పురందర దాసు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==జీవితచరిత్ర==
పురందర దాసు క్రీ.శ. 1484లో [[పూనా]] సమీపాన గల గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి వరదప్ప నాయక్ ప్రముఖ వడ్డీ వ్యాపారి. తల్లిదండ్రులు [[వెంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] భక్తులగుటచేత పురందరునికి శ్రీనివాస నాయక్ అని నామకరణం చేశారు. శ్రీనివాసుడు బాల్యంలో సంస్కృతం, కన్నడం చదువుకున్నాడు. తరువాత సరస్వతీ బాయినిచ్చి పెండ్లి చేశారు. తండ్రి చనిపోయిన తరువాత ఆతని అడుగుజాడలలో వ్యాపారం చేస్తూ లక్షలకు లక్షలు గడించాడు. మిక్కిలి ధనవంతునిగా గణనకెక్కాడు. పిసినారిగా కూడా ప్రసిద్ధిగాంచాడు. ఒకనాడు పరమేశ్వరుడు భార్యద్వారా జ్ఞానోదయం కలిగించాడు. పిదప తన సర్వస్వం బీదలకు పంచిపెట్టి, కట్టుబట్టలతో విద్యానగరం (హంపీ[[విజయనగరం (కర్ణాటక)|విజయనగరం]]) చేరాడు. వ్యాసరాయలను ఆశ్రయించాడు. నాటి నుండి శ్రీనివాసులు పురందర దాసుగా దేశం నలుమూలలా హరినామ సంకీర్తనం చేస్తూ తిరిగాడు. సాధారణ భక్తి భావం మొదలుకొని, కీలకమైన తత్త్వబోధ ఆయన కీర్తనలలో కనిపిస్తాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/పురందర_దాసు" నుండి వెలికితీశారు