వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా?: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
* ఆంగ్ల అక్షరాల్లో zhగా రాసే తమిళ, మలయాళ అక్షరాలు కొందరు ఝ అనీ, జ అనీ రాస్తూ ఉంటారు. ఉదాహరణకు కోజిక్కోడ్ వంటివి. దీని విషయమై కూడా మార్గదర్శకంలో స్పష్టత ఉండాలి.
మొత్తంగా ఇది చాలా అవసరమైన పాలసీ. దీన్ని సమర్థిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 03:01, 3 జూలై 2020 (UTC)
:: ఇది చాలా క్లిష్టమైన సమశ్య. ఒక్క పెట్టున ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడో ఒకచోట పప్పులో కాలేసే ప్రమాదం ఉంది. మనం ప్రపంచాన్ని ఇంగ్లీషు పట్టకం ద్వారా చూస్తున్నాం కనుక ఇంగ్లీషు వాడకం మనని బాగా ప్రభావితం చేసింది. రష్యాలో Tolstoy ని ఎలా పలుకుతారో అదే విధంగా తెలుగులో రాస్తే అది తప్పని భ్రమ పడేవారు ఉన్నారు. Guy De de maupassant పేరు నిజంగా ఎలా పలకాలో ఎంతమందికి తెలుసు? అంతవరకు ఎందుకు? మనవాళ్ళు కంప్యూటరు రంగంలో నిష్ణాతులు కదా! ఇండియాలో abc@gmail.com లో @ ని "at the rate of" అని అనేవాళ్ళు కొల్లలు. అది తప్పు అని చెబితే "ఇండియాలో ఇలానే అంటాం. ఇలా అంటేనే అర్థం అవుతుంది" అని సమాధానం చెప్పేరు. కనుక ఇది తొందరపడి చెయ్యవద్దని నా మనవి. వికీపీడియా లో చెయ్యవలసిన పనులు, నలుగురికీ ఉపయోగపడేవి ఇంకా చాలా ఉన్నాయి. ఏదో నాకు తోచినది, నా అనుభవంలోకి వచ్చినది చెప్పేను. నమస్కారం [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 23:03, 25 ఆగస్టు 2020 (UTC)