గృహోపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

మొలక పరికరాల వ్యాసం మూస తొలగింపు
విలీనం
పంక్తి 12:
=== '''అపక''' ===
[[అపక]] లేదా అబక: దీనిని [[కొబ్బరి]] చిప్పతో తయారు చేస్తారు. దీనిని వంటింటి పాత్రలుగా వాడేవారు.కొబ్బరి చిప్పను అంచులు సమాంతరంగా వచ్చేలా అరగదీసి దానికి క్రింది భాగాన సమాంతరంగా రెండు చిన్న రంద్రాలు చేసి దానిలో ఒక వెదురు పుల్లను దూర్చి తయారు చేస్తారు. [[గరిటె]] వలె దీనిని ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి చిన్నది, పెద్దది అపకలు తయారు చేసుకుంటారు. గతంలో వీటి ఉపయోగము ఎక్కువగా వుండేది. ఇవి వంటింటి సామానులలో ఒక భాగము.పొలాల్లో వంటల కొరకు, చిట్టూ, తవుడు దాణా కలుపుటకు వాడేవారు. వులవలు ఉడీకించినపుడు తెడ్డులా కలుపుటకు తీయుటకు వాడుతా
 
=== తలుపు ===
తలుపులు ద్వారానికి బిగిస్తారు. ఇవి [[కలప|కలపతో]] తయారుచేస్తారు. రక్షణ కోసం వీనికి [[తాళాలు]] వేసేందుకు వివిధ రకాలైన ఏర్పాట్లు చేస్తారు.
 
=== తువ్వాలు ===
'''తువ్వాలు''' [[ముఖం]], [[శరీరం|ఒళ్ళు]] తుడుచుకోవడానికి వాడే బట్ట. వీటిని [[నీరు]] పీల్చడానికి అనువుగా నూలు దారాలతో అల్లి తయారుచేస్తారు.
 
=== తొట్టి లేదా గాబు ===
'''తొట్టి''' ఆధునిక కాలంలో కొంతమంది స్నానానికి ఈ తొట్టెలను ఉపయోగిస్తున్నారు. దీనిని పెద్దవైన స్నానాల గదిలో బిగించి ఉంచుతారు. తొట్టెను నీటితో నింపి అందులో పడుకొని [[స్నానం]] చేసేటందుకు సౌకర్యంగా ఉంటుంది.
 
=== తక్కెడ లేక త్రాసు ===
'''తక్కెడ''' (త్రాసు, తుల, తరాజు) అనేది సరుకుల [[బరువు|బరువును]] తూచేందుకు లేదా నిర్ణయించేందుకు ఉపయోగించే సాధనం. ఒక సమాంతర [[దండము|దండం]] కర్ర మధ్య చేతిలో పట్టుకొనేందుకు వీలుగా ఒక తాడు ఉండి ఆ దండానికి రెండు చివరల తాళ్ళ సహాయంతో రెండు పళ్ళాలు వేళ్ళాడుతుంటాయి. పళ్ళేలలో ఒక వైపు నిర్ణయాత్మక బరువు కలిగిన రాళ్ళను ఉంచి మరొక వైపు కావలసిన సామాను లేదా సరుకులను ఉంచి బరువు తూస్తారు. వీటిలో [[సున్నితపు త్రాసు]], ఇనుప తక్కెడలు, వెదురు తక్కెడలు అనే రకాలు ఉంటాయి.
 
=== తలగడ లేదా దిండు ===
'''తలగడ''' '''దిండు''' లేదా ఒక మెత్తని వస్తువు. వీటిని [[పరుపు]] మీద గాని నేలమీద గాని పడుకొనేటప్పుడు [[తల]] క్రింద సుఖంగా నిద్రపోవడానికి ఉపయోగిస్తారు. దీని మధ్యలో [[దూది]] లేదా పత్తి ఉండి చుట్టూ వివిధ రకాల గుడ్డతో కుట్టి తయారుచేస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గృహోపకరణాలు" నుండి వెలికితీశారు