గృహోపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

విలీనం
విలీనం
పంక్తి 27:
=== తలగడ లేదా దిండు ===
'''తలగడ''' '''దిండు''' లేదా ఒక మెత్తని వస్తువు. వీటిని [[పరుపు]] మీద గాని నేలమీద గాని పడుకొనేటప్పుడు [[తల]] క్రింద సుఖంగా నిద్రపోవడానికి ఉపయోగిస్తారు. దీని మధ్యలో [[దూది]] లేదా పత్తి ఉండి చుట్టూ వివిధ రకాల గుడ్డతో కుట్టి తయారుచేస్తారు.
 
=== ద్వారం ===
'''ద్వారం''' ఇళ్ళు మొదలైన కట్టడాల లోపలికి ప్రవేశించడానికి అనువుగా [[గోడ|గోడలలో]] అమర్చినవి. ఇవి [[కలప|కలపతో]] తయారుచేస్తారు. రక్షణ కోసం వీనికి [[తలుపు|తలుపులు]] బిగిస్తారు.
 
=== చట్టి ===
[[చట్టి]] అనగా మట్టితోచేసిన ఒక పాత్ర. గతంలో వీటిని పల్లెవాసులు ఎక్కువగా వాడే వారు. దీని మూతి వెడల్పుగా వుంటుంది. వీటిని వంటలకు మాత్రమే ఉపయోగిస్తారు. పాలచట్టి, కూర చట్టి, సంగటిచట్టి, ఇలా దేనికది వేరువేరుగా వుంటాయి. ప్రస్తుతం ఇవి వాడుకలో లేకున్నా ఈ మట్టి పాత్రలలో చేసిన వంట రుచిగా వుంటుందని, ఆరోగ్యానికి కూడ మంచిదని ఇప్పుడంటున్నారు. పెద్ద హోటళ్ళలో వంటలను ఈ మట్టి పాత్రలలో చేసి వడ్డిస్తున్నారు. ఆ విదంగానైనా వాటి వునికిని కాపాడుతున్నారు.
 
=== చుట్ట కుదురు ===
దీనిని తాటాకు లేదా [[గడ్డి|గడ్డితో]] [[చక్రం|చక్రంలాగ]] తయారు చేస్తారు. తాటి ఆకులతో కూడ తయారు చేస్తారు. మట్టికుండల, మట్టి చట్టి ఇల ఏ మట్టి పాత్రలకు అడుగు భాగము చదునుగా వుండదు, కనుక నేలమీద పెడితే అవి నిలబడవు. అందుకని ఈ చుట్టకుదురులని వాటి కొరకు వాడతారు. [[కుండలు]] కుదురుగా కూర్చోవడానికే కాక వాటికి మెత్తదనాన్నిచ్చి అవి పగిలిపోకుండా కాపాడతాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గృహోపకరణాలు" నుండి వెలికితీశారు