్యర్థి రంగనానాయకులు ( [[రంగనాథ్]] ) కోసం అర్జున్ పనిచేస్తున్నాడని అనుకుంటాడు. అర్జున్, అతని స్నేహితులను తొలగించాలని బెనర్జీ ఆదేశిస్తాడు. అర్జున్ స్నేహితుడు గోఖలే ( [[సాయి కుమార్]] ) ను ఈ ముఠా బహిరంగంగా దాడి చేసి చంపేస్తుంది. అర్జున్ తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ, భయంతో హత్యకు సాక్ష్యమివ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఈ కారణంగా హంతకులు విడుదల అవుతారు. వెంటనే అర్జున్ కుటుంబం అతన్ని ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది. అతన్ని రంగనాయకులు సంప్రదించి, తన ఇంటికి ఆహ్వానించి తన సొంత కొడుకుగా చూస్తాడు. అర్జున్ సహాయంతో, రంగనాయకులు బెనర్జీ యొక్క అన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలను నాశనం చేస్తాడు. తన సోదరి కల్యాణికి ఆమె కోరిక మేరకు శేఖర్‌తో పెళ్ళి చేస్తాడు. అతని తండ్రి పనిచేస్తున్న దుకాణ యజమానిని కూడా చక్కబెడతాడు. చివరగా, రంగనాయకులు బెనర్జీకి వ్యతిరేకంగా కొన్ని రహస్య ఫైళ్లు, పత్రాలను సంపాదించమని అర్జున్‌కు చెబుతాడు. వాటిద్వారా అతని బండారాన్ని బట్టబయలు చెయ్యవచ్చు. అర్జున్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ రహస్య ఫైల్ను సంపాదిస్తాడు.
 
ఇప్పుడు కథ ఒక మలుపు తీసుకుంటుంది; రంగనాయకులు తనతో డబుల్ గేమ్ ఆడి బెనెర్జీతో చేతులు కలిపిన ఒక గుంటనక్క అని అర్జున్ తెలుసుకుంటాడు. అతడు వాగ్దానం చేసినట్లు తాను సేకరించిన ఆధారాలు ఏవీ నిజంగా ఎక్కడా ప్రచురించబడలేదు. నిరాశతో, కోపంతో, అర్జున్ వారి ప్రసంగ ర్యాలీలో రాజకీయ నాయకులతో పోరాడటానికి వెళతాడు, కాని అతన్ని విసిరి కొడతారు. చివరగా, అర్జున్ అన్ని సాక్ష్యాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. వాటిని ప్రజల ముందు కోర్టు ముందు ఉంచుతాడు. దుష్టులందరినీ అరెస్టు చేస్తారు. అర్జున్ సుభద్రల పెళ్ళితో చిత్రం ముగుస్తుంది.
 
== తారాగణం ==
{{Div col}}
*[[దగ్గుబాటి వెంకటేష్]]
*[[కుష్బూ]]
*[[రావు గోపాలరావు]]
*[[అల్లు రామలింగయ్య]]
*[[నూతన్ ప్రసాద్]]
*[[రంగనాథ్]]
*[[కోట శ్రీనివాసరావు]]
*[[సుధాకర్ (నటుడు)|సుధాకర్]]
*[[పరుచూరి సోదరులు]]
*[[చలపతిరావు తమ్మారెడ్డి]]
*[[సాయి కుమార్]]
*[[పి.ఎల్. నారాయణ]]
*[[మాడా వెంకటేశ్వరరావు]]
*[[ముచ్చెర్ల అరుణ]]
*సంయుక్త
*తాతినేని రాజేశ్వరి
*[[నిర్మలమ్మ]]
{{Div col end}}
 
== పాటలు ==
{| class="wikitable"
!ఎస్
!పాట పేరు
!గాయకులు
!పొడవు
|-
|1
|"నీకు నాకు కుదిరేను"
|[[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలు]], [[ఎస్. జానకి|ఎస్.జానకి]]
|4:16
|-
|2
|"గోంగూర సేలోనా"
|ఎస్పీ బాలు, ఎస్.జానకి
|4:30
|-
|3
|"అంధాలా కోనలో"
|ఎస్పీ బాలు, ఎస్.జానకి
|4:51
|-
|4
|"నీ మగసిరి"
|ఎస్పీ బాలు, ఎస్.జానకి
|4:48
|-
|5
|"అగ్ని శిఖల"
|ఎస్పీ బాలు
|3:12
}|}
 
== మూలాలు ==
<references />
"https://te.wikipedia.org/wiki/భారతంలో_అర్జునుడు" నుండి వెలికితీశారు